ఎన్ని కార్లు ఉన్నా వీటికే ఎక్కువ డిమాండ్!.. లక్షల మంది కొనేశారు
భారతదేశంలో ఎప్పటికప్పుడు ఆధునిక వాహనాలు లాంచ్ అవుతూనే ఉన్నాయి. అయితే లాంచ్ అయిన ప్రతి కారు గొప్ప అమ్మకాలు పొందుతుందని చెప్పలేము. కానీ ఇప్పటికి 1000000 అమ్మకాలు దాటిన SUVల జాబితాలో మూడు కార్లు ఉన్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.
ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్లలో అమెరికా, చైనా తరువాత మూడో స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది. ఈ విషయం ఇండియా జపాన్ కంటే ముందు ఉంది. మన దేశంలో కొత్త కొత్త కార్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. కానీ అమ్మకాల్లో దూసుకెళ్లిన కార్ల విషయంలో మాత్రం మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ క్రెటా మరియు మహీంద్రా స్కార్పియో మాత్రం ఉన్నాయి.

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన SUVల జాబితాలో టాటా పంచ్, టాటా నెక్సాన్, టాటా హారియార్, మారుతి సుజుకి బ్రెజ్జా, మారుతి సుజుకి ఫ్రాంక్స్, మారుతి గ్రాండ్ విటారా, మహీంద్రా బొలెరో, మహీంద్రా థార్, స్కార్పియో, ఎక్స్‌యూవీ 700, హ్యుందాయ్ వెన్యూ, హ్యుందాయ్ క్రెటా, టయోటా ఫార్చ్యూనర్, కియా సోనెట్, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ మరియు ఎంజీ హెక్టర్ మొదలైనవి ఉన్నాయి.
దేశీయ విఫణిలో లెక్కకు మించిన SUVలు ఎన్ని ఉన్నా.. మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ క్రెటా మరియు మహీంద్రా స్కార్పియో మాత్రమే 1 మిలియన్ లేదా 10 లక్షల యూనిట్ల అమ్మకాలను పొందింది. దీన్నిబట్టి చూస్తే మార్కెట్లో ఈ మోడళ్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. రీజనబుల్ ధర వద్ద లభించే ఈ మోడల్స్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతాయి.

మారుతి సుజుకి బ్రెజ్జా
2016లో భారతదేశంలో మారుతి బ్రెజ్జా ప్రారంభమైంది. ఈ SUV ధర ఇప్పుడు 8.34 లక్షల నుంచి రూ. 14.14 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమాటిక్ ఎంపికలతో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 103 పీఎస్ పవర్ మరియు 137 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
మారుతి సుజుకి బ్రెజ్జా CNG వెర్షన్ 88 పీఎస్ పవర్ మరియు 121 Nm టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 5 స్పీడ్ మాన్యువల్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది. ఇది డిజైన్ పరంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఫీచర్స్ కూడా వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. ఇక పనితీరు పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ కారణంగానే ఈ కారుకు అధిక డిమాండ్ ఉంది.

హ్యుందాయ్ క్రెటా
భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా 2015లో ప్రవేశపెట్టబడింది. ఇది ప్రస్తుతం స్టాండర్డ్ మరియు ఎన్ లైన్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. క్రెటా స్టాండర్డ్ వెర్షన్ ధర రూ. 11 లక్షల నుంచి రూ. 20.15 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. అదే సమయంలో క్రెటా ఎన్ లైన్ ధర రూ. 16.82 లక్షల నుంచి రూ. 20.45 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.
స్టాండర్డ్ హ్యుందాయ్ క్రెటాలో మూడు ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి. అవి 1.5 లీటర్ పెట్రోల్ (115 పీఎస్ పవర్ మరియు 114 న్యూటన్ మీటర్ టార్క్), 1.5 లీటర్ కప్పా టర్బో పెట్రోల్ (160 పీఎస్ పవర్, 253 న్యూటన్ మీటర్ టార్క్) మరియు 1.5 లీటర్ డీజిల్ (116 పీఎస్ పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్) ఇంజిన్లు.

1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమాటిక్ మరియు ఐవీటీ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. 1.5 లీటర్ కప్పా టర్బో పెట్రోల్ ఇంజిన్ 7 స్పీడ్ DCT ఆటోమాటిక్ మాత్రం పొందుతుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. ఇవన్నీ వాహన వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.
ఇక హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ విషయానికి వస్తే.. ఇది 1.5 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 160 పీఎస్ పవర్ మరియు 253 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. పనితీరుపరంగా ఉత్తమంగా ఉంటుంది. ఇది చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది.

మహీంద్రా స్కార్పియో
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్ మహీంద్రా యొక్క స్కార్పియో. ఇది 2002లో భారత మార్కెట్లో అడుగుపెట్టింది. ప్రస్తుతం స్కార్పియో క్లాసిక్ మరియు స్కార్పియో ఎన్ అనే పేర్లతో విక్రయానికి ఉంది. క్లాసిక్ ధరలు రూ.13.59 లక్షల నుంచి రూ.17. 35 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. స్కార్పియో ఎన్ ధరలు రూ.13.60 లక్షల నుంచి రూ.24.54 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 2.2 లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 132 పీఎస్ పవర్ మరియు 300 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. స్కార్పియో ఎన్ మోడల్ 2.0 లీటర్ పెట్రోల్ మరియు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇవి రెండూ ఉత్తమ పనితీరును అందిస్తాయి.


Click it and Unblock the Notifications








