34 కి.మీ మైలేజీ ఇచ్చే ఈ కారు చిన్న ఫ్యామిలీలకు మంచి ఆప్షన్.. అందుకే జనాలు ఇష్టంగా కొంటున్నారు
దేశంలో మారుతి కార్లకు మంచి డిమాండ్ ఉంది. సరసమైన ధరలో కార్లను అదించడంలో ఈ సంస్థకు చెందిన కార్లు ముందు వరుసలో ఉంటాయి. ముఖ్యంగా మధ్యతరగతి సొంత కారుని మారుతి సుజుకి నిజం చేస్తుంది. అందుకే ఈ కారు కంపెనీ సేల్స్ ఎప్పుడు టాప్ గేర్‌లోనే ఉంటాయి. ఆ సంస్థ నుంచి అత్యంత ప్రాచుర్యం పొందిన కార్లలో మారుతి సుజుకి సెలెరియో ఒకటి. మే 2024 నెలలో ఈ హ్యాచ్‌బ్యాక్ సేల్స్ రిపోర్ట్ విడుదల చేసింది. ఆ గణాంకాల ప్రకారం ఈ కారు మరోసారి మంచి సేల్స్ రాబట్టింది. అయితే కంపెనీ ఆశించిన మేర మాత్రం ఫలితాలను రాబట్టలేదు. ఈ కారు పూర్తి సేల్స్ రిపోర్ట్ మీకోసం..
మారుతి సుజుకి మే 2024లో 3,314 సెలెరియో యూనిట్లను విక్రయించింది. కానీ ఈ సంఖ్య 2023 మే లో 3,216 మాత్రమే. దీని ప్రకారం ఆ సంస్థ కేవలం 3 శాతం వృద్ధి మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది. ఈ కారు ధరలు ప్రస్తుతం రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి రూ .7.04 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య కొనుగోలుకి అందుబాటులో ఉంది.

ఈ హ్యాచ్‌బ్యాక్ 4 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. LXi, VXi, ZXi, ZXi ప్లస్‌గా ఉన్నాయి. ఈ కార్లు 1.0-లీటర్ నేచ్యురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్ జతచేయబడి ఉంది. ఈ ఇంజన్ BS6 ఫేజ్ 2.0 కంప్లైంట్‌కి అనుగుణంగా మార్పులు చేశారు. ఇది 66 bhp పవర్ మరియు 89 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
ఈ కారు సీఎన్‌జీ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. మాన్యువల్ గేర్ బాక్స్ సెలెరియో సీఎన్‌జీ వెర్షన్‌లో మాత్రమే ఇది లభిస్తుంది. చాలా చవకైన ఈ కారు అద్భుతమైన మైలేజీని కూడా అందిస్తుంది. ఇందుంలోని ZXiప్లస్ MT వేరియంట్ లీటరుకు 24.97 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. LXi MT, VXi MT, ZXi MT మూడు వేరియంట్లు లీటరుకు 25.24 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి.

ఇక హై ఎండ్‌లోని ZXi AMT మరియు ZXi+ వేరియంట్లు లీటరుకు 26.00 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయి. VXi AMT వేరియంట్ లీటరుకు 26.68 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. పైన తెలిపినవన్నీ పెట్రోల్ వేరియంట్లు. ఇక సీఎన్‌జీ ఇంజిన్ కలిగిన VXi MT వేరియంట్ కిలోకు 34.43 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని మారుతి సుజుకి పేర్కొంది. మంచి మైలేజీ అందిస్తుండటంతో వీటిని కొనేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.
తక్కువ ధరలో అధిక మైలేజీని ఆశించే వారికి మారుతి సెలెరియో కార్లు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మారుతి సుజుకి సెలెరియో ప్రస్తుతం మారుతి సుజుకి ఎరీనా షోరూమ్‌ల ద్వారా విక్రయించబడుతోంది. మారుతి సుజుకి సెలెరియో భారత మార్కెట్‌లో రెనో క్విడ్, మారుతి సుజుకి వ్యాగన్ R మరియు టాటా టియాగో వంటి వాటికి పోటీ ఇస్తుంది. తాజాగా మరెన్నో కార్లకు ఇది సవాల్ విసురుతోంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








