Mahindra XUV700 కొత్త వేరియంట్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన మహీంద్రా యొక్క XUV700.. ఇప్పుడు కొత్త వేరియంట్లో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ వేరియంట్ ధర, డిజైన్ మరియు ఫీచర్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మహీంద్రా అండ్ మహీంద్రా లాంచ్ చేసిన కొత్త వేరియంట్ 'ఏఎక్స్5 సెలక్ట్' (Mahindra AX5 Select). దీని ప్రారంభ ధర 16.89 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర దాని ఏఎక్స్ వేరియంట్ కంటే కూడా రూ. 50000 ఎక్కువ. ఇది మాన్యువల్ మరియు ఆటోమాటిక్.. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కొత్త వేరియంట్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అదనపు ఫీచర్స్ పొందుతుంది.

Mahindra XUV700 AX5 Select

మహీంద్రా XUV700 ఏఎక్స్5 సెలక్ట్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ మరియు రెండవ వరుస కోసం మ్యాప్ ల్యాంప్స్ వంటి ఫీచర్లతో పాటు ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌ను పొందుతుంది. కంపెనీ ఈ నెల ప్రారంభంలో ఎంట్రీ లెవెల్ ఎమ్ఎక్స్3 ట్రిమ్ కోసం ఏడు సీట్ల సెటప్‌ను కూడా పరిచయం చేసింది.

ఏఎక్స్5 సెలక్ట్ వేరియంట్ డ్యూయెల్ 10.24 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు డిజిటల్ క్లస్టర్ స్క్రీన్‌లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో. ఆపిల్ కార్ప్లే వంటి వాటితో పాటు 6 స్పీకర్ సౌండ్ సిస్టం, ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా.. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, అన్ని వరుసలకు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్ మరియు ఫాగ్ ల్యాంప్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

Mahindra XUV700 AX5 Select Badge

ఇంజిన్ విషయానికి వస్తే.. కొత్త మహీంద్రా XUV700 ఏఎక్స్5 సెలక్ట్ వేరియంట్.. పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. పెట్రోల్ ఇంజిన్ 197 Bhp పవర్ మరియు 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ 182 Bhp పవర్ మరియు 420 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు ఆటోమాటిక్ మరియు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతాయి.

మహీంద్రా XUV700 ఏఎక్స్5 సెలక్ట్ వేరియంట్ మంచి డిజైన్ మరియు అదనపు ఫీచర్స్ పొందటమే కాకుండా.. అదే సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇందులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు 360 డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.

నిజానికి మహీంద్రా అండ్ మహీంద్రా భారతీయ మార్కెట్లో తన XUV700 లాంచ్ చేసినప్పటి నుంచి విపరీతమైన అమ్మకాలను పొందగలిగింది. ఇప్పటికి కూడా మంచి అమ్మకాలను పొందుతూనే ఉంది. మార్కెట్లో ఈ కారుకు డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇది 5 సీటర్ మరియు 7 సీటర్ వెర్షన్లలో లభిస్తుంది. సెవెన్ సీటర్ విభాగంలో కూడా ఇది మంచి ఆదరణ పొందుతోంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, May 22, 2024, 17:30 [IST]
English summary
Mahindra xuv700 ax5 select launched in india at rs 16 89 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+