XUV700 కొత్త వెర్షన్ లాంచ్ చేసిన మహీంద్రా.. ధర & వివరాలు
దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క XUV700కు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సంస్థ మోడల్‌లో 'ఎంఎక్స్' అనే కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
భారతీయ విఫణిలో లాంచ్ అయిన మహీంద్రా XUV700 MX అనేది ఎంట్రీ లెవెల్ ఏడు సీట్ల వెర్షన్. దీని ధర రూ. 15 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది AX3 7 సీటర్ వేరియంట్ కంటే కూడా రూ. 3 లక్షలు తక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. అయితే ఇది కేవలం డీజిల్ ఇంజిన్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది.

యాంత్రికంగా మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న మహీంద్రా XUV700 దాదాపు MX 5-సీటర్ మాదిరిగా ఉంటుంది. అంతే కాకుండా ఇది XUV700 MX 5 సీటర్ వేరియంట్ కంటే రూ.40000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో టాటా సఫారీ మరియు ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి 7 సీటర్ డీజిల్ వెర్షన్ల ధరల కంటే తక్కువ ధర వద్దనే అందుబాటులో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
కొత్త మహీంద్రా XUV700 MX వేరియంట్ ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, నాలుగు స్పీకర్లు, 7 ఇంచెస్ ఎంఐడీ, అనలాగ్ డయల్స్, మల్టిపుల్ USB పోర్ట్స్, టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్, సెంటర్ ఆర్మ్‌రెస్ట్ విత్ స్టోరేజ్ స్పేస్ వంటి వాటితో పాటు అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్, ఫాలోమీ హోమ్ హెడ్‌ల్యాంప్‌లు, ORVM మరియు ఐసోఫిక్స్ యాంకర్లు మొదలైనవి పొందుతుంది.

XUV700 MX వేరియంట్ మూడవ వరుసలో ఏసీ వెంట్స్, రెండవ వరుసలో కూడా సెంటర్ ఆర్మ్‌రెస్ట్, ఇతర 7 సీటర్ వేరియంట్లలో కనిపించే 60:40 వన్ టచ్ టంబుల్ ఫంక్షన్ కూడా పొందుతుంది. ఇంకా స్టాండర్డ్ మోడల్‌లో ఉండే దాదాపు అన్ని ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ప్రయాణికులు తప్పకుండా మంచి డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు.
మహీంద్రా XUV700 MX వేరియంట్ ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి ఎవరెస్ట్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్, డాజ్లింగ్ రెడ్, రెడ్ రేజ్ మరియు నాపోలి బ్లాక్ కలర్స్. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అంతే కాకుండా ఈ కొత్త మోడల్ ఐదు వేరియంట్లలో లభించడం వల్ల కస్టమర్ తమకు నచ్చిన కలర్ ఆప్షన్ ఎంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
యాంత్రికంగా మహీంద్రా XUV700 MX కారులో ఎటువంటి మార్పు లేదు. ఇది దాని 5 సీటర్‌తో సమానంగా ఉంటుంది. కాబట్టి ఇందులోని 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 156 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. MX 5 సీటర్ 2.0 లీటర్ పెట్రోల్ వెర్షన్లో అందుబాటులో ఉంది. కాబట్టి కొత్త 7 సీటర్ కూడా పెట్రోల్ ఇంజిన్ పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








