ఈ కారు మైలేజీ 27.97 కి.మీ.. సేల్స్‌లో ప్రస్తుతం రెండో స్థానం!!
ప్రస్తుతం దేశంలో మిడ్-ఎస్‌యూవీలు బాగా అమ్ముడవుతున్నాయి. అందుకు తగనట్లుగానే పలు కంపెనీలు భారతీయ మార్కెట్‌లో ఎస్‌యూవీలను తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం ఈ విభాగంలో మారుతి, హ్యుందాయ్, టయోటా కార్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. హ్యుందాయ్ నుంచి క్రెటా ఈ విభాగంలో కొన్ని నెలలుగా టాప్‌లో కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానంలో మారుతి గ్రాండ్ విటారా మార్కెట్‌లో మంచి డిమాండ్‌ని కలిగి ఉంది.

మారుతి గ్రాండ్ విటారా ఎస్‌యూవీలో 1.5-లీటర్ K15 సీ-పెట్రోల్ ఇంజిన్ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ మరియు 1.5-లీటర్ TNGA పెట్రోల్ మోటార్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజిన్‌లతో పనిచేస్తుంది. ఇందులోని 1.5-లీటర్ కె15 సి పెట్రోల్ ఇంజన్ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ ద్వారా 102 bhp పవర్ వద్ద 137nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్‌తో జతచేయబడి ఉంటుంది.
ఈ మారుతి ఎస్‌యూవీ యొక్క AWD (All wheel drive) సిస్టమ్ మాన్యువల్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ సిస్టమ్ అని పిలువబడే స్ట్రాంగ్-హైబ్రిడ్ వెర్షన్ ICE యూనిట్ 115 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇ-సివిటితో మాత్రమే జతచేయబడుతుంది. ఈ పవర్ట్రెయిన్ లీటరుకు 27.97 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

మారుతి గ్రాండ్ విటారా పొడవు 4,345 మిమీ, వెడల్పు 1,795 మిమీ మరియు ఎత్తు 1,645 మిమీ మరియు వీల్ బేస్ 2,600 మిమీ. ఇది హైరైడర్ తో కొన్ని బాహ్య స్పెసిఫికేషన్లను పంచుకుంటుంది. హైరైడర్‌కి మరియు గ్రాండ్ విటారాకు చాలా వ్యత్యాసం ఉంది ముఖ్యంగా దాని ఫ్రంట్ డిజైన్. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ డిజైన్ పరంగా బెస్ట్‌గా కనిపించనుంది.
మారుతి సుజుకి ఈ మారుతి ఎస్‌యూవీలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఎడిఎఎస్) టెక్నాలజీని చేర్చానున్నారు. దీనివల్ల సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. గ్రాండ్ విటారా ఇప్పటికే ఫుల్ ఫీచర్ ప్యాక్డ్ వెహికల్‌గా ఉంది. అడాస్ టెక్నాలజీ వల్ల కెమెరాలు మరియు సెన్సార్ల ద్వారా భద్రత మరింత పెరగనుంది.
అడాస్ వల్ల ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ట్రాఫిక్ సిగ్నల్ డిటెక్షన్ అండ్ వార్నింగ్ మరియు లేన్ కార్సింగ్ హెచ్చరికలు ఉన్నాయి. అదనపు ఎడిఎఎస్ టెక్నాలజీలో పార్క్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్ అసిస్ట్ మరియు రియర్ కొలిషన్ వార్నింగ్ ఉన్నాయి. ఇది అమల్లోకి వస్తే మారుతి కార్లలో ఈ టెక్నాలజీని జోడించిన మొట్టమొదటి కారుగా మారుతి సుజుకి గ్రాండ్ విటారా నిలుస్తుంది.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా అద్భుతమైన పనితీరు మరియు మైలేజీకి ప్రసిద్ది చెందింది. ఏప్రిల్ 2024 నెలలో మిడ్-ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో భారతదేశంలో రెండవ బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా గ్రాండ్ విటారా ఉంది. హ్యుందాయ్ క్రెటా గత నెలలో 15,447 యూనిట్ల అమ్మకాలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగగా.. గ్రాండ్ విటారా 7,651 యూనిట్ల అమ్మకాలతో రెండవ స్థానంలో ఉంది.
గ్రాండ్ విటారా ఏప్రిల్ 2023 లో 7,742 యూనిట్లను విక్రయించింది. గత నెల నెలవారీ అమ్మకాలతో పోలిస్తే అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. 2024 మార్చిలో అమ్మకాలు 11,634 యూనిట్లతో పోలిస్తే గత నెలలో 31.88 శాతం క్షీణించాయి. మారుతి సుజుకి గ్రాండ్ విటారా భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్ మరియు ఫోక్స్ వ్యాగన్ టిగోర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications