మహీంద్రా XUV700 కొత్త ఎడిషన్.. మైండ్ బ్లోయింగ్ కలర్, ధర ఎంతంటే?
దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క ఎక్స్‌యూవీ700 ఇప్పుడు కొత్త ఎడిషన్ రూపంలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త ఎడిషన్ పేరు 'ఎక్స్‌యూవీ700 బ్లేజ్ ఎడిషన్'. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మహీంద్రా లాంచ్ చేసిన కొత్త ఎక్స్‌యూవీ700 బ్లేజ్ ఎడిషన్ (XUV700 Blaze Edition) ప్రారంభ ధర రూ. 24.24 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ ఏఎక్స్7 ఎల్ వేరియంట్ కంటే కూడా సుమారు రూ. 25000 ఎక్కువ ధరను పొందుతుంది. అయితే ఈ కొత్త వెర్షన్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుందని సమాచారం. అయితే ఎన్ని అనేది ఖచ్చితంగా వెల్లడికాలేదు.

కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 బ్లేజ్ ఎడిషన్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఏఎక్స్ ఎల్ పెట్రోల్ ఆటోమాటిక్ 7 సీటర్, ఏఎక్స్ ఎల్ డీజిల్ మాన్యువల్ 7 సీటర్ మరియు ఏఎక్స్ ఎల్ డీజిల్ ఆటోమాటిక్ 7 సీటర్. వీటి ధరలు వరుసగా రూ. 25.54 లక్షలు, రూ. 24.24 లక్షలు మరియు రూ. 26.04 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).
మహీంద్రా ఎక్స్‌యూవీ700 బ్లేజ్ ఎడిషన్ కేవలం 7-సీట్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ కొత్త మాట్ రెడ్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. ఇది నారింజ రంగు కంటే కొంత డార్క్ కలర్ అని తెలుస్తోంది. ఈ పెయింట్ స్కీమ్ దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా భిన్నంగా ఉంటుందని స్పష్టమవుతోంది. ఇంటీరియర్ మాత్రం కాంట్రాస్ట్ రెడ్ స్టిచింగ్‌తో నలుపు రంగులో ఉండటం చూడవచ్చు.
నిజానికి భారతీయ రోడ్ల మీద మాట్ రెడ్ కలర్ ఫినిషింగ్ పొందిన కార్లు గతంలో కనిపించలేదు. కాబట్టి ఎక్స్‌యూవీ700 బ్లేజ్ ఎడిషన్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇందులో రూఫ్, వింగ్ మిర్రర్స్, గ్రిల్, అల్లాయ్ వేల మరియు ఏ, బీ, సీ ఫిల్లర్లు అన్నీ కూడా బ్లాక్ అవుట్ ఫినిషింగ్ పొందుతాయి. టెయిల్‌గేట్ మరియు ఫ్రంట్ ఫెండర్‌లపై బ్లేజ్ ఎడిషన్ బ్యాడ్జ్‌లు గమనించవచ్చు.
ఇంటీరియర్ విషయానికి వస్తే.. కొత్త ఎక్స్‌యూవీ700 బ్లేజ్ ఎడిషన్ అపోల్స్ట్రే కాంట్రాస్టింగ్ రెడ్ స్టిచ్చింగ్ పొందుతుంది. ఏసీ వెంట్స్ మరియు సెంటర్ కన్సోల్ వంటివి రెడ్ హైలెట్ పొందుతాయి. ఇవి కాకుండా స్టాండర్డ్ మహీంద్రా ఎక్స్‌యూవీ700లోని అన్ని ఫీచర్స్ బ్లేజ్ ఎడిషన్ పొందుతుంది. కాబట్టి ఫీచర్స్ గురించి కస్టమర్లు ప్రత్యేకంగా ఆలోచించనక్కర లేదు. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.
ఇంజిన్ విషయానికి వస్తే.. మహీంద్రా ఎక్స్‌యూవీ700 బ్లేజ్ ఎడిషన్ మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందించబడుతోంది. అవి 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (200 హార్స్ పవర్ మరియు 380 న్యూటన్ మీటర్ టార్క్), 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ (185 హార్స్ పవర్ మరియు 450 న్యూటన్ మీటర్ టార్క్) మరియు డీజిల్ ఏడబ్ల్యుడీ. పెట్రోల్ వెర్షన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








