మహీంద్రా XUV700 SUV 2024 విడుదల.. ADAS సహా కీలక సేఫ్టీ ఫీచర్లు..!

మహీంద్రా XUV700 SUV 2024ను (Mahindra XUV700 SUV) భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌లో క్యాబిన్‌ కొత్త ఫీచర్లను కలిగి ఉంది. నాపోలి బ్లాక్‌ థీమ్‌లో అందుబాటులో ఉంది. ఈ SUV MX, AX3, AX5, AX7, AX7L వేరియంట్లలో అందుబాటులో ఉంది. బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.

ఇప్పటి వరకు 1.40 లక్షల యూనిట్ల విక్రయాలు : భారత్‌ మార్కెట్‌లో 2021 ఆగస్టులో తొలిసారిగా మహీంద్రా XUV700 SUV ని విడుదల చేసింది. ఈ మహీంద్రా XUV700 SUV అందుబాటులోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు 1.40 లక్షల యూనిట్ల పైగా విక్రయించింది. ఈ ఘనతను సాధించిన SUVగా మహీంద్రా XUV700 నిలిచింది.

mahindra XUV700 new suv

మహీంద్రా XUV700 SUV 2024.. పాత మోడల్‌ను పోలి ఉంటుంది. ప్రాథమిక డిజైన్‌లో మార్పులు చేయలేదు. ఈ ఎస్‌యూవీ AX7, AX7L వేరియంట్లు నాపోలి బ్లాక్ పెయింట్‌ ను కలిగి ఉంటాయి. ఈ రెండు వేరియంట్లు ఈ డ్యూయల్‌ టోన్‌ పెయింట్‌ను ఆప్షన్‌గా కలిగి ఉంటాయి. ఈ కొత్త మోడల్‌లో అప్‌డేట్‌ చేయబడిన క్యాబిన్‌, ఎయిర్‌వెంట్స్‌ మరియు డార్క్‌ క్రోమ్‌ ఫినిషింగ్‌ను పొందుతుంది.

దీంతోపాటు AX7, AX7L వేరియంట్‌ వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లను కలిగి ఉంటుంది. ORVMని సర్దుబాటు చేయాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ఈ వేరియంట్‌లో లోపలి భాగం టార్క్‌ క్రోమ్‌ ఎయిర్‌ వెంట్‌లతో కూడిన AC వెంట్‌లను కలిగి ఉంటుంది. ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. మరియు కెప్టెన్‌ సీట్ల ఆప్షన్లతో వస్తుంది.

mahindra-xuv700-launched-2024

మహీంద్రా XUV700 SUV 2024 మోడల్‌ OTA (ఓవర్‌ ది ఎయిర్‌) సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ Adrinax సూట్‌తో వస్తుంది. కొత్తగా ప్రవేశపెట్టిన కనెక్టివిటీ ఫీచర్లతో ఈ SUV మొత్తంగా 83 కనెక్టివిటీ ఆప్షన్లతో వస్తుంది. ఈ SUVలో FOTA (ఫెర్మ్‌వేర్‌ ఓవర్ ది ఎయిర్‌) సౌకర్యం కూడా అందించబడుతుంది.

ఈ వాహనంలో కీలక సేఫ్టీ ఫీచర్లున్నాయి. దొంగతనాలను నివారించేందుకు రిమోట్‌ ఫంక్షన్ సహా కారు లోకేషన్‌ను గుర్తించే ఫీచర్ వంటివి ఉన్నాయి. ఈ Adrinax సూట్‌ ద్వారా ఈ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ADAS (అడ్వాన్సడ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌) ను కూడా కలిగి ఉంది.

 2024-mahindra-xuv700-launched

ప్రారంభ ధర రూ.13.99 లక్షలు : మహీంద్రా XUV700 SUV 2024 పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్లను కలిగి ఉంటాయి. 2.0 లీటర్‌ టర్బోఛార్జడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, 2.2 లీటర్‌ టర్బో డీజిల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV ప్రారంభ ధర రూ.13.99 లక్షలుగా ఉంది. అదే టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ మోడల్‌ ధర రూ.23.99 లక్షలు (ఎక్స్‌షోరూం) గా ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 16, 2024, 12:31 [IST]
English summary
Mahindra xuv700 suv 2024 launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+