మారుతి హైబ్రిడ్‌ కారుపై రూ. 74,000 డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ రాకపోవచ్చు

భారతదేశంలో మారుతి సుజుకి విక్రయిస్తున్న ప్రముఖ ఎస్‌యూవీలలో గ్రాండ్ విటారా ఒకటి. కొత్త మారుతి సుజుకి గ్రాండ్ విటారా సరికొత్త అప్‌డేట్స్‌తో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. మారుతి సుజుకి కొత్త గ్రాండ్ విటారాను కొనుగోలు చేసేవారికి గొప్ప ఆఫర్‌ని ప్రకటించింది. మారుతి సుజుకి ఇప్పుడు గ్రాండ్ విటారా హైబ్రిడ్ వేరియంట్ కొనుగోలుపై రూ .74,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ .20,000 క్యాష్‌ డిస్కౌంట్‌ మరియు రూ .50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. అంతే కాకుండా 4,000 కార్పొరేట్ బోనస్ కూడా ఉంటుంది.

ప్రస్తుతం మారుతి సుజుకి మూడు సంవత్సరాల పొడిగించిన వారంటీని
కూడా అందిస్తోంది. హైదరాబాద్‌లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా యొక్క బేస్ మోడల్ (Base Version) పెట్రోల్‌ ఇంజిన్‌తో నడిచే సిగ్మా ఆన్-రోడ్ ధర రూ. 13.61 లక్షలుగా ఉంది. ప్రస్తుతం మారుతి హైబ్రిడ్‌ కారు బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా ఉంది. హ్యుందాయ్‌ క్రెటా తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్‌-సైజ్‌ ఎస్‌యూవీగా గ్రాండ్‌ విటారా కొనసాగుతుంది.

maruti-Grand-Vitara-Price

ఇందులోని పెట్రోల్ వేరియంట్స్‌ డెల్టా ధర రూ .15.10 లక్షలు, డెల్టా ఎటి రూ .16.83 లక్షలు, జీటా రూ .17.34 లక్షలు మరియు ఆల్ఫా వేరియంట్‌ ధర రూ .19.29 లక్షలు ఆన్-రోడ్ ధరలో అందుబాటులో ఉన్నాయి. ఆల్ఫా డీటీ ధర రూ.19.39 లక్షలుగా ఉంది.

ఆల్ఫా AT ధర రూ. 21.02 లక్షలు, ఆల్ఫా AWD రూ. 21.14 లక్షలుగా ఉంది. ఆల్ఫా AT డీటీ రూ. 21.22 లక్షలు, ఆల్ఫా AWD DT ధర రూ.21.34 లక్షలు, జీటా ప్లస్ హైబ్రిడ్ సీవీటీ ధర రూ.22.90 లక్షలు, జీటా ప్లస్ హైబ్రిడ్ CVT DT ధర రూ.23.10 లక్షలుగా ఉన్నాయి.

Maruti-Suzuki-Grand-Vitara-Discounts

ఈ కారు 1.5-లీటర్ పెట్రోల్-మైల్డ్ హైబ్రిడ్, 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మరియు సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్‌లతో పాటు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు ఇ-సీవీటీ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్స్‌ 19.38 - 27.97 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, సీఎన్‌జీ వేరియంట్లు కిలోకు 26.6 కిలోమీటర్ల మైలేజీ అందిచనుంది.

కొత్త మారుతి సుజుకి గ్రాండ్ విటారాలో AFWD (ఫ్రంట్ వీల్ డ్రైవ్) మరియు AWD (ఆల్-వీల్ డ్రైవ్) టెక్నాలజీ ఉంది. ఈ కారులో 5గురు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, సన్ రూఫ్, యాంబియంట్ లైటింగ్, వైర్ లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Maruti-Grand-Vitara-Price

మారుతి గ్రాండ్ విటారా ఎస్ యూవీలో 6 ఎయిర్ బ్యాగులు, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), 360 డిగ్రీల కెమెరా ఉన్నాయి. ఈ కారు యొక్క ఆన్-రోడ్ ధరలు మరియు లోన్‌ ఆప్షన్స్‌ రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి మరింత సమాచారం కోసం సమీప షోరూమ్‌ని సందర్శించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోండి.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, June 6, 2024, 17:04 [IST]
English summary
Maruti grand vitara discount up to 74000 on road prices and features explained
Read more on: #maruti suzuki #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+