రూ. 8 లక్షలకే 28 కి.మీ మైలేజ్ ఇచ్చే 7-సీటర్ ఫ్యామిలీ కారు.. అదిరిపోతున్న మారుతీ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ భారత వినియోగదారులను ఆకట్టుకోడానికి ట్రెండ్‌కు అనుగుణంగా అధునాతన ఫీచర్లతో కొత్త కొత్త కార్లను విడుదల చేస్తుంది. దేశయంగా ఆటోమొబైల్ మార్కెట్‌లో పోటీ భారీగా పెరిగింది. ఈ క్రమంలో ఇతర కంపెనీలు వరుసగా మోడళ్లను లాంచ్ చేస్తుండటంతో మారుతీ సైతం మర్కెట్లో తన వాటాను నిలబెట్టుకోడానికి ఈ ఏడాదిలో పలు కార్లను విడుదల చేసింది. కంపెనీ ఇటీవలి సెప్టెంబర్ నెలలో తన ఫేమస్ మోడల్ ఎర్టిగా(Ertiga) కొత్త వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఇది కుటుంబ వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుంది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్, ముఖ్యంగా ఇన్నోవా మోడల్‌తో నేరుగా పోటీపడుతుంది. ఎక్కువ మంది ఒకేసారి ప్రయాణించడానికి ఎంపీవీ(MPV) విభాగంలో ఎర్టిగా బాగా క్లిక్ అవుతుందని కంపెనీ అంచనాలు పెట్టుకుంది.

ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్ జర్నీ, టూర్లకు వెళ్లడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. ఎంపీవీలకు ఇండియాలో ఎక్కువ డిమాండ్ ఉన్న నేపథ్యంలో మారుతీ సుజుకీ ఈ కొత్త ఎర్టిగాను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కారులో అన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. దేశీయ వినియోగదారుల అవసరాలను తీర్చడంలో ఈ కారు ప్రధాన పాత్ర పోషించనుంది.

Maruti Ertiga 2024 New Facelift Launch

2024 మారుతీ ఎర్టిగా ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ చాలా స్టైలీష్‌గా ఉంటుంది. ప్రీమియం లుక్‌ను కలిగిస్తుంది. ముందు అమర్చిన గ్రిల్, బంపర్ ఆకట్టుకునే విధంగా ఉంది. లోపల సీటింగ్ దగ్గర ఎక్కువ స్థలం ఉంటుంది. దీంతో ఎక్కువ దూరం ప్రయాణం చేసిన కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లవచ్చు. చీకట్లో మెరుగైన వెలుతురు కోసం కొత్త హెడ్‌లైట్‌లను అమర్చారు. వెనుక భాగంలో LED టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి.

ఇంజిన్ విషయానికి వస్తే, ఇది పెట్రోల్, హైబ్రిడ్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంజిన్‌లో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌‌ను జోడించారు. ఇది దాదాపు 28kmpl వరకు మైలేజ్‌ను అందిస్తుంది. ఇంధన ధరలు ఎక్కువగా ఉన్న కాలంలో మైలేజ్ పరంగా ఈ కారు వినియోగదారులను బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది.

Maruti Ertiga 2024 New Facelift Design

ఎర్టిగా పెట్రో‌ల్ మోడల్ నాలుగు వేరియంట్‌లు LXi, VXi, ZXi, ZXi+ లలో లభిస్తుంది. మారుతీ సుజుకీ పేర్కొన్న దాని ప్రకారం, కొత్త ఎర్టిగా ప్రారంభ ధర రూ.8 లక్షల వరకు ఉంటుంది. అదే హైబ్రిడ్‌లో లిథియం-అయాన్ బ్యాటరీ, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ ఉంది. ఇది ZXi+ హైబ్రిడ్, ZXi+ హైబ్రిడ్ టెక్ వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ.13.95 లక్షల వరకు ఉంది.

ఈ కారు క్యాబిన్‌లో అధునాతన ఫీచర్లను కంపెనీ అందించింది. లోపల 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, పార్కింగ్ సెన్సార్లు, నావిగేషన్, రియర్‌వ్యూ కెమెరా సెటప్, మూడు వరుసల సీటింగ్ ఆప్షన్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు వంటివి ఉన్నాయి. బయటి నుంచి కారు అందాన్ని పెంచడంలో కొత్త 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్‌ కూడా ఎక్కువగానే ఉంటుంది.

Maruti Ertiga 2024 New Facelift

ఇంకా, కారు లోపల నుంచి చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ కెమెరా, వెనుక AC వెంట్లతో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, 40కి పైగా ఫీచర్లతో కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, EBDతో కూడిన ABS సిస్టం, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటివి కూడా ఉన్నాయి.

పెట్రోల్ మోడల్‌తో పాటు, హైబ్రిడ్ మోడల్ కూడా కుటుంబ వినియోగదారులకు అనువుగా ఉంటాయి. ఎంపీవీ సెగ్మెట్ కోసం చూస్తున్న వారికి ఎర్టిగా మంచి ఆప్ఫన్‌గా ఉంది. ఇది మార్కెట్లో మహీంద్రా మరాజ్జో, కియా కారెన్స్‌కు గట్టి పోటీగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, November 21, 2024, 16:25 [IST]
English summary
Maruti ertiga 2024 new facelift launch design specifications all details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+