5 మంది హాయిగా వెళ్లొచ్చు.. 25 కి.మీ మైలేజీ.. దేశంలో ప్రస్తుతం ఎక్కువగా అమ్ముడుపోతున్న కారు ఇదే!
సేల్స్‌లో మారుతి కార్లు గతంతో పోల్చితే చాలా తగ్గాయి. అయితే ఆగస్టులో మాత్రం మారుతి సుజుకి ఇండియానే అత్యధిక కార్లను విక్రయించిన జాబితిలో తొలి స్థానంలో నిలిచింది. ఆ కంపెనీ నుంచి ఆగస్టు నెలలో మారుతి బ్రెజా అత్యధికంగా అమ్ముడుపోయిన కారుగా నిలిచింది. ఈ సేల్స్ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే మారుతిలోని ఫేమస్ లైనప్‌ని అయినా షిఫ్ట్, ఇతర కార్లను కాకుండా జనాలు ఈ కారును అకస్మాత్తుగా కొనడం ప్రారంభించారు. ఈ కారులో లభించే ఫీచర్లు, సేల్స్‌లో టాప్‌లో నిలవడానికి గల కారణాలు ఇక్కడ తెలుసుకోబోతున్నాం.
కార్ల ఉత్పత్తి సంస్థలు ఆగస్టు నెలలో తమ అమ్మకాల గణాంకాలను విడుదల చేశాయి. మారుతి విడుదల చేసిన సేల్స్ రిపోర్ట్ ప్రకారం ఇండియన్ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా బ్రెజా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. గత నెలలో 19,190 యూనిట్ల మారుతి బ్రెజా కార్లు అమ్ముడయ్యాయి. దీంతో బ్రెజా తొలి స్థానంలో నిలిచి ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

సాధారణంగా చిన్న కార్లను కొనేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు చాలా మంది హ్యాచ్‌బ్యాక్‌లను వదిలేసి ఎస్‌యూవీలను కొంటున్నారు. అందువల్ల దేశంలో ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో ఎస్‌యూవీలు అమ్ముడవుతున్నాయి. గత కొన్ని నెలలుగా సేల్స్‌లో ఎస్‌యూవీల హవానే కొనసాగుతుంది. ఈ విభాగంలో మారుతి బ్రెజా ఆగస్టులో తొలి స్థానాన్ని ఆక్రమించింది. అయితే ఇంతమంది ఈ కారును ఎందుకు కొంటున్నారో పూర్తి వివరాలు మీకోసం.
ఇంజిన్: ఈ కారులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ మ్యానువల్, 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఇంజిన్ 103bhp పవర్ మరియు 137nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. సీఎన్‌జీ వెర్షన్ 5 స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది 88 ps పవర్‌ని, 121 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఫీచర్లు: ఈ కారులో ఫీచర్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా ఈ కారులో 360 డిగ్రీల కెమెరాను అందించారు. కారు లోపల 9 అంగుళాల స్మార్ట్ ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ని ఇందులో అందించారు. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేకు సపోర్ట్ చేసేలా దీన్ని రూపొందించారు. ఈ స్క్రీన్‌లో, మీరు కారులోని హైటెక్ కెమెరా ద్వారా కారు చుట్టూ ఉన్న అన్ని విషయాలను చూడవచ్చు.
మైలేజీ: ఈ కారులో వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ కూడా ఉంది. అంతే కాకుండా పలు రకాల సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కారును చాలా మంది ఇష్టపడటానికి ఈ కారు మైలేజీ ఒక ముఖ్య కారణంగా ఉంది. మైలేజీ పరంగా మారుతి బ్రెజా మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లు వరుసగా 20.15 కిలోమీటర్లు, 19.80 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. సీఎన్‌జీ వెర్షన్ 25.51 కి.మీ మైలేజీ ఇస్తుంది.

మారుతి బ్రెజా కారు కుటుంబంతో కలిసి ప్రయాణం చేయడానికి సరైన ఆప్షన్‌గా ఉంటుంది. కుటుంబ సమేతంగా బయటకు వెళ్లి కారు కొనాలనుకునే చాలా మంది ఈ కారును ఇష్టపడతారు. అధిక మైలేజీ కారణంగా ఈ కారు అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారడానికి ఇందులోని ఫీచర్లు, మైలేజీ సేఫ్టీ ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
ధర: మారుతి బ్రెజా మార్కెట్‌లో రూ. 8.34 లక్షల నుంచి రూ. 14.14 లక్షల ధరతో కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఈ కారు మార్కెట్‌లో లభించే కియా సోనెట్, రెనాల్ట్ కిగర్, మహీంద్రా XUV 3XO, నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ వంటి వాటికి గట్టి పోటీని ఇస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో బెస్ట్ 5 సీటర్ కారుగా అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








