సేఫ్టీలో మహీంద్రా కారుకి 5 స్టార్ రేటింగ్.. దేశంలో ఎక్కువ డిమాండ్ ఉన్న కారు ఇదే.. దీనికోసం ఏడాది ఆగాల్సిందే
మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO BNCAP (Bharat New Car Assessment Programme) క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌తో మెరిసింది. పెద్దల, పిల్లల సఫ్టీ ప్రొటెక్షన్‌లో టాటా నెక్సాన్స్‌తో సమానంగా స్కోర్ సాధించి సత్తా చాటింది. ఈ క్రాష్ టెస్ట్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO లోని AX 7 L, MX 2 వేరియంట్లు ఈ సేఫ్టీ టెస్ట్‌ని ఎదుర్కోంది. అయితే రేటింగ్స్ మొత్తం లైనప్‌నికి వర్తిస్తాయని కస్టమర్లు గుర్తించాలి. తాజా రేటింగ్‌తో మహీంద్రా కార్లు మార్కెట్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ కారుకి ప్రస్తుతం ఉన్న డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సేఫ్టీ వివరాలు ఈ కథనంలో..
దేశంలో మహీంద్రా కార్ల అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి. ఆ కంపెనీకి చెందిన ప్రతీ కారు మార్కెట్‌లో హిట్ అవుతోంది. సెప్టెంబర్ నెలలో దేశంలోని మొత్తం కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్‌ని అదిగమించింది. వరుసగా సెప్టెంబర్, అక్టోబర్‌లో టాటా మోటర్స్‌ని అధిగమించి మూడవ స్థానానికి ఎగబాకింది. మహీంద్రా కార్ల అమ్మకాల్లో ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV 700), స్కార్పియో (Scorpio), థార్ (Mahindra Thar) వంటి కార్లను జనాలు ఎక్కువగా కొంటున్నారు.

ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా ఉంది. ఈ కారు వెయిటింగ్ పీరియడ్ ఏడాదికి పైగానే ఉంది. ఈ ఎస్‌యూవీ తాజాగా భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లోనూ సత్తా చాటింది. ఇది పెద్దల సేఫ్టీలో XUV 3XO 32 పాయింట్లకు గానూ 29.36 పాయింట్లు సాధించింది. ఓవరాల్‌గా పెద్దలకు ఈ కారులో మంచి సేఫ్టీ లభించనుంది.
ఇక పిల్లల సేఫ్టీలో 49 పాయింట్లకు గాను 43 పాయింట్లు సాధించి దుమ్మురేపింది. దీనితో పాటు థార్ రాక్స్, ఎక్స్‌యూవీ400 లు కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్స్‌ని సాధించాయి. కూడా అధిక రేటింగ్స్ వచ్చాయి. ఈ ఎస్‌యూవీని మహీంద్రా ఎక్స్‌యూవీ 300కి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా తీసుకువచ్చింది. ఇది కూడా క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించింది. జనవరి 2020 లో గ్లోబల్ GNCAPలో ఈ స్కోర్ సాధించింది.

దేశంలో మహీంద్రా కార్ల అమ్మకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీకి చెందిన కార్లు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. మహీంద్రా లైనప్స్‌లో జనాలు ఈ కారుని ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధరలో మంచి ఫీచర్లు, భారీ డిజైన్‌తో అమ్మకాల్లో టాప్‌లో కొనసాగుతోంది. దీని కారణంగా ఈ ఎస్‌యూవీ టాప్ లిస్ట్‌లో చేరిపోయింది.
బేస్ వేరియంట్‌ని పొందాలంటే కనీసం ఒక సంవత్సరం వెయిట్ చేయాల్సి ఉంది. సేఫ్టీ పరంగా మహీంద్రా XUV 3XO లో హై సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఫోర్-వీల్ డిస్క్ బ్రేక్స్, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్ పాయింట్స్, లెవెల్ 2 ADAS సెటప్‌తో సహా అనేక ఫీచర్లను ఉన్నాయి.
ఇక ఈ మహీంద్రా ఎస్‌యూవీ రూ.7.49 లక్షల నుంచి రూ.15.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఈ కారు మార్కెట్‌లో టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజా వంటి సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గట్టి పోటీని ఇస్తుంది. మార్కెట్‌లో ఇంత తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీని సాధించి రికార్డు నెలకొల్పింది. ఈ కారు నేరుగా టాటా నెక్సాన్ అమ్మకాలను దెబ్బతీసింది.


Click it and Unblock the Notifications








