త్వరలో విడుదల కానున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌.. ఇదిగో వివరాలు

మహీంద్రా XUV 700కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ XUV అమ్మకాల్లో ప్రస్తుతం దుమ్మురేపుతుంది. టాటా సఫారీ మరియు జీప్ కంపాస్ కార్లు ఈ కారుతో గట్టిగా పోటిపడుతున్నాయి. అయినా కానీ XUV 700 అమ్మకాల్లో జోరును కనబరుస్తోంది. ప్రస్తుతం XUV విభాగంలో ఈ కారు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. తాజాగా మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ కారు బెంగళూరులో టెస్ట్ రైడ్‌ చేస్తుండగా డ్రైవ్స్‌పార్క్‌ కెమెరాకు చిక్కింది.

తాజాగా మా టీమ్‌కి లభించిన చిత్రాల ప్రకారం ఈ ఫేస్‌లిఫ్ట్‌ ఎక్స్‌యూవీ 700 ఎలక్ట్రిక్ వేరియంట్‌గా కనిపించలేదు. ఈ మోడల్ XUV 700 XUV ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌గా అందుబాటులో రానుందని తెలుస్తుంది. మహీంద్రా XUV 700 ఇప్పటికే లెవల్ -2 ADAS టెక్, పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్ మరియు ఇతర అధునాతన ఫీచర్లు వంటి టాప్-టైర్ ఫీచర్లతో అందుబాటులో ఉంది.

Mahindra-XUV-700-Spotted-In-Bangalore

త్వరలో రాబోయే ఫేస్‌లిఫ్ట్‌ అప్‌డేట్ వెర్షన్‌లో మరికొన్ని అధిక ఫీచర్లను జోడిస్తుందని మేము ఆశిస్తున్నాము., మహీంద్రా XUV 700 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రెండవ వరుసలో వెంటిలేటెడ్ కెప్టెన్ సీట్లు మరియు మరికొన్ని కనెక్టెడ్ కార్ టెక్ ఫీచర్లు వంటి అదనపు ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫేస్‌లిఫ్ట్‌లో సీట్ల మధ్య స్పేస్‌ని ఎక్కువ అందించేందుకు సంస్థ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.

రాబోయే ఫేస్‌లిఫ్ట్‌ మరిన్ని సేఫ్టీ ఫీచర్లతో ప్రయాణికులకు సురక్షిత ప్రయాణాన్ని అందించనుంది. ఇందులో మహీంద్రా ADAS కిట్ కు మరికొన్ని సెన్సార్లను జోడించే అవకాశం కూడా ఉంది. ఇది భవిష్యత్తులో మహీంద్రా అటానమస్ టెక్నాలజీని జోడించడానికి ఇది సహాయపడుతుంది. అదనపు సాంకేతిక మరియు భద్రతా ఫీచర్లతో పాటు రాబోయే మహీంద్రా XUV 700 వెలుపల మరియు లోపల చిన్న డిజైన్ సవరణలతో వచ్చే అవకాశం ఉంది.

రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, అప్ డేటెడ్ హెడ్ లైట్, రివైజ్డ్ టెయిల్ లైట్ గ్రాఫిక్స్, కొత్త అల్లాయ్ వీల్స్, రీప్రొఫైల్డ్ ఫ్రంట్, రియర్ బంపర్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. లోపలి భాగంలో, రాబోయే మహీంద్రా ఎక్స్ యువి 700 ఫేస్ లిఫ్ట్ కొత్త ఏసీ కంట్రోల్స్, అప్‌డేటెడ్ స్టీరింగ్ వీల్ మరియు డార్క్ థీమ్ ఇంటీరియర్ ను కలిగి ఉండవచ్చు. ఇంటీరియర్ కస్టమర్‌ ఫ్రెండ్లీగా ఉండనుంది.

మహీంద్రా XUV 700 ఇప్పటికే అత్యుత్తమ 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ మరియు 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. పవర్‌ట్రైన్‌లో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఫేస్‌లిఫ్ట్ రాబోయే పండుగ సీజన్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది. రాబోయే ఈ సీజన్‌లో అమ్మకాల జోరు వాహన తయారీదారులకు మరితం ప్రోత్సాహాన్ని అందించనుంది.

రాబోయే మహీంద్రా XUV 700 ఫేస్‌లిఫ్ట్‌ మార్కెట్‌లో సంచలనాలను సృష్టించనుంది. ఈ ఫేస్‌లిఫ్ట్‌ రాకతో ఇంకో సంవత్సరం పాటు ఈ కారు అమ్మకాల్లో జోరు కనబరచనుంది. ఒక్కసారి మార్కెట్‌లోకి వచ్చాక రానున్న రోజుల్లో ఈ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ మంచి మార్కెట్‌ వాటాను కలిగి ఉండే అవకాశం ఉండనుంది. ఈ కారు కోసం కారు ప్రియులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, June 11, 2024, 19:08 [IST]
English summary
Mahindra xuv700 facelift spotted testing in bangalore full details in telugu
Read more on: #mahindra #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+