ఇండియాలో అందరూ ఈ కారునే కొంటున్నారు.. సేల్స్‌లో నంబర్ 1.. 26 కి.మీ మైలేజీ, రెండు ఫ్యామిలీలు హాయిగా వెళ్లవచ్చు!

మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) భారతీయ కార్ల మార్కెట్‌లోని అమ్మకాల్లో గత రెండు నెలలుగా దుమ్మురేపుతోంది. మార్కెట్‌లో ఎస్‌యూవీలు, హ్యాచ్‌బ్యాక్‌లను తట్టుకుని ఈ కారు సేల్స్‌లో నంబర్‌ 1 స్థానంలో కొనసాగుతోంది. మారుతి ఎర్టిగా అమ్మకాల్లో టాప్‌లో కొనసాగుతుండటంతో 7 సీటర్‌ ఎంపీవీల అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఇతర కార్లతో పోల్చితే తిరుగులేని శక్తిగా ఉంది. గత నెల సెప్టెంబర్‌లో 17,441 యూనిట్లు సేల్‌ అవ్వగా.. అక్టోబర్‌లో ఈ 18,785 యూనిట్లుగా ఉంది. ఈ కారు అమ్మకాలకు సంబంధించిన తాజా వివరాలు ఈ కథనంలో..

ఈ ఆర్థిక సంవత్సరంలో మారుతి ఎర్టిగా జెట్‌ స్పీడ్‌లో దూసుకెళ్తుంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మారుతి ఎర్టిగా మొత్తం 113,846 యూనిట్లను విక్రయించింది. మొత్తం ఎంపీవీ అమ్మాకాల్లో ఇది సింహభాగాన్ని ఆక్రమించింది. మొత్తం నెలవారీ సగటు 16,264 కార్లుగా ఉంది. ఈ భారీ కారుని పెట్రోల్ ఇంజిన్ లేదా పెట్రోల్, సీఎన్‌జీ బై ఫ్యూయల్‌ ఆప్షన్‌తో కొనుగోలు చేయవచ్చు.

Maruti Ertiga October 2024 Sales Report

ఇందులోని పెట్రోల్ వేరియంట్‌ కె 15సీ స్మార్ట్ హైబ్రిడ్ 1.5-లీటర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 103 ps పవర్‌ని, 137 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో వస్తుంది. ఇందులోని సీఎన్‌జీ వెర్షన్ 88 ps పవర్‌ని, 121 nm తక్కువ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కానీ ఇది భారీ మైలేజీని అందిస్తుంది.

మైలేజీలో తోపు కావడంతో జనాలు ఎక్కువగా ఎర్టిగాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ భారీ కారులో రెండు కుటుంబాలు తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. దీని పెట్రోల్‌పై లీటరుకు 20 కిలోమీటర్లు, సీఎన్‌జీపై కిలోకు 26 కిలోమీటర్లకు పైగా మైలేజీని ఇస్తుంది. మైలేజీ, సీటింగ్‌, ఫీచర్ల పరంగా ఆల్‌రౌండర్‌గా ఉండటంతో ఈ కారుకి డిమాండ్‌ పెరుగుతోంది.

Maruti Ertiga Sales

ఇక ఎర్టిగా పెట్రోల్ ఇంజిన్ ధరలు రూ .8.69 లక్షల నుంచి రూ .13.03 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇక సీఎన్‌జీ వెర్షన్‌ని రూ. రూ.10.78 లక్షల నుంచి రూ. 11.88 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య కొనుగోలు చేయవచ్చు. మార్కెట్‌లో లభించే ఇతర ఎస్‌యూవీలు, హ్యాచ్‌బ్యాక్స్‌తో సమానంగా దీని ధర ఉండటం వల్ల దీనికి డిమాండ్‌ అమాంతం పెరిగింది.

ఇందులోని హాలోజెన్ ప్రొజెక్టర్ హెడ్ లైట్స్‌, LED టెయిల్‌లైట్స్‌, 15 ఇంచెస్‌ అల్లాయ్ వీల్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఇంటీరియర్‌లో 7-ఇంచెస్‌ స్మార్ట్ ప్లే ప్రో టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, రెండవ వరుసలో రూఫ్-మౌంటెడ్ ఏసీ వెంట్స్ వంటివి ఉన్నాయి. సేఫ్టీలోనూ ఇది బెస్ట్‌ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులోని నాలుగు ఎయిర్‌బ్యాగ్స్‌, ఈ కారులో ప్రయాణించే వారికి మంచి సేఫ్టీని అందిస్తుంది.

Maruti Ertiga Price

దీంతో పాటు ఏబీఎస్, ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ సేఫ్టీ ఫీచర్ల వల్ల ఎర్టిగా మార్కెట్‌లో నమ్మదగిన ఫ్యామిలీ కారుగా అవతరించింది. ఈ మారుతి సుజుకి ఎర్టిగా మార్కెట్‌లో రెనాల్ట్ ట్రైబర్, కియా కేరెన్స్, టయోటా రూమియాన్‌, ఇన్నోవా క్రిస్టా వంటి వాటికి గట్టి పోటీని ఇస్తుంది.

పైన చెప్పిన 7 సీటర్‌ కార్లు సేల్స్‌లో ఈ ఎంపీవీకి ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోతున్నాయి. ఇటీవలి కాలంలో హోమ్ ఫ్రెండ్లీ కార్ల విక్రయాలు పెరుగుతున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ మంది ప్రయాణించడానికి అనువుగా ఉండేలా కార్లను కొంటున్నారు. ఈ వరుసలో మారుతి ఎర్టిగా ముందుంది. మంచి సీటింగ్‌, కంఫర్ట్‌ రైడింగ్‌ కోసం కారు చూస్తున్నట్లైతే మీకు ఎర్టిగా ఫర్‌ఫెక్ట్‌ ఆప్షన్‌ అవుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 7, 2024, 10:22 [IST]
English summary
Maruti ertiga october 2024 sales report check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+