బైక్‌తో సమానంగా మైలేజీ ఇవ్వనున్న మారుతి 7 సీటర్ కొత్త కారు.. ఈ కారు గురించి అందరికీ తెలుసు!
మారుతి సుజుకి గ్రాండ్ విటారా భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా ఉంది. ఇందులో అదిరిపోయే ఫీచర్లు, సరసమైన ధరలో అందుబాటులో ఉండటంతో ఈ కారుని కొనేందుకు జనాలు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఈ కారు 5 సీట్ల వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 5 సీట్ల కారు కావడంతో ఇందులో 2 స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. కానీ మారుతి సుజుకి ఇప్పుడు గ్రాండ్ విటారాకు అదనపు లైనప్ జోడించి 3 స్టెప్స్‌తో 7 మంది సౌకర్యవంతంగా ప్రయాణించేలా తీసుకురానున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో..
ఈ సరికొత్త మారుతి సుజుకి గ్రాండ్ విటారా 7-సీటర్ వెర్షన్ 2025లో విడుదల కానుంది. ఈ గ్రాండ్ విటారా 7-సీటర్ మోడల్‌లో మొత్తం 2 ఇంజిన్ ఆప్షన్లను అందించే అవకాశం ఉంది. ఇవి 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తాయి.

ఇక మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ 103ps మరియు 107 nm టార్క్‌ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. మరోవైపు, స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ 116 ps మరియు 122 nm టార్క్‌ని ఉత్పత్తి చేయగలదు. ఈ రెండు ఇంజిన్లు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా 7-సీటర్ వేరియంట్‌లో అధిక మైలేజీని అందించనుంది. ఒకేసారి ఎక్కువ మంది ఉపయోగించగల కారు కాబట్టి ఇది వినియోగదారులకు అనువైనదిగా ఉండనుంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా 5-సీటర్ మోడల్‌లో స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ లీటర్‌కి 27.97 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. గ్రాండ్ విటారా 7-సీటర్ మోడల్ నుంచి దాదాపు ఇదే మైలేజీని ఆశించవచ్చు.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా 7-సీటర్ మోడల్ ధర రూ .13 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండనుంది. బేస్ వేరియంట్‌లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా 7-సీటర్ ఎడిషన్ లాంచ్ చేస్తే భారీ విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ సెప్టెంబర్ 9న (September 9) లాంచ్ కానుంది. ఇది కూడా దాదాపు అంతే ధరలో రానుంది.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా యొక్క 7 సీట్ల వెర్షన్‌లో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్)తో సహా అన్ని అనేక ఫీచర్లను అందిస్తుందని భావిస్తున్నారు. మారుతి సుజుకి గ్రాండ్ విటారా 7-సీటర్ భారత మార్కెట్‌లో టాటా సఫారీ, ఎంజి హెక్టర్ ప్లస్, మహీంద్రా ఎక్స్యూవి 700 మరియు హ్యుందాయ్ అల్కాజర్ వంటి వాటికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
మార్కెట్‌లో మారుతి సుజుకి నుంచి అందుబాటులో ఉన్న మారుతి ఎర్టిగా అత్యధికంగా అమ్ముడవుతున్న 7 సీటర్ ఎంపీవీగా కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఇప్పుడు సరికొత్త గ్రాండ్ విటారాను 7 సీటర్ వెర్షన్‌లో తీసుకువస్తుండటంతో అంచనాలు అమాంతం పెరుగిపోతున్నా. ఎందుకంటే మారుతి గ్రాండ్ విటారా ఇప్పటికే మార్కెట్‌లో కింగ్ మేకర్‌గా ఉంది. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీ కూడా సేల్స్‌లో టాప్10 లో ఉండటమే దీనికి కారణం అని చెప్పవచ్చు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








