సంచలన ధర వద్ద లాంచ్ అయిన మారుతి ఫ్రాంక్స్ వెలాసిటీ ఎడిషన్ - వివరాలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) యొక్క ఫ్రాంక్స్ వెలాసిటీ ఎడిషన్ (Fronx Velocity Edition) ఇప్పుడు 14 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇవన్నీ పెట్రోల్ మరియు CNG వేరియంట్ల రూపంలో లభిస్తాయి. కంపెనీ అందిస్తున్న ఈ కొత్త ఎడిషన్ ధర రూ. 7.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే ఈ ధర పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

నిజానికి మారుతి సుజుకి ఫ్రాంక్స్ వెలాసిటీ ఎడిషన్‌ అనేది ఈ ఏడాది ఫిబ్రవరిలో కేవలం టర్బో పెట్రోల్ వేరియంట్ కోసం మాత్రమే ప్రారంభమైంది. ఇప్పుడు ఇది దాదాపు అన్ని వేరియంట్లలో లభిస్తోంది. ఈ కొత్త ఎడిషన్ స్పోర్టీ కాస్మెటిక్ యాక్సెసరీలను పొందుతుంది. అయితే ఇవన్నీ ఎంపిక చేసుకునే వేరియంట్‌లను బట్టి మారుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

Maruti Fronx Velocity Edition

మారుతి సుజుకి ఫ్రాంక్స్ వెలాసిటీ ఎడిషన్‌ యొక్క 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో కూడిన బేస్ లెవెల్ మోడల్ సిగ్మా వేరియంట్‌లో బ్లాక్ అండ్ రెడ్ ఫ్రంట్ బంపర్ గార్నిష్ మరియు ఓపులెంట్ రెడ్ ఫ్రంట్ గ్రిల్ గార్నిష్ ఉన్నాయి. అదే విధంగా 1.2 లీటర్ ఇంజన్ యొక్క డెల్టా, డెల్టా ప్లస్ మరియు డెల్టా ప్లస్ (ఓ) వేరియంట్‌లు సిగ్మా ట్రిమ్‌ కంటే మరింత మెరుగ్గా ఉంటాయి.

డెల్టా, డెల్టా ప్లస్ మరియు డెల్టా ప్లస్ (ఓ) వేరియంట్‌లు.. సైడ్ మౌల్డింగ్‌లో రెడ్ ఇన్సర్ట్‌లు, బ్లాక్ అండ్ రెడ్ రియర్ బంపర్ గార్నిష్, ఇల్యూమినేటెడ్ డోర్ సిల్ గార్డ్ మరియు రెడ్ ఫినిష్డ్ అవుట్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్స్ వంటి వాటిని పొందుతాయి. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ కలిగిన డెల్టా ప్లస్, ఆల్ఫా మరియు జీటా ట్రిమ్‌లు ఒకే విధమైన డిజైన్ పొందుతాయి.

1.0 లీటర్ టర్బో పెట్రోల్ డెల్టా ప్లస్, ఆల్ఫా మరియు జీటా ట్రిమ్‌లు గ్రే మరియు రెడ్ ఎక్స్‌టీరియర్ స్టైలింగ్ కిట్, బ్లాక్ అండ్ రెడ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్ గార్నిష్, ఇల్యూమినేటెడ్ డోర్ సిల్ గార్డ్, ఇంటీరియర్ ఎలిమెంట్స్‌పై కార్బన్ ఫినిషింగ్ మరియు ఓపులెంట్ రెడ్ ఫ్రంట్ గ్రిల్ గార్నిష్ వంటి వాటిని పొందుతాయి.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ వెలాసిటీ ఎడిషన్ రెండు ఇంజన్ ఆప్షన్స్ పొందుతుంది. అవి 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఈ రెండు ఇంజిన్లు మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. టర్బో పెట్రోల్ వేరియంట్‌ల లోపలి భాగం కూడా యాక్సెసరైజ్ చేయబడింది. కావున ఇది మరింత అద్భుతంగా ఉంటుంది.

భారతీయ విఫణిలో మారుతి ఫ్రాంక్స్.. దాని రీబ్యాడ్జ్ వెర్షన్ టయోటా టైసర్‌కు ప్రత్యక్ష పోటీదారుగా ఉంటుంది. ఇది కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ300, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్, మారుతి బ్రెజ్జా, సిట్రోయెన్ సీ3 మరియు హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా ఇది కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, June 22, 2024, 12:54 [IST]
English summary
Maruti fronx velocity edition launched at rs 7 29 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+