కేవలం 3 ఏళ్లలో 2 లక్షల మంది ఈ పాపులర్‌ ఎస్‌యూవీని కొన్నారు.. డిజైన్‌, ఫీచర్లు, మైలేజీ అన్నింట్లో ఆల్‌రౌండర్‌!

గత కొన్ని సంవత్సరాలుగా మహీంద్రా నుంచి వస్తున్న కార్లు భారీ సంఖ్యలో సేల్‌ అవుతున్నాయి. ఈ కంపెనీ ప్రస్తుతం మార్కెట్‌లోనే అత్యంత విశ్వసనీయమైన వాహన తయారీదారులలో ఒకటిగా ఉంది. తక్కువ ధరలో కంపెనీ విక్రయించే కార్లు ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్‌లతో మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు కూడా వీటిని ఎక్కువగా ఇష్టపడతున్నారు. వీటి ధర ముఖ్యంగా హై ఫర్ఫామెన్స్‌ పవర్‌ని కలిగి ఉండటం వల్ల వీటిని కొనేందుకు జై కొడుతున్నారు. ప్రస్తుతం ఆ కంపెనీ నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV 700) పాపులర్ ఎస్‌యూవీలో ఒకటిగా ఉంది.

మీరు ఫ్యామిలీతో కలిసి ఎప్పుడైనా టూర్‌కి వెళ్లాలని లేదా ఇతర అవసరాల ఓ మంచి కారు కోసం వెతుకుతున్నట్లైతే ఇది మీకు బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. ఇందులో కుటుంబం మొత్తం కలిసి సరదాగా వెళ్లవచ్చు. ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 700 సెప్టెంబర్ 2021లో లాంచ్ అయినప్పటి నుండి అమ్మకానికి అందుబాటులో ఉంది. భారత మార్కెట్‌లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఇది గట్టి పోటీదారుగా ఉంది.

Mahindra XUV 700 2 Lakh Unit Sales

ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఎస్‌యూవీ భారీ డిజైన్‌తో శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్‌, విశాలమైన ఇంటీరియర్‌తో కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ పాపులర్ ఎక్స్‌యూవీ 700 సరికొత్త మైలురాయిని చేరుకుంది. కేవలం మూడేళ్లలో దేశీయ మార్కెట్‌లో 2,00,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని సాధించింది. ఈ కారు ప్రతి నెలా సగటున 5,722 యూనిట్లు సేల్‌ అవుతున్నాయి.

ఇక దీనిలో 2 పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి. ఇందులోని 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 200 ps శక్తిని, 380 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. మరో 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 185 ps పవర్‌ని మరియు 450 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎక్స్‌యూవీ 700 ఎస్‌యూవీ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ ఆప్షన్‌తో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Mahindra XUV 700 2 Lakh Unit Sales

ఇందులో FWD (ఫ్రంట్ వీల్ డ్రైవ్), AWD (ఆల్ వీల్ డ్రైవ్) టెక్నాలజీ ఆప్షన్ ఉంది. ఇక ఈ భారీ ఎస్‌యూవీ మైలేజీలోనూ తోపు అని చెప్పవచ్చు. ఇది లీటర్‌కి 17 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఎవరెస్ట్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్, నపోలీ బ్లాక్ వంటి కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తుంది. వేరియంట్లను బట్టి ఇది 5, 6 లేదా 7-సీటర్ ఆప్షన్ సిస్టమ్‌తో వస్తుంది.

ఈ కారులో లాంగ్‌ ట్రిప్‌లో వెళ్లేందుకు వీలుగా 240 లీటర్ల సామర్థ్యం గల బూట్ స్పేస్ ఉంటుంది. దీనిలో చాలా వరకు మన లగేజీని సులభంగా తీసుకెళ్లవచ్చు. దీనిలో అత్యాధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి కస్టమర్లను ఆకట్టుకుంటాయి. ఇందులోని 10.25 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ ఉన్నాయి.

Mahindra XUV 700

6-వే పవర్ డ్రైవర్ సీటు, 12-స్పీకర్ ఆడియో సిస్టమ్, సన్ రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, బిల్ట్-ఇన్ అలెక్సా కనెక్టివిటీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. సేఫ్టీ పరంగా మహీంద్రా ఎక్స్‌యూవీ700 ప్రయాణీకులకు మంచి సేఫ్టీ అందిస్తుంది. ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్స్‌, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), టీపీఎంఎస్ (ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ఏడీఏఎస్ (అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), 360 డిగ్రీల కెమెరా ఉన్నాయి.

ఈ ఎక్స్‌యూవీ 700 హ్యుందాయ్ ఆల్కాజర్, టాటా హారియర్, హ్యుందాయ్ క్రెటా, ఎంజీ హెక్టర్ ప్లస్, టాటా సఫారీ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది. దీని ధర రూ. 13.99 లక్షల నుంచి రూ. 26.04 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) మధ్య ఉంది. లగ్జరీ ఫీచర్లు, భారీ డిజైన్‌, మంచి ఫర్పామెన్స్‌ కోరుకునే వారు ఈ ఎస్‌యూవీని కళ్లు మూసుకుని కొనుగోలు చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, September 20, 2024, 12:31 [IST]
English summary
Mahindra xuv700 creossed 2 lakh unit sales in 3 years check all details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+