Mahindra XUV400 Pro: మహీంద్రా XUV400 Pro లాంచ్‌.. 456 కి.మీ రేంజ్‌, అదిరిపోయే ఫీచర్లు.!!

ప్రముఖ కార్ల తయారీదారు మహీంద్రా అండ్‌ మహీంద్రా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహీంద్రా XUV 400 ప్రో రేంజ్ ఎలక్ట్రిక్ కారు భారత మార్కెట్లో విడుదలైంది. మూడు వేరియంట్లలో, సరసమైన ధరలో ఈ కారును సంస్థ విడుదల చేసింది. మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్‌ కారు ధర, ఫీచర్లు, రేంజ్‌, వేరియంట్ల వివరాలు ఈ కథనంలో..

భారత మార్కెట్లో భారీ అంచనాలతో విడుదలైన ఎలక్ట్రిక్‌ కారు మహీంద్రా ఎక్స్‌యూవీ400 ప్రో రేంజ్‌. ఇది మిడ్-సైజ్ SUV కార్ మోడల్. ఈ కారును సంస్థ EC PRO అనే వేరియంట్‌తో పాటు EL PRO లో రెండు వేరియంట్లను తీసుకువచ్చింది. EL PRO లో మాత్రమే రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Mahindra-XUV400-Pro

మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్‌ కారు EL PRO లో ఒకటి 34.5 kWh బ్యాటరీ ప్యాక్‌, 7.2 kW AC ఛార్జర్‌తో అమర్చబడి ఉండగా.. మరొకటి 39.4 kWh బ్యాటరీ ప్యాక్ అదే 7.2 kW AC ఛార్జర్‌తో వస్తుంది. ఇక ఎంట్రీ-లెవల్ EC ప్రో 34.5 kWH బ్యాటరీ ప్యాక్, టైప్ 3.3 kW AC ఛార్జింగ్ ఆప్షన్‌ను కలిగి ఉంది.

మహీంద్రా XUV400 ఈవీ పరిచయ ధర రూ. 15.49 లక్షలుగా సంస్థ ప్రకటించింది. ఇది ఎక్స్‌ షోరూమ్‌ ధర. కాగా మహీంద్రా XUV400 EL Pro లో భారీ మార్పులు చేశారు. ముఖ్యంగా డ్యూయల్ టోన్ ఆప్షన్‌.. గ్రే మరియు బ్లాక్‌ కలర్‌లో దీనిని కొనుగోలు చేయవచ్చు. ఈ టాప్-ఎండ్ మోడల్‌కు ప్రీమియం లుక్‌ను అందించడానికి శాటిన్ కాపర్ యాక్సెంట్‌లు, శాటిన్ క్రోమ్‌తో AC వెంట్‌లను అందించారు.

Mahindra-XUV400-Pro

మహీంద్రా XUV400 లో అతి పెద్ద మార్పు 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌కు బదులుగా 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను చూడవచ్చు. ఇది మునుపటి వెర్షన్ కంటే మరింత అధునాతనంగా కనిపిస్తుంది. ఇంకా, ఈ టాప్-ఎండ్ వేరియంట్‌లో 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కూడా అందించారు.

దీని ద్వారా నావిగేషన్, మల్టీమీడియా సమాచారం మరియు డ్రైవర్ అసిస్ట్‌ డేటాను అందిస్తుంది. మహీంద్రా XUV 400 యొక్క టాప్-ఎండ్ వేరియంట్‌లో మరిన్ని ఆధునిక మరియు ప్రీమియం ఫీచర్లను చీడవచ్చు. తద్వారా ఈ కారులో 50 కంటే ఎక్కువ కనెక్షన్లు చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.

Mahindra-XUV400-Pro

టైర్ ప్రెజర్ అలర్ట్, డోర్ ఓపెనింగ్ అలర్ట్, ఓవర్ స్పీడ్ అలర్ట్, జియో ఫెన్స్ అలర్ట్, హై టెంపరేచర్ అలర్ట్, ఛార్జర్ ట్రబుల్ అలర్ట్, ఇ-కాల్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, వాలెట్ మోడ్, జస్ట్ టైర్, అక్యూ వెదర్, షేర్ మై లొకేషన్ వంటి ఫీచర్లను మహీంద్రా XUV400 ప్రో అందిస్తోంది.

Mahindra-XUV400-Pro

ఇక రేంజ్‌ విషయానికొస్తే మహీంద్రా XUV400 Pro అద్భుతమైన రేంజ్‌ను అందిస్తుంది. దాని 39.4 kWh బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జ్‌పై 456 కి.మీ రేంజ్‌ ఇస్తుండగా.. 34.5 kWh బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జ్‌పై 375 కి.మీ రేంజ్‌ను అందిస్తుందని సంస్థ తెలిపింది. ఈ కారులో మూడు విభిన్న రైడింగ్ మోడ్‌లను పొందవచ్చు.

ఫన్, ఫాస్ట్ మరియు ఫియర్‌లెస్ రైడింగ్‌ మోడ్‌లను మహీంద్రా XUV400 Pro అందిస్తోంది. సేఫ్టీ ఫీచర్లను చూసుకుంటే మహీంద్రా XUV400 PR0 భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, DBMS, IRVMతో ఆటో-డిమ్మింగ్, 4-వీల్ డిస్క్ బ్రేక్‌లు మరియు ఐసోఫిక్స్ సీట్లు ఉన్నాయి.

Mahindra-XUV400-Pro

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, January 11, 2024, 16:03 [IST]
English summary
Mahindra xuv400 pro range electric car launched in india features range price details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+