Mahindra XUV 3XO Full Review Video మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ వీడియో
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా.. త్వరలో ఈవీని విడుదల చేయనుంది. ఈ క్రమంలో ఈవీ సెగ్మెంట్‌లోకి ప్రవేశిస్తున్న ఈ దిగ్గజ దేశీ ఆటో మేకర్.. ఇటీవల XUV 3XO ను అట్టహాసంగా లాంచ్ చేసింది. ఇందులో ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్, ఫీచర్ల పరంగా సంస్థ భారీ మార్పులు చేసింది. పూర్తి రివ్యూ వీడియోను ఈ కథనంంలో చూడండి.
మహీంద్రా XUV 3XO ఎక్స్‌టీరియర్ డిజైన్ దాని ముందున్న XUV 3OOతో పోల్చినప్పుడు ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. మహీంద్రా దాని ఫ్లాగ్‌షిప్ XUV 7OO ఫ్రంట్ ఎండ్ ఆధారంగా.. దాని పరిమాణంలో సర్దుబాటు చేసింది. మీరు XUV 3XO క్యాబిన్‌లోకి ప్రవేశించి ఇంటీరియర్‌ను చూసినట్లయితే.. ఎక్స్‌టీరియర్‌లోని చిన్న చిన్న లోపాలను కూడా మర్చిపోతారు.
భద్రత పరంగా, మహీంద్రా XUV 3XO లో హై సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. మహీంద్రా XUV 3XO లో దాని ముందున్న ఇంజిన్ ఆప్షన్లనే చూడవచ్చు. XUV 300 మాదిరిగానే 1.2-లీటర్ MPFi పెట్రోల్, 1.2-లీటర్ TGDi పెట్రోల్ మరియు 1.5-లీటర్ mHawk డీజిల్ వంటి మూడు ఇంజిన్‌లను ఆప్షన్లుగా ప్రవేశపెట్టింది.

మహీంద్రా XUV 3XO మూడు డ్రైవింగ్ మోడ్‌లను అందిస్తుంది. అవి జిప్(Zip), జాప్(Zap) మరియు జూమ్(Zoom). కఠినమైన రోడ్లు, గుంతలు, టర్నింగుల్లోనూ సులభంగా ప్రయాణించవచ్చు. సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో XUV 3XO మంచి ఆప్షన్. ఇక ఇతర వేరియంట్లతో పోలిస్తే టాప్ స్పెక్ వేరియంట్‌లో మీరు పూర్తి డ్రైవింగ్ పర్ఫామెన్స్‌ను ఆస్వాదించవచ్చు.


Click it and Unblock the Notifications








