మారుతి నుంచి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌.. సన్‌రూఫ్‌ ఫీచర్‌తో రానున్న ‘డిజైర్‌' సెడాన్‌

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి నుంచి త్వరలో రాబోతున్న నాల్గవ తరం డిజైర్‌(Maruti Dzire) సన్‌రూఫ్ ఫీచర్‌తో రానుందనే సమాచారం వెల్లడైంది. భారత మార్కెట్లో సరికొత్త మారుతి డిజైర్‌ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది గుడ్‌న్యూస్‌ అనే చెప్పొచ్చు. పూర్తి సమాచారం ఈ కథనంలో..

దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది మారుతి డిజైర్(Maruti Dzire 4th Gen). ఆశాజనకమైన సేల్స్‌తో ఇప్పటికీ మార్కెట్లో కస్టమర్ల ఫేవరెట్‌ కారుగా నిలిచింది. ఎన్నో ఏళ్లుగా విక్రయాల్లో టాప్‌ సేల్స్‌లో దూసుకుపోతున్న ఈ కారు.. గతేడాదిలో ఒక్క నవంబర్‌లోనే మారుతి 16,000 డిజైర్ కార్లను విక్రయించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

New-Maruti-Dzire-Sunroof

అయితే భారత్‌లో సెడాన్‌లకు క్రేజ్ తగ్గినప్పటికీ, మారుతి డిజైర్‌కు మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ నమోదవతున్న సేల్స్‌ ఏ అందుకు నిదర్శనం. కాగా ఇప్పుడు మార్కెట్లో మూడవ తరం మారుతి డిజైర్‌ను విక్రయిస్తున్నారు. నాణ్యమైన పనితీరు, మంచి మైలేజ్‌ ఇస్తుండటంతో కస్టమర్లలో డిజైర్‌ పట్ల ఆదరణ పెరుగుతోంది.

ఈ క్రమంలో మారుతి డిజైర్‌ను సరికొత్త మార్పులతో తీసుకువచ్చేందుకు సంస్థ నిర్ణయించింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఇందులో అధునాతన ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. సరికొత్త అప్‌డేట్లతో మారుతి డిజైర్‌(SunRoof In Maruti Dzire)ను తీసుకురానుంది. కాగా ఈ కారు లాంచ్‌ తేదీకి సంబంధించి సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు.

New-Maruti-Dzire-Sunroof

అయితే ఈ అప్‌డేటెడ్‌ కారులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. కాగా దీని గురించి ఆసక్తికర సమాచారం వెల్లడైంది. కొత్త 4 వ తరం డిజైర్ కారులో ఖచ్చితంగా సింగిల్‌ పేన్‌ ఉంటుందని తెలుస్తోంది. ఇంకా ఇందులో సన్‌రూఫ్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని సంస్థ యోచిస్తోంది. అయితే భారత్‌లో ఈ ఫీచర్‌ అవసరం లేనప్పటికీ.. చాలా మంది ఈ ఫీచర్‌ ఉన్న కార్లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

కస్టమర్ల అభిరుచి దృష్ట్యా ఇప్పుడు కొత్తగా వస్తున్న ఫేస్‌లిఫ్టెడ్‌, అప్‌డేటెడ్‌ కార్లలో సన్‌రూఫ్‌ ఫీచర్‌ తప్పనిసరిగా ఉంటోంది. 4వ తరం డిజైర్‌తో పాటు కొత్తగా రీడిజైన్ చేయబడిన మారుతి స్విఫ్ట్‌లో కూడా ఇదే తరహా మార్పులను చూడవచ్చని తెలుస్తోంది. అయితే టాప్‌ ఎండ్‌ వేరియంట్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

New-Maruti-Dzire-Sunroof

కాగా చాలా కార్లలో, ముందు సీటులో ఉన్నవారికి మాత్రమే సన్‌రూఫ్ యాక్సెస్ ఉంటుంది. కానీ వెనుక సీటులో ఉన్నవారు కూడా సన్‌రూఫ్‌ను ఉపయోగించుకునేలా కారు మధ్యలో సన్‌రూఫ్‌ను ఇందులో తీసుకురానున్నారు. కొత్త డిజైర్ కారులో సన్‌రూఫ్ ఉంటే, కంపెనీకి చెందిన ఇతర కార్లలో కూడా సన్‌రూఫ్ ఉండే అవకాశం ఉంది.

ప్రధానంగా మారుతికి చెందిన బాలెనో, ఫ్రాంక్స్‌, జిమ్నీలో సన్‌రూఫ్‌ ఫీచర్‌ను తీసుకువచ్చే అవకాశం ఉంది. అయితే మారుతి సియాజ్‌లో సన్‌రూఫ్‌ ఫీచర్‌ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే.. ఈ కారు చాలా కాలంగా ఎలాంటి అప్‌డేట్ లేకుండా మార్కెట్లో ఉంది. దీనిని త్వరలో నిలిపివేసే అవకాశాలు ఉన్నాయి.

మారుతి తన కార్లలో సన్‌రూఫ్‌ని ప్రవేశపెట్టడం ద్వారా కార్లను ఇష్టపడే కస్టమర్‌లను మరింతగా ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. భారత్‌లో సన్‌రూఫ్ ఫీచర్‌ అవసరం లేకున్నా.. ఈ ఫీచర్ ఉన్న కార్లను ఎక్కువగా ఇష్టపడటంతో డిమాండ్‌ భారీగా ఉంది. దీంతో మారుతి కూడా తన తదుపరి మోడళ్లలో ఈ ఫీచర్‌ తీసుకురానుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 3, 2024, 18:33 [IST]
English summary
Maruti dzire 4th gen sedan will come with a sunroof feature check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+