మార్కెట్‌లో 3 ఫ్లాప్ కార్లు.. వీటిని అమ్మేందుకు తిప్పలు పడుతున్న ఆ కంపెనీ!
దేశంలో మారుతి కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీకి చెందిన కార్లు మార్కెట్‌లో ఎక్కువ సంఖ్యలో జనాలు కొంటూ ఉంటారు. ఈ కంపనీ ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ కార్లను విడుదల చేయడం కూడా ఓ విధంగా కంపెనీ సేల్స్ పెరగడానికి కారణం అని చెప్పవచ్చు. మార్కెట్‌లో ఉన్న ఇతర కంపనీ కార్లు మారుతిని బీట్ చేసే విధంగా కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. అయినా కానీ మారుతికి ఏమాత్రం పోటీని ఇవ్వలేక పోతున్నాయి. గత రెండు దశాబ్దాలుగా మారుతి కార్లు భారతదేశంలో అతిపెద్ద తయారీదారుగా అలాగే అమ్మకందారుగా కొనసాగుతోంది.
అయితే మారుతి కార్లను ప్రజలు భారీ సంఖ్యలో కొనుగోలు చేస్తున్నప్పటికీ కొన్ని కార్ల అమ్మకాలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఇది మారుతికి కొత్త తలనొప్పి తెచ్చిపెడుతుంది. గత కొన్ని నెలలుగా ఈ కార్లు ఆశించిన స్థాయిలో సేల్స్‌ని రాబట్టడం లేదు. మారుతికి రెడ్ లిస్ట్‌గాా మారబోతున్న ఆ మూడు కార్ల వివరాలు.. గత నెలలో వాటి సేల్స్ రిపోర్ట్‌పై ఓ లుక్కేద్దాం.

భారత్‌లో కార్ల అమ్మకాలు రోజురోజుకూ ఊపందుకున్నాయి. ఈ పండుగ సీజన్‌లో ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు. ఈ పండుగ సీజన్ కోసం కార్ల ఉత్పత్తి సంస్థలు భారతీయ మార్కెట్‌లో వివిధ రకాల కొత్త కార్లను ప్రవేశపెడుతున్నారు. ఎక్కువ కార్లు మార్కెట్‌లో అందుబాటులో ఉండటం వల్ల కస్టమర్లు తమకు నచ్చిన విధంగా కార్లను కూడా కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.
ప్రస్తుతం మార్కెట్‌లో అమ్ముడయ్యే ప్రతి కారులో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మారుతి సుజుకి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీగా అవతరించింది. 2024 సెప్టెంబర్ లోనూ భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి ఎర్టిగా (Maruti Ertiga) నిలిచింది. వీటితో పాటు వ్యాగన్‌ఆర్, ఈకో, స్విఫ్ట్ డిజైర్, గ్రాండ్ విటారా వంటి బెస్ట్ సెల్లింగ్ కార్లు కూడా కంపెనీ వద్ద ఉన్నాయి.

పైన మేము పేర్కొన్న కార్లు నెలకు 10,000 యూనిట్లకు పైగానే అమ్ముడవుతున్నాయి. అయితే కొన్ని మారుతి కార్లు షోరూంలో అలానే ఉండిపోతున్నాయి. ఈ కార్లను కనీసం 1000 మంది కస్టమర్లను కూడా రాబట్టలేక పోతున్నాయి. ఫలితంగా వీటి అమ్మకాలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ జాబితాలో మారుతి ఇన్విక్టో, సియాజ్, జిమ్నీ కార్లు ఉన్నాయి. ఈ కార్లు అత్యంత చెత్త సేల్స్‌లో కొనసాగుతున్నాయి.
ముందుగా ఈ జాబితాలోని ఇన్విక్టో (Maruti Invicto) సెప్టెంబర్ 2024లో కేవలం 312 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇక మారుతి సియాజ్ 662 యూనిట్లు, జిమ్నీ 599 యూనిట్లు సేల్ అయ్యాయి. ఈ మూడు మారుతి కార్లు ఇంత తక్కువ సంఖ్యలో విక్రయించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ మూడు కార్లు కలిపి 1573 కార్లను విక్రయించాయి. ఇది ఓ విధంగా కంపెనీకి భారీ నష్టమే అని చెప్పాలి.

మారుతి ఇన్విక్టో టయోటా యొక్క బెస్ట్ సెల్లింగ్ ఇన్నోవా ఆధారంగా రూపొందించబడింది. ప్రస్తుతం టయోటాకు ఇన్నోవా బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటి ఉంది. దాని ఆధారంగా రూపొందించిన ఈ కారు మాత్రం తేలిపోయింది. దీనికి ప్రధాన కారణం దాని ధర అని ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు. ఈ కారు ధర రూ.25.21 లక్షల నుంచి రూ.28.92 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది.
మారుతి ఇన్విక్టో ఎలక్ట్రిక్-హైబ్రిడ్ టెక్నాలజీతో జతచేయబడిన 2.0-లీటర్ TNGA ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది eసీవీటీ గేర్ బాక్స్ ఆప్షన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 183 bhp పవర్ వద్ద 250 nm గరిష్ట టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 9.5 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అయితే ఈ కారు లీటర్ పెట్రోల్‌కి 23.24 కిలోమీటర్ల భారీ మైలేజీని ఇస్తుంది.


Click it and Unblock the Notifications








