7మంది ఈజీగా వెళ్లే ఈ పెద్ద కారు సేఫ్టీలో తేలిపోయింది.. వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది!

భారత్‌లో మల్టీ పర్పస్ వాహనాల (MPV)లకు డిమాండ్ పెరుగుతుంది. ఎక్కువ మంది ఈ కార్లలో కలిసి వెళ్లవచ్చు. దీంతో జనాలు వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ ధరలో మంచి కార్లను అందించే మారుతి సుజుకి ఎంపీవీలను కూడా అధికంగానే విక్రయిస్తుంది. ముఖ్యంగా 7,8,9-సీటర్ మోడళ్లలో లభించే ఎంపీవీలను జనాలు ఎక్కువగా కొంటున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న ఎంపీవీలలో ఎర్టిగా (Ertiga) ఉంది. భారత్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న కారు మోడల్స్‌లో మారుతి ఎర్టిగా టాప్ 10లో ఉంది. అయితే ప్రస్తుతం కార్లు కొనుగోలు చేసే కస్టమర్లు వాటి సేఫ్టీ రేటింగ్‌ని చూసి కొనుగోలు చేస్తున్నారు. ధర తక్కువ కంటే ఎక్కువ సేఫ్టీ అందించే కార్లకే ఓటేస్తున్నారు.

మారుతి నుంచి అత్యంత ప్రాక్టికల్ మరియు తక్కువ ధరలో అందుబాటులో ఉండే ఈ ఎంపీవీ భారత్‌తో పాటు ఆఫ్రికా వంటి దేశాలకు కూడా ఆ సంస్థ ఎగుమతి చేస్తుంది. అయితే ఈ మేడ్ ఇన్ ఇండియా మారుతి ఎర్టిగా గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్‌టెస్ట్‌లో విఫలమైంది. ఈ ఎంపీవీ Global NCAP క్రాష్‌ టేస్ట్‌లో కేవలం 1-స్టార్ రేటింగ్‌ని సాధించింది. ఆఫ్రికా మార్కెట్‌లో విక్రయించే ఎర్టిగాకు క్రాష్ టెస్ట్‌ నిర్వహించారు.

Maruti-Ertiga-Global-NCAP-Crash-Test

గంటకు 64 కిలోమీటర్ల వేగంతో ఫ్రంట్ ఆఫ్ సెట్ బారియర్ టెస్ట్, 50 కిలోమీటర్ల వేగంతో సైడ్ బారియర్ టెస్ట్ నిర్వహించారు. ఈ క్రాష్ టెస్ట్ వీడియోలను గ్లోబల్ ఎన్‌సీఏపీ తమ యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసింది. ఇందులో రెండు ఎయిర్ బ్యాగులను ప్రామాణికంగా తీసుకున్నా.. టెస్ట్‌లో వీగిపోయింది. క్రాష్‌ టెస్ట్‌ తర్వాత ఎర్టిగా నిర్మాణం పూర్తిగా అస్థిరంగా ఉందని తేలింది.

ఎర్టిగా ఫుట్ వెల్ ప్రాంతం కూడా సరిగ్గా లేదని అంచనా వేయబడింది. డ్రైవర్ దిగువ కాళ్ళకు గాయం అయ్యే అవకాశం ఉందని గ్లోబల్ NCAP ప్రత్యేకంగా పేర్కొంది. కానీ సైడ్ ఇంపాక్ట్‌లో పెద్దల ప్రయాణికుల తల, మెడ మరియు ఛాతీ భద్రత కాస్త మెరుగ్గా ఉందని రేటింగ్ ఇవ్వబడింది. మొత్తానికి పెద్దల రక్షణలో 34 పాయింట్లకు గానూ 23.63 పాయింట్లు సాధించినట్లు పేర్కొంది.

Maruti-Ertiga-Scores-1-Star-Rating-Global-NCAP-Crash-Test

ఇక పిల్లల భద్రతలోనూ ఈ ఎంపీవీ వెనుకబడి ఉందనే తేలింది. పిల్లల సేఫ్టీలో 49 పాయింట్లకు గానూ 19.40 పాయింట్లను సాధించింది. ఓవరాల్‌గా చూసుకుంటే కేవలం 1 స్టార్‌ రేటింగ్‌ని సాధించి ఆశ్చర్యపరచింది. గత నాలుగేళ్ల క్రితం ఇదే మారుతి ఎర్టిగా గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 3-స్టార్ రేటింగ్ సాధించింది. తాజా ఫలితాలు ఈ కారు క్వాలిటీపై పలు ప్రశ్నలను లేవనెత్తుతుంది.

2012లో తొలిసారిగా ఎర్టిగా మొదటి జనరేషన్‌ని భారత్‌లో లాంచ్ చేశారు. ఈ ఏడాది ప్రారంభానికి ఎర్టిగా భారతదేశం అంతటా 10 లక్షల అమ్మకాలను సాధించింది. అతి తక్కువ కాలంలో ఈ ఘనత సాధించిన ఎంపీవీగా ఎర్టిగా నిలిచింది. ప్రైవేట్, కమర్షియల్ సెగ్మెంట్‌ వారు ఈ ఎర్టిగాను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అందువల్ల ఈ మోడల్‌కి ఎక్కువ ఆదరణ లభిస్తుంది. ఇన్నోవాను కొనుగోలు చేసే బదులు ప్రత్యామ్నాయంగా దీనిని కొనుగోలు చేస్తున్నారు.

ఎర్టిగా రెండో జనరేషన్‌ని 2018 లో విడుదల చేశారు. ఇదే ఎంపీవీని 2022లో ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌లో తీసుుకువచ్చారు. ఇక ఇది 1.5 న్యాచరల్‌ ఆస్పిరేటెడ్‌ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 105bhp పవర్ మరియు 134nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి. ఈ ఎంపీవీ ధర రూ. 8.69 లక్షల నుంచి 13.03 లక్షల మధ్య ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 1, 2024, 13:59 [IST]
English summary
Maruti ertiga scores 1 star rating in global ncap crash test check results here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+