32.12 మైలేజీ ఇచ్చే కారుని నిలిపివేయడానికి ఇష్టపడని మారుతి.. మార్కెట్‌లో దీని క్రేజ్ అలాంటిది మరీ!
మారుతి సుజుకి కార్లు మైలేజీకి పెట్టింది పేరు. ఈ కంపెనీ కార్లు మార్కెట్‌లో ఇతర సంస్థలతో పోల్చిచే తక్కువ ధరలో మంచి మైలేజీని అందిస్తాయి. మాస్ మార్కెట్‌ని దష్టిలో ఉంచుకుని మైలేజీ విషయంలో ఎక్కడా రాజీ పడదు. అందువల్లే ఈ కార్లను జనాలు కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వినియోగదారుల అవసరాలను దష్టిలో ఉంచుకుని మారుతి కూడా ఎప్పటికప్పుడు తన ఫేమస్ లైనప్స్‌ని అప్‌డేట్ చేసి తీసుకువస్తుంది. తాజాగా కొత్త డిజైర్ (2024 Maruti Dzire)ని మార్కెట్‌లో ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇతర సెడాన్లతో పోల్చితే దీనికి డిమాండ్ చాలా ఎక్కువ. దూర ప్రయాణాల్లో కంఫర్ట్ కోసం మంచి డిక్కీ స్పేస్ ఇందులో ఉంటుంది. అందువల్ల దీనిని ట్యాక్సీ డ్రైవర్లతో పాటు ఫ్యామిలీలు కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తాయి.
ముఖ్యంగా ట్యాక్సీ డ్రైవర్లకు సెడాన్ కార్లంటే కొంచెం ఇష్టం ఎక్కవ. ముందు చెప్పినట్లుగా ఈ విభాగంలో మారుతి డిజైర్‌ని ఏ సెడాన్ రిప్లేస్ చేయలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో 3rd జనరేషన్ జనాల్లో మంచి టాక్‌ని కలిగి ఉంది. మారుతి డిజైర్ 4th జనరేషన్ నవంబర్ 11న మార్కెట్‌లో విడుదల కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌ని కంపెనీ వెల్లడించింది.

మారుతి డిజైర్‌లో టూర్ ఎస్ (Maruti Dzire Tour S)కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ 3rd జనరేషన్ టూర్ ఎస్ వేరియంట్ కొనసాగుతుందని కంపెనీ స్పష్టం చేసింది. పాత మోడల్‌ని కొనుగోలుదారులకు అందించడం మంచి నిర్ణయం. ఇది కొత్త వెర్షన్‌ని ప్రభావితం చేయకపోవచ్చు. స్టాండర్డ్ డిజైర్, డిజైర్ టూర్ ఎస్ అమ్మకాలను వేర్వేరుగా పరిశీలించగా టూర్ ఎస్ వేరియంట్ సైతం మంచి అమ్మకాలను నమోదు చేస్తోంది.
గత సంవత్సరం విక్రయించిన మొత్తం 1.60 లక్షల డిజైర్‌లో 60,000 యూనిట్లకు పైగా టూర్ వేరియంట్ ఉండటం గమనార్హం. అంటే నెలకు సగటున 5,000 యూనిట్ల టూర్ వేరియంట్లను కంపెనీ సేల్ చేస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ. మిగతా కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్స్‌తో పోల్చితే డిజైర్ ఎస్ వేరియంట్ టాప్‌లో ఉంది.
టాటా టిగోర్ నెలకు సగటున 1,300 యూనిట్లు, హోండా అమేజ్ 2,300 యూనిట్లు, హ్యుందాయ్ ఆరా 4,500 యూనిట్లతో పోల్చితే డిజైర్ టూర్ సెడాన్ అప్పర్ హ్యాండ్‌లో ఉంది. దీనివల్ల టూర్ ఎస్ ఏ విధంగా చూసుకున్న కంపెనీకి లాభాలను తెచ్చి పెడుతోంది. దీనిని ఎక్కువగా బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉబెర్, ఓలా ట్యాక్సీలుగా వినియోగిస్తున్నారు. అలాగే కంపెనీలలో ఎంగేజ్ కింద ఈ కార్లను ఎక్కువగా వాడుతున్నారు.
ఇది మంచి మైలేజీ కోసం సీఎన్‌జీ వెర్షన్‌లో అందుబాటులో ఉండటం ట్యాక్సీ ఆపరేటర్లకు పెద్ద వరం అనే చెప్పాలి. దేశంలో భారీ మైలేజీ కలిగిన ఎంట్రీ లెవల్ టాక్సీ సెడాన్‌గా టూర్ ఎస్ అందుబాటులో ఉంది. ఇది ప్రస్తుతం రెండు ఇంజిన్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు. సీఎన్‌జీ వేరియంట్ కిలోకు 32.12 కిమీ మైలేజీని ఇస్తుంది. అలాగే పెట్రోల్ వేరియంట్ 23.15 కిమీ మైలేజీని అందిస్తుంది.
టూర్ ఎస్ బ్యాడ్జ్ మినహా, కారు ఎక్స్‌టీరియర్‌లో ఎటువంటి మార్పులు లేవు. ఈ మారుతి టాక్సీ సెడాన్ సరసమైన ధరలో లభిస్తుంది. టాక్సీ వినియోగంతో పాటు ఫ్యామిలీ కార్లకు ఇది సరిపోతుంది. డిజైర్ టూర్ ఎస్ ప్రస్తుతం రెండు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ .6.51 లక్షల నుంచి రూ .7.46 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉంది.


Click it and Unblock the Notifications








