మారుతికి ఊహించని షాక్.. ఆ ఫేమస్ కారుని జనాలు కొనడం లేదు.. ఇక అందుబాటులో ఉండదా?
మారుతి భారతదేశంలోనే అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉంది. కంపెనీ విక్రయించిన కార్లు మార్కెట్లో భారీ విజయాన్ని సాధించాయి. ఇప్పటికీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఈ కంపెన కార్లను మాత్రమే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం ఎక్కువగా సేల్ అవుతున్న కార్లలో ఈ కంపెనీ ఉంది. కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్లు, డిస్కౌట్ల పేరుతో మారుతి సేల్స్‌ని పెంచుకుంటుంది అయితే ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న ఓ కారును కనీసం వెయ్యి మంది కూడా కొనలేదంటే నమ్మగలరా? ఈ ఉత్పత్తిని నిలిపివేసే ఆలోచనలో మారుతి కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
భారతదేశంలో మారుతి ఉత్పత్తులు మొదటి స్థానంలో ఉన్నాయి. ఎక్కువ మంది మారుతి కార్లను కొనడానికి ఇష్టపడతారు. అయితే జూలైలో మారుతి అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి.ఈ సందర్భంలో, మారుతిని అందుబాటులో ఉన్న ఫేమస్ కారు ఒకటి అమ్మకాల్లో తేలిపోయింది. జూలైలో ఆ కారు కనీసం 1,000 యూనిట్లను కూడా సేల్ చేయలేక పోయింది.

జూలైలోనే ఆ కారు ఈ చెత్త రికార్డు నమోదు చేసిందని మీరు అనుకోవచ్చు. కానీ గత కొన్ని నెలలుగా ఈ కారు అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయి. దానిపేరే మారుతి సుజుకి సియాజ్ (Maruti Suzuki Ciaz) మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో మారుతి సియాజ్‌ని విక్రయిస్తోంది. భారత్‌లో సెడాన్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. అయితే మార్కెట్‌లో మారుతి సెడాన్‌కి కొంత విలువ ఉండటంతో అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇందులో సియాజ్ కార్లు మాత్రం కస్టమర్ల ఆకట్టుకోవడం లేదు. దీంతో ఈ కారు అమ్మకాలు జూలైలో కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. జూలై నెలలో మారుతి కేవలం 603 సియాజ్ కార్లను మాత్రమే విక్రయించగలిగింది. 2023 జూలైలో కంపెనీ 1348 కార్లను విక్రయించింది. అప్పటితో పోల్చితే అమ్మకాలు 55 శాతం పడిపోయాయి. దీంతో మారుతి అభిమానుల్లో భారీ షాక్ తగిలింది.

2018-19 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూలై వరకు సియాజ్ మొత్తం 2,772 యూనిట్లను విక్రయించగా.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 5101 కార్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం అమ్మకాలు దాదాపు సగానికి పడిపోయాయి. గత ఆరు నెలలుగా ఈ కారు అమ్మకాలు చాలా మందకొండిగా సాగతున్నాయి.
ఈ కారు అమ్మకాలు 2024 ప్రారంభం నుంచి మరి పేలవంగా ఉన్నాయి. జనవరిలో 363 యూనిట్లు, ఫిబ్రవరిలో 481 యూనిట్లు, మార్చిలో 590 యూనిట్లు, ఏప్రిల్‌లో 867 యూనిట్లు, మేలో 730 యూనిట్లు, జూన్‌లో 572 యూనిట్లను మాత్రమే విక్రయించింది. మొత్తానికి మారుతి గత ఏడు నెలల్లో కేవలం 4,206 సియాజ్ యూనిట్లను మాత్రమే విక్రయించింది. భారత్‌లో సెడాన్ల అమ్మకాలు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం.

భారతదేశంలో సెడాన్ల అమ్మకాలు తగ్గడానికి ఎస్‌యూవీల అమ్మకాలు పెరగడమే కారణమని చెబుతున్నారు. సెడాన్ కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇప్పుడు ఎస్‌యూవీలను కొనుగోలు చేస్తున్నారు. అయితే సియాజ్‌కి సంబంధించి ఈ ఫిబ్రవరిలోనే సేఫ్టీ ఫీచర్స్ అన్నీ అప్డేట్ చేసి మరోసారి లాంచ్ చేశారు. దీంతో పాటు మూడు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లను కూడా ప్రవేశపెట్టింది.
అంతే కాకుండా ఈ కారు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు ధర రూ.11.14 లక్షల నుంచి రూ.12.34 లక్షల మధ్యలో ఉంది. మారుతి సియాజ్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 103 ps శక్తిని మరియు 138 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








