సేఫ్టీలో టాప్‌ 5 కంపెనీల నుంచి భారీ సేఫ్టీ ఫీచర్లలున్న కార్లు ఇవే.. వీటిలో ప్రయాణం సుఖమయం, శుభప్రదం!

ప్రస్తుతం జనాలు కార్లు కొనేముందు ఎక్కువగా సేఫ్టీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కార్ల తయారీ ఉత్పత్తి సంస్థలు కూడా మంచి సేఫ్టీ పీచర్లతో మంచి బిల్డ్‌ క్వాలిటీతో కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. దీంతో సేఫ్టీకి ప్రాధాన్యత పెరిగింది. ఒకప్పుడు కేవలం మైలేజీ, ధర, ఫీచర్లను బేరీజు వేసుకునే జనాలు ఇప్పుడు ప్రయాణంలో కీలకమైన సేఫ్టీకి ఓటేస్తున్నారు. మార్కెట్‌లో ప్రస్తుతం 5 స్టార్ రేటింగ్‌ కలిగిన కార్లు కొన్ని ఉన్నాయి. ఇందులో మీ ప్రయాణం సాఫీగా సాగేందుకు అవకాశం ఉంటుంది. అమ్మకాల్లో టాప్‌లో ఉన్న సబ్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీల లోని కొన్ని సేఫ్టీ ఫీచర్లపై ఓ లుక్కేయండి.

మహీంద్రా ఎక్స్యూవీ 3XO సేఫ్టీ ఫీచర్లు: ప్రస్తుతం దేశంలోనే అత్యంత డిమాండ్‌ కలిగిన ఎస్‌యూవీగా ఉంది. దీనిని ఇప్పుడు బుక్ చేసుకుంటే ఏడాది తర్వాత మీ ఇంటికి వస్తుంది. ఈ కారు ఇటీవలె గ్లోబల్‌ NCAP క్రాష్‌ టెస్ట్‌లో 5-స్టార్‌ రేటింగ్‌ని సాధించింది. ఈ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా 35 సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. ఈ సేఫ్టీ ఫీచర్లు ప్రయాణీకులకు మెరుగైన రైడింగ్‌ అనుభవాన్ని అందిస్తుంది.

Mahindra XUV 3XO Safety features

సేఫ్టీ ఫీచర్ల పరంగా ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ యాంకరేజెస్‌, అన్నీ వీల్స్‌కి డిస్క్ బ్రేక్స్‌, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఆటో డిమ్మింగ్ IRVM, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పవర్ బ్రేక్, అందరికీ సీట్ బెల్ట్ రిమైండర్, లెవల్ 2 ఏడీఏఎస్ ఫీచర్లున్నాయి.

టాటా నెక్సాన్ సేఫ్టీ ఫీచర్స్: ఈ టాటా కారు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్‌ని కలిగి ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO రాకతో టాటా నెక్సాన్‌ సేల్స్‌కి దెబ్బపడింది. నెక్సాన్‌ని డిజైన్‌ చేసిన ప్రతాప్‌ బోస్‌ మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOకి స్కెచ్‌ వర్క్ చేశారు. దీంతో దీని డిజైన్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది. ప్రస్తుతం సేల్స్‌లో టాటా మోటార్స్ కాస్త వెనకబడ్డాయి.

Tata Nexon Mahindra XUV 3XO Safety features

మాస్-మార్కెట్ సెగ్మెంట్‌లో ఈ ఎస్‌యూవీ సేఫెస్ట్‌ కారుగా ఉండటం వల్ల సేల్స్‌ స్థిరంగా కొనసాగుతున్నాయి. సేఫ్టీ పరంగా టాటా నెక్సాన్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్లతో కూడిన ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, బ్లైండ్ స్పాట్ మానిటర్, కార్నరింగ్ ఫంక్షన్‌తో కూడిన ఫాగ్ ల్యాంప్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి బ్రెజా సేఫ్టీ ఫీచర్స్: ఇది సేఫ్టీలో 5 స్టార్‌ రేటింగ్‌ని కలిగి ఉంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, హిల్ హోల్డ్ అసిస్ట్‌తో కూడిన ESP, EBD విత్‌ ABS, 360 డిగ్రీల కెమెరా, హెడ్-అప్ డిస్ ప్లే, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రీ-టెన్షన్స్ అండ్‌ ఫోర్స్ లిమిటర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ విత్ ఇన్ఫోగ్రాఫిక్ డిస్ ప్లే వంటి 20 వరకు సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Kia Sonet Safety Features

కియా సోనెట్ సేఫ్టీ ఫీచర్లు: కియా సోనెట్ 3 స్టార్ రేటింగ్‌ని కలిగి ఉంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఇబిడి విత్‌ ఎబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్స్‌, టైర్ ప్రెజర్ మానిటర్, ఐసోఫిక్స్, ఆల్‌ వీల్‌ డిస్క్‌ బ్రేక్స్‌, బ్లైండ్ స్పాట్ మానిటర్తో 360 డిగ్రీల కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ వెన్యూ సేఫ్టీ ఫీచర్లు: ఈ ఎస్‌యూవీ 4 స్టార్ రేటింగ్‌ని కలిగి ఉంది. కంపెనీ నుంచి అత్యంత ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా ఉంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్ మెంట్ , కార్నరింగ్ హెడ్‌ల్యాంప్స్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్‌ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, డైనమిక్ గైడ్ లైన్స్ తో పార్కింగ్ అసిస్ట్ రియర్ కెమెరా వంటి ఇతర సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, November 22, 2024, 9:58 [IST]
English summary
Mahindra xuv 3xo vs rivals safety features comparison and crash test ratings details here
Read more on: #auto news #crash test #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+