దేశంలోనే ఎక్కువ మైలేజీ ఇచ్చే కారు ఇదే.. 34.43 కి.మీ మైలేజీ, ధర కేవలం రూ. 5.36 లక్షలు మాత్రమే!
మార్కెట్‌లో ఎంట్రీ లెవల్ కార్లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా ఈ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. దీంతో ఈ సెగ్మెంట్‌కి కార్ల తయారీ సంస్థలు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాయి. ఈ విభాగంలో మారుతి సుజుకి మంచి కార్లను అందిస్తుంది. దీంతో ఈ సంస్థకు చెందిన హ్యాచ్‌బ్యాక్స్‌కి డిమాండ్ భలే ఉంటుంది. అంతేకాకుండా దీని ఎంట్రీ లెవల్ కార్ల ధరలు కేవలం రూ.3.99 లక్షల నుంచే ప్రారంభ అవుతాయి. ఎక్కువ మంది కస్టమర్లకు కార్లను చేర్చాలనే లక్ష్యంతో మంచి మైలేజీ అందించే హ్యాచ్‌బ్యాక్ సెలెరియోని 2014లో ఆ కంపెనీ లాంచ్ చేసింది. ఈ కారు విడుదల నుంచే మంచి డిమాండ్‌తో దూసుకెళ్తుంది.
చాలా తక్కువ ధరలో మంచి ఫీచర్లు, డిజైన్‌తో తీసుకురావడం వల్ల జనాలు ఎక్కువగా వీటిని కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇది కేవలం రూ .5.36 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో కొనుగోలుకి అందుబాటులో ఉంచడం విశేషం. ఇంత తక్కువ ధరలో దేశంలోనే భారీ మైలేజీ అందించే కారుగా ఉంది. దీనికి తోడు కారులో ఉండే ఫీచర్లు వల్ల జనాలు ఎగబడి కొనడం ప్రారంభించారు.

దీని డిజైన్ విషయానకి వస్తే ఆకర్షణీయమైన గ్రిల్, రివైజ్డ్ బంపర్, క్రోమ్ స్ట్రిప్ ద్వారా కనెక్ట్ చేయబడిన సిగ్నేచర్ లోగో, సర్క్యూలర్ హెడ్‌ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్ ఆకట్టుకుంటా. సైడ్ ఫ్రొఫైల్‌లో ఇది అచ్చం ప్రీమియం కారు వలె కనిపిస్తుంది. దీని టాప్ వేరియంట్లు బ్లాక్ కలర్‌లో 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌తో అదనపు ఆకర్షణగా ఉంటాయి.
ఈ హ్యాచ్‌బ్యాక్‌ని LXi, VXi, ZXi, ZXi ప్లస్ అనే నాలుగు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ఏడు కలర్ ఆప్షన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఆర్కిటిక్ వైట్, సిల్కీ సిల్వర్, గ్రే, సాలిడ్ ఫైర్ రెడ్, స్పీడ్ బ్లూ, కెఫిన్ బ్రౌన్ కలర్స్‌లో కస్టమర్లు తమకు నచ్చిన కలర్ ఆప్షన్‌ని ఎంచుకోవచ్చు. అదనంగా చెల్చించడం ద్వారా కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ కూడా చేసుకోవచ్చు.

ఈ సెలెరియో సేఫ్టీ, కంఫర్ట్ పరంగా ఫుల్ ప్యాక్డ్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో డ్రైవర్, ఫ్రంట్ సీట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్, వెనుక డోర్లకు చైల్డ్ ప్రూఫ్ లాక్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, సీట్ బెల్ట్ రిమైండర్, ఏబిఎస్ విత్ ఇబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి సేఫ్టీ ఫీచర్లు కలవు. దీనివల్ల ఇందులో ప్రయాణీకులకు మంచి సేఫ్టీ లభిస్తుంది.
ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే ఆపిల్ కార్ ప్లే, స్మార్ట్ ప్లే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు ఐడిల్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్‌తో పాటు పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ ఫీచర్ కూడా ఉంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ద్వారా కాల్ అండ్ మ్యూజిక్‌ని మేనేజ్ చేయవచ్చు.
ఈ కారు హెడ్‌లైట్ డిజైన్‌ని ఇటీవలె అప్‌డేట్ చేశారు. ఇది BS 6 2.0-కంప్లైంట్, 1.0-లీటర్ న్యాచ్‌రల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 66 bhp పవర్‌ని, 89 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అయితే సీఎన్‌జీ వెర్షన్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో వస్తుంది.
ఇక మార్కెట్‌లో ఎక్కువ మైలేజీ అందించే కారు ఇదే కావడం విశేషం. సీఎన్‌జీ వేరియంట్ కిలోకు 34.43 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అలాగే మారుతి సుజుకి సెలెరియో పెట్రోల్‌పై కూడా లీటరుకు 25.17 కిలోమీటర్ల నుంచి 26.23 కిలోమీటర్ల భారీ మైలేజీ ఇస్తుంది. ఈ రెండు విభాగాల్లోనూ మారుతి సెలెరియో భారీ మైలేజీని అందించే కారుగా ఉంది.


Click it and Unblock the Notifications








