ప్రతీ నెల టాప్‌-10లో ఉంటున్న ఈ కారుని ఎందుకు ట్రై చేయకూడదు.. ధర రూ. 8.34 లక్షలు, 25.45 కి.మీ మైలేజీ!

మారుతు సుజుకి (Maruti Suzuki)కార్లకు మార్కెట్‌లో గిరాకీ ఎక్కువ. అందువల్ల ఈ కారు కంపెనీ నుంచి లభించే ఉత్పత్తులు ఎప్పుడు టాప్‌లోనూ కొనసాగుతాయి. 2024 జూలైలో టాప్‌ 10 సేల్స్‌లో మారుతి సుజుకి కార్లు 6 చోటు సంపాదించాయంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు దేశంలోనే మారుతి సుజుకి అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఉంది. ఆ కంపెనీ నుంచి ఆల్టో, సెలెరియో, బాలెనో, వ్యాగన్ ఆర్, ఇగ్నిస్, జిమ్నీ తదితర కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని నెక్సా, ఎరీనాాడీలర్ షిప్‌ల ద్వారా విక్రయిస్తోంది. తక్కువ ధరలో ఆకర్షణీయమైన డిజైన్లు, ఫీచర్లు కలిగి ఉండటంతో వీటిని కొనేందుకు జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

ఆ కంపెనీ నుంచి మారుతి బ్రెజ్జా (Maruti Brezza) పేరొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీగా ఉంది. ఇటీవల జూలై (2024) నెలలో కార్ల అమ్మకాల్లో ఈ ఎస్‌యూవీ సత్తా చాటింది. టాప్‌ 10 జాబితాలో 6వ స్థానాన్ని సాధించి మరోసారి బెస్ట్ సెల్లింగ్‌ కారుగా నిలిచింది. ఈ ఎస్‌యూవీకి సంబంధించిన ఫుల్‌ సేల్స్‌ రిపోర్ట్‌, ఫుల్‌ స్పెసిఫికేషన్స్‌ వివరాలు మీకోసం..

Maruti-Brezza-Sale-Report-July-2024

మారుతి సుజుకి బ్రెజ్జా గత నెలలో (జూలై 2024) 14,676 యూనిట్లను విక్రయించింది. ఇదే ఎస్‌యూవీ గత జూలై 2023లో 16,543 యూనిట్లు సాధించింది. అయితే ఈ సంవత్సరం అమ్మకాలు స్వల్పంగా 11 శాతం క్షీణించాయి. అయితే, బ్రెజ్జా అమ్మకాలు పడిపోవడానికి నిర్దిష్ట కారణాలను కంపెనీ వెల్లడించలేదు. అమ్మకాలు తగ్గినా కానీ టాప్‌ 10లో స్థానం పదిలం చేసుకుంది. ఈ ఆగస్టులో అమ్మకాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.

ఈ కారు 1.5-లీటర్ పెట్రోల్ మరియు సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్స్‌తో పనిచేస్తుంది. పెట్రోల్‌ ఇంజిన్‌లో 103 ps పవర్‌ని 137 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ వేరియంట్‌ ఇంజిన్‌లో 88 ps శక్తిని 121 nm టార్క్‌ని విడుదల చేస్తుంది. దీని వేరియంట్లను బట్టి ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

Maruti-Brezza-Sales

పెట్రోల్ వేరియంట్స్‌ లీటర్‌కి 17.38 నుంచి 19.89 కిలోమీటర్ల మైలేజీ, సీఎన్‌జీ వేరియంట్లు కిలోకు 25.51 కిలోమీటర్ల మైలేజీ అందిస్తాయి. మారుతి సుజుకి బ్రెజ్జాలో FWD (ఫ్రంట్ వీల్ డ్రైవ్) టెక్నాలజీ ఉంది. ఈ కారులో 5 మంది హాయిగా కూర్చొని ప్రయాణించవచ్చు. వారాంతాలు, సెలవు దినాల్లో ట్రిప్‌కి వెళ్లేటప్పుడు ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి వీలుగా 328 లీటర్ల బూట్ స్పేస్‌ కూడా ఇందులో లభిస్తుంది.

అంతే కాకుండా ఈ కారులో యువ కస్టమర్లను ఆకట్టుకునే అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 9 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 6-స్పీకర్ సెటప్, ప్యాడిల్ షిఫ్టర్లు, సన్ రూఫ్, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, హెడ్స్‌అప్‌ డిస్ప్లే ఆటోమేటిక్ ఏసీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Maruti-Brezza-Sale-Report-July-2024

మారుతి సుజుకి బ్రెజ్జాలో ప్రయాణికుల కోసం భారీ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), హిల్‌హోల్డ్ అసిస్ట్, సీట్‌బెల్ట్ రిమైండర్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్‌, 360 డిగ్రీల కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. ఇది మాగ్మా గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, పెర్ల్ మిడ్నైట్ బ్లాక్ వంటి కలర్‌ ఆప్షన్స్‌తో లభిస్తుంది.

ప్రస్తుతం సరికొత్త మారుతి సుజుకి బ్రెజ్జా ఎస్‌యూవీ ధర రూ.8.34 లక్షల నుంచి రూ.14.14 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉంది. ఇది LXi, VXi, ZXi అనే వేరియంట్లలో లభిస్తుంది. ఇది కియా సోనెట్, రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్, టాటా నెక్సాన్ మరియు హ్యుందాయ్ వెన్యూ వంటి కార్లకు గట్టి పోటీని ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 10, 2024, 10:33 [IST]
English summary
Maruti brezza july 2024 sales report check here in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+