ఇది కదా క్రేజ్ అంటే?.. రెండేళ్లలో 2 లక్షలమంది కొనేశారు!

భారతదేశంలో అధిక ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి (Maruti Suzuki) దేశీయ విఫణిలో ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ.. తన ఉనికిని చాటుకుంటోంది. ఈ తరుణంలో గ్రాండ్ విటారా (Grand Vitara) లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును 2022 సెప్టెంబర్ 22న లాంచ్ చేసింది. లాంచ్ అత్యుత్తమ అమ్మకాలను పొందుతున్న గ్రాండ్ విటారా 22 నెలల్లోనే రెండు లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. దీన్ని బట్టి చూస్తే ఈ SUVకి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.

2022 సెప్టెంబర్ 26న లాంచ్ అయిన మారుతి గ్రాండ్ విటారా 2023 ఆర్థిక సంవత్సరంలో 51315 యూనిట్లు మరియు 2024 ఆర్థిక సంవత్సరంలో 121169 యూనిట్ల సేల్స్ పొందింది. మొత్తం మీద మొత్తం 22 నెలల్లో.. రెండు సంవత్సరాల కంటే ముందే 199550 యూనిట్లను విజయవంతంగా విక్రయించింది. ఇది మారుతి సుజుకి అమ్మకాలలో అరుదైన రికార్డ్ అనే చెప్పాలి.

Maruti Grand Vitara

అతి తక్కువ కాలంలో ఎక్కువ అమ్మకాలను పొందిన కార్ల జాబితాలో మారుతి గ్రాండ్ విటారా చేరింది. గతంలో హ్యుందాయ్ క్రెటా 25 నెలల్లో 2 లక్షల కార్ల అమ్మకాలను పొందగలిగింది. ఆ రికార్డును గ్రాండ్ వితరా చెరిపేసింది. ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది. మారుతి సుజుకి మొత్తం అమ్మకాల్లో గ్రాండ్ విటారా వాటా 17 శాతం. గ్రాండ్ విటారా 12 నెలల్లో ఒక లక్ష యూనిట్ల విక్రయాలను పొందింది.

మొదటి లక్ష యూనిట్ల అమ్మకాలను పొందిన తరువాత గ్రాండ్ విటారా కేవలం 10 నెలల్లోనే మరో లక్ష యూనిట్ల సేల్స్ సాధించింది. ఈ విధంగా కంపెనీ 22 నెలల్లోనే మొత్తం 2 లక్షల అమ్మకాలను సాధించగలిగింది. మార్కెట్లో తన ప్రత్యర్థులైన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, వోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ మరియు టయోటా హైరైడర్ వంటి వాటికి పోటీ ఇస్తూనే గ్రాండ్ విటారా గ్రాండ్ సేల్స్ సాధించింది.

Maruti Grand Vitara

మారుతి సుజుకి అమ్మకాల్లో కీలక పాత్ర పోషించిన మారుతి గ్రాండ్ విటారా నెక్సా అమ్మకాల్లో 19 శాతం సహకారం అందించినట్లు నివేదికలు చెబుతున్నాయి. బాలెనొ మరియు ఇగ్నిస్ తరువాత స్థానంలో గ్రాండ్ విటారా చేరింది. దీన్ని బట్టి చూస్తే మారుతి సుజుకి అమ్మకాల్లో గ్రాండ్ విటారా మూడో స్థానం ఆక్రమించినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే సూచన ఉన్నట్లు తెలుస్తోంది.

మారుతి సుజుకి తన గ్రాండ్ విటారాను CNG రూపంలో కూడా లాంచ్ చేసింది. కంపెనీ నిరంతరం CNG పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూనే ఉంది. ఇప్పటికే ఈ జాబితాలో 14 CNG మోడల్స్ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కంపెనీ తన గ్రాండ్ విటారా CNG కారును జనవరి నుంచి జూన్ వరకు 159031 యూనిట్ల సేల్స్ పొందింది. కంపెనీ యొక్క ఈ కారు CNG వాహన విభాగంలో కూడా మంచి అమ్మకాలను పొందగలుగుతోంది.

Maruti Grand Vitara

ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా మారుతి గ్రాండ్ విటారా విదేశీ మార్కెట్ల కోసం కూడా ఎగుమతి అవుతోంది. ఇందులో భాగంగానే 2023 జనవరిలో కంపెనీ మేడ్ ఇన్ ఇండియా గ్రాండ్ విటారా కారు యొక్క మొదటి బ్యాచ్ కామరాజర్ పోర్ట్ నుంచి లాటిన్ అమెరికాకు పయనమైంది. కంపెనీ ఇప్పటి వరకు ఎగుమతి చేసిన కార్లలో ఇది 17వ ఎగుమతి మోడల్‌గా నిలిచింది.

దేశీయ విఫణిలో అడుగుపెట్టిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఆనతి కాలంలో గొప్ప అమ్మకాలను పొందిన కార్ల జాబితాలో మారుతి గ్రాండ్ విటారా కూడా ఉంది. ఈ కారు అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇది ఉత్తమ పనితీరును అందిస్తుందని కూడా ధృవీకరించబడింది. ఈ కారణంగానే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కూడా మంచి సేల్స్ పొందగలుగుతోంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, July 22, 2024, 9:51 [IST]
English summary
Maruti grand vitara 2 lakh unit sales in 22 months
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+