దేశంలోనే ఎక్కువ డిమాండ్‌ ఉన్న కారు ఇదే.. ఇప్పుడు బుక్‌ చేసుకుంటే ఏడాది తర్వాత మీ ఇంటికి వస్తుంది!

దేశంలో ప్రస్తుతం మహీంద్రా కార్లు స్వింగ్‌లో ఉన్నాయి. ఆ కంపెనీ తాజాగా సెప్టెంబర్‌ నెల సేల్స్‌లో టాటా మోటార్స్‌ని వెనక్కి నెట్టి మూడవ స్థానాన్ని ఆక్రమించుకుంది. మహీంద్రా కేవలం 41 యూనిట్ల తేడాతో రెండో స్థానాన్ని (హ్యందాయ్‌ మోటార్స్‌) కోల్పోయింది. సెప్టెంబర్‌లో ఈ కంపెనీ ఏకంగా 51,062 యూనిట్ల కార్లను విక్రయించింది. మారుతి సుజుకితో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువ కానీ ఇదే జోరు కొనసాగితే దేశంలో నంబర్‌ 1 కారు కంపెనీగా అతి త్వరలోనే మహీంద్రా అవతరించనుంది. మహీంద్రా మొత్తం అమ్మకాల్లో ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV 700), స్కార్పియో (Scorpio), థార్ (Mahindra Thar) వంటి పెద్ద వాహనాలు ఉన్నాయి.

అయితే వీటన్నింటి కంటే ఇప్పుడు మరో మహీంద్రా వాహనానికి డిమాండ్ భారీగా పెరిగింది. ఆ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న సరికొత్త ఎక్స్‌యూవీ3ఎక్స్ఓ (XUV 3XO) లైనప్‌ని జనాలు తెగకొనేస్తున్నారు. తక్కువ ధరలో మంచి స్టైలింగ్, భారీ ఫీచర్ల కారణంగా ఈ ఎస్‌యూవీ హిట్‌ లిస్ట్‌ చేరిపోయింది. ఈ XUV 3XO మోడల్‌ ప్రస్తుతం కొనుగోలుకి ‌అందుబాటులో ఉన్న ఎక్స్‌యూవీ 300 కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌కి కొనసాగింపుగా వచ్చింది.

Mahindra XUV 3XO Bookings

అయితే ఇది దాని మునుపటి మోడళ్లతో పోల్చితే మరిన్నీ స్మార్ట్ మోడిఫికేషన్స్‌తో మార్కెట్‌లో అడుగుపెట్టింది. ముందుగా ఈ కారు మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్‌ మార్కెట్‌ని పూర్తిగా దెబ్బతీసింది. ముఖ్యంగా దీని డిజైన్‌ని ఆకర్షణీయంగా రూపొందించారు. టాటా నెక్సాన్‌కి రూపకల్పన చేసిన డిజైనర్‌ ప్రతాప్‌ బోస్‌ ఈ కారును డిజైన్‌ చేశాడు. దీంతో ఈ కొత్త రూపానికి జనాలు జేజేలు కొట్టడం ప్రారంభించారు.

కేవలం డిజైన్‌లోనే కాదు ప్రతీ సెగ్మెంట్‌లో ఈ కారు అదరగొడుతోంది. ఏప్రిల్‌లో ఈ కారు విడుదల అవ్వగా మేలో బుకింగ్స్‌ని స్వీకరించారు. ఈ కారుని బుకింగ్స్ ఓపెన్‌ చేసిన గంటలో దాదాపు 50,000 మంది దీనిని రిజర్వ్‌ చేసుకున్నారు. బుకింగ్స్‌తోనే ఇది రికార్డు నెలకొల్పింది. ఇక విడుదలైనప్పనీ నుంచి గత ఆరు నెలల్లో ప్రతీ నెలకు సగటున 8,400 XUV 3XO యూనిట్లను మహీంద్రా విక్రయిస్తోంది.

Mahindra XUV 3XO Sales

కానీ ఇప్పుడు డిమాండ్ పెరగడంతో ఈ ఎస్‌యూవీ వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగిందని వార్తలు వస్తున్నాయి. డెలివరీ సమయం ఎంచుకున్న వేరియంట్‌పై చాలా ఎక్కువగా ఉందని తెలుస్తోంది. రూ .7.49 లక్షలకు (ఎక్స్‌షోరూమ్‌) అందుబాటులో ఉన్న దీని బేస్‌ వేరియంట్‌ MX 1 పెట్రోల్ వేరియంట్‌ని కొనుగోలు చేయాలనుకుంటే బుకింగ్ వ్యవధి కనీసం ఒక సంవత్సరంగా ఉంది.

మహీంద్రా ఈ వేరియంట్ కొన్ని యూనిట్లను మాత్రమే తయారు చేస్తున్నందున ఈ వెయిటింగ్ పీరియడ్‌ పెరిగినట్లు అర్థం అవుతుంది. లో-స్పెక్ పెట్రోల్ MX 2, MX 3 ప్రో వేరియంట్లు వరుసగా 7 నుంచి 8 నెలలు, 6 నుంచి 7 నెలల వెయిటింగ్ పీరియడ్ కలిగి ఉంది. మిడ్-స్పెక్ MX 5, AX 5 L పెట్రోల్ డెలివరీ సమయం వరుసగా 8-9 నెలలు, 2-3 నెలలుగా ఉంది.

Mahindra XUV 3XO Waiting Period

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ టాప్ ఎండ్ MX 7, AX 7 L పెట్రోల్ వేరియంట్ల డెలివరీ కోసం సుమారు 2 నెలలు వేచి ఉండాల్సి ఉంటుంది. పెట్రోల్ కంటే డీజిల్ వేరియంట్లకు డిమాండ్ తక్కువగా ఉంది. నివేదికల ప్రకారం డీజిల్ వెర్షన్ల కోసం ఎక్కువ రోజుల వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. డీజిల్ వేరియంట్ల వెయిటింగ్ పీరియడ్ కేవలం 1 నెల మాత్రంగానే ఉంది.

ఇక ఈ కారు ధర రూ .7.49 లక్షల నుంచి రూ .15.49 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ఉంది. ఇవి 1.2-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ అలాగే 1.5-లీటర్ డీజల్ ఇంజిన్‌తో వస్తాయి. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే బేస్ మోడల్ లీటరుకు 18.89 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Thursday, October 24, 2024, 10:27 [IST]
English summary
Mahindra xuv 3xo waiting period up to 1 year on base variant
Read more on: #mahindra #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+