33 కిమీ ఈ పొట్టి కారు మన దగ్గర, విదేశీ ఎగుమతుల్లోనూ దుమ్మురేపుతోంది.. ధర చాలా అంటే చాలా తక్కువ!

ప్రస్తుతం మార్కెట్‌లోనే అత్యంత సరసమైన కార్లలో మారుతి ఆల్టో K10 (Maruti Alto K10) ఒకటిగా ఉంది. ప్రారంభ ధరలో కారుని కొనుగోలు చేయాలనుకునేవారు దీనిని ఎక్కువగా ఎంచుకుంటారు. అందువల్ల దీని సేల్స్ ప్రతీ నెలా టాప్‌లో ఉంటాయి. పొట్టి కార్లలో ఈ మోడల్‌ గట్టిదిగా ఉంది. దేశీయ మార్కెట్‌లో అత్యంత సరసమైన కార్లలో ఇది నంబర్‌ 1గా ఉంది. అంతే కాకుండా ఈ కారుని ప్రతీ ఏడాది భారీ సంఖ్యంలో విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. అందువల్ల ఈ కార్ల ఎగుమతులు 1000 శాతం పెరిగాయి. ఈ కారు ఈ స్థాయికి ఎలా ఎదిగింది? ఇందులోని ఫీచర్లకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో..

ప్రస్తుతం భారతీయ కస్టమర్లలో అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా మారుతి ఆల్టో ఎదగడానికి గల కారణం దాని ధర. ఎందుకంటే భారతీయ ప్రజలు కార్ల ధరలు అవి ఇచ్చే మైలేజీ ఆధారంగా కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ రెండింట్లో ఇది సూపర్‌ హిట్‌ కావడంతో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న చౌకైన కారుగా అవతరించింది. గత రెండు దశాబ్దాలుగా ఈ కారుని వినియోగదారులు ఆదరిస్తున్నారు.

Maruti Alto K10 September 2024 Sales

ముఖ్యంగా ఈ కారును చిన్న ఫ్యామిలీలు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. తాజాగా ఈ ఆల్టో K 10కి సంబంధించి సెప్టెంబర్ నెల సేల్స్‌ రిపోర్ట్‌ వెల్లడైంది. ఈ సేల్స్‌లో మారుతి ఆల్టో సత్తా చాటింది. మొత్తం 8,655 యూనిట్ల అమ్మకాలతో ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఫ్లాగ్‌షిప్‌ మోడళ్లకు సైతం గట్టి పోటీని ఇస్తుంది. కేవలం ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ ఈ కారుకు మంచి ఆదరణ లభిస్తోంది.

సెప్టెంబర్ లో ఈ కారుకు విదేశాల్లో మంచి ఆదరణ లభించింది. దీంతో భారత్‌లో తయారైన కార్లు పెద్ద సంఖ్యలో విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. గత నెలలో మారుతి ఆల్టో K10 442 యూనిట్లను ఎగుమతి చేసింది. 2023 సెప్టెంబర్‌ కేవలం 43 కార్లు మాత్రమే ఎగుమతి అయ్యాయి. అంటే దీని ఎగుమతులు ఇప్పుడు 927.91% పెరిగాయి. కేవలం ఒక్క ఏడాదిలోనే ఈ వృద్ధిని సాధించడం గమనార్హం.

Alto K10 Exports

ఈ కారు ఇంతలా సక్సెస్‌ సాధించడానికి గల ప్రధాన కారణం ఈ కారులోని ఫీచర్లు. ఈ మారుతి ఆల్టో K10 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 67bhp పవర్‌, 89nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారులో సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉంది.

ఈ కారు సీఎన్‌జీ వెర్షన్‌ 57 bhp పవర్‌ని, 82 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 27.39 కిలోమీటర్లు, ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 27.90 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. సీఎన్‌జీ వెర్షన్‌లో ఈ కారు అత్యధిక మైలేజీ ఇస్తుంది. దీంతో తక్కువ ఖర్చుతో ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ కారులో చక్కర్లు కొట్టవచ్చు.

Maruti Alto Vs Renault Kwid

ఇది కిలో సీఎన్‌జీ 33.85 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అందుకే చాలా మంది కస్టమర్లు ఈ కారును ఇష్టపడతారు. డిజైన్ పరంగా కూడా ఈ కారు హిట్‌ అని చెప్పవచ్చు. ఇక ఇంటీరియర్‌లో 7 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేకి సపోర్ట్ చేస్తుంది. డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ స్టీరింగ్ వీల్‌లో కంట్రోల్ బటన్లు ఉండేలా డిజైన్ చేశారు.

వీటితో పాటు పవర్ అడ్జస్టబుల్ ORVMలను కూడా అందించారు. భద్రత పరంగా ఈ కారులో రెండు ఎయిర్‌బ్యాగ్స్‌ ఉన్నాయి. ఇతర ఫీచర్లు ABS, బ్రేకింగ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. ఈ కారు మార్కెట్‌ రెనాల్ట్ క్విడ్‌కి గట్టి పోటీగా ఉంటుంది. ఈ కారు ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల (ఎక్స్‌ షోరూమ్‌) మధ్యలో ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, October 25, 2024, 11:53 [IST]
English summary
Maruti alto k10 september 2024 export details and sales report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+