సేఫ్టీలో మహీంద్రా ఎలక్ట్రిక్ కారుకి 5 స్టార్ రేటింగ్.. పాపం టాటా కార్లకు ఇక గడ్డుకాలమే!
మహీంద్రా కార్లు సేఫ్టీ టెస్ట్‌లో అదరగొట్టాయి. ఆ కంపెనీ నుంచి నేడు విడుదలైన బీఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx), ఎక్స్‌యూవీ 3XO, ఎక్స్‌యూవీ 400 5 స్టార్ రేటింగ్‌ని సాధించాయి. అయితే మహీంద్రా ఎక్స్‌యూవీ 400 క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ని పొందిన ఏకైక ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. ఈ క్రాష్ టెస్ట్‌ల ఫలితాలను బట్టి చూస్తే మార్కెట్‌లో మరింత సత్తా చాటే అవకాశం ఉంది. ఇప్పటికే దేశంలో ఈ కార్లు టాటా మోటార్స్‌ని వెనక్కి నెట్టి అమ్మకాల్లో 3వ స్థానానికి ఎగబాకింది. ఎలక్ట్రిక్ కారు సేఫ్టీ రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే..
ఈ ఎలక్ట్రిక్ కారు పెద్దల ప్రొటెక్షన్‌లో 32 పాయింట్లకు గాను 30.38 స్కోర్‌ని సాధించింది. అదే విధంగా పిల్లల సేఫ్టీలో 49 పాయింట్లకు గానూ 43 పాయింట్లు సాధించింది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16 పాయింట్లకు 14.38 పాయింట్లు పొందింది. ఇక సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16 పాయింట్లకు 16 పాయింట్లతో అదరగొట్టింది.

ఎక్స్‌యూవీ 400 ప్రస్తుతం బిగ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ కారుని EL ప్రో, EC ప్రో వంటి వేరియంట్లలో లభిస్తుంది. బ్యాటరీ ప్యాక్స్‌ని బట్టి వేరియంట్ల ధరలు మారుతుంటాయి. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇందులోని 39.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ 456 రేంజ్‌ని, 34.43 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ 402 రేంజ్‌ని అందిస్తుంది.
34.5 కిలోవాట్ల బ్యాటరీనీ 3.3 కిలోవాట్ల ఛార్జర్‌తో వస్తుంది. అలాగే 34.5 కిలోవాట్స్, 39.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్స్‌ని 7.2 కిలోవాట్ల స్టాండర్డ్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయవచ్చు. ఇక 50 kWh ఛార్జర్‌తో కేవలం 50 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. అయితే వివిధ కంపెనీలు సేల్స్‌ని బట్టి ఎలక్ట్రిక్ కార్ల ధరలను తగ్గిస్తున్నప్పటికీ.. ఈ కారు ధరను మహీంద్రా తగ్గించలేదు.

కొత్త ఎక్స్‌యూవీ 400 ఇంటీరియర్ ఫుల్‌ప్యాక్డ్‌గా ఉంటుంది. దీని ఇంటీరియర్ బ్లాక్ కలర్‌లో వస్తుంది. ఎయిర్ వెంట్స్, సౌండ్ ఏసీ కంట్రోల్స్, స్టీరింగ్ వీల్ పై ట్విన్ పీక్స్ బ్యాడ్జ్ ఉంటాయి. ఇతర ICE వెర్షన్స్ మాదిరిగా కాకుండా ఇందులోని ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ అడ్రినోఎక్స్ సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది. దీంతో పాటు ఇది మహీంద్రా బ్లూ సెన్స్ ప్లస్ సూట్ కనెక్టెడ్ కార్ యాప్స్ ద్వారా వాడుకోవచ్చు.
అలాగే ఓటీఏ అప్‌డేట్స్, డిటైల్డ్ రూట్ ప్లానింగ్ వంటి ఫీచర్లను ఇందులో అందించారు. 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, డ్యూయల్ జోన్ ఏసీ, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పుష్-బటన్ స్టార్ట్-స్టాప్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో 378 లీటర్ల భారీ స్పేస్ కలదు. ఈ కారులో 5 మంది హాయిగా ప్రయాణించవచ్చు.
సేఫ్టీ పరంగా ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పీ), టైర్‌ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ హోల్డ్ అసిస్ట్ , రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లతో మంచి సేఫ్టీని అందిస్తుంది. ఇది నేరుగా టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీకి గట్టి పోటీని ఇస్తుంది. దీని ధరలు రూ. 15.49 నుంచి రూ. 19.39 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








