మారుతి కార్లలో ఇకపై అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ టెక్నాలజీ.. టాటా కార్లకు చుక్కలే!!

ప్రస్తుతం దేశంలో కార్ల కొనుగోళ్లు జోరందుకున్నాయి. అయితే కస్టమర్లు సేఫ్టీ ఫీచర్లు ఎక్కువ కలిగి ఉన్న కార్లను మాత్రమే ఎంచుకుంటున్నారు. తాజాగా ఈ ట్రెండ్‌ మరితం పెరిగింది. అందుబాటులో ఉన్న సమాచారం లేదా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా రివ్యూలను చూసి జనాలు కార్లను కొంటున్నారు.

తాజాగా మారుతి కంపెనీ కూడా తమ సంస్థకు చెందిన ఫేమస్‌ కారులో సేఫ్టీ ఫీచర్‌ని తీసుకురానుంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా దేశంలో అమ్మకానికి ఉన్న ఉత్తమ కార్ మోడళ్లలో ఒకటిగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలల్లో ఈ కారు కూడా ఒకటి. తాజాగా ఈ కారుకి ప్రత్యేక టెక్నాలజీని జోడించనున్నారు. అదే ADAS (Advanced Driver-Assistance System) టెక్నాలజీ.

Maruti-Grand-Vitara-ADAS-Technology

అతి త్వరలోనే ఈ కారుకి ఈ ప్రత్యేక టెక్నాలజీని జోడించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ అనేది కారులో ప్రయాణించే వారికి అధిక సేఫ్టీని అందిస్తుంది. అడాస్‌ని జోడించడం వల్ల కారులోని కెమెరాలు, సెన్సార్లు కార్‌ సేఫ్టీని మరింత కట్టుదిట్టం చేస్తాయి. దేశంలోనే ఎక్కువగా సేల్‌ అవుతున్న జాబితాలో మారుతి సుజుకి నుంచి అందుబాటులో ఉన్న గ్రాండ్ విటారా ఈ ఫీచర్‌ని పొందనుంది.

ఈ టెక్నాలజీ వల్ల ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఆటోమేటిక్‌గా బ్రేకులు వేయడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ని గుర్తించడం, కారును అడ్డుగా ఏదైనా వస్తే హెచ్చరికలు జారీ చేస్తుంది. అంతే కాకుండా పార్క్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్ అసిస్ట్ మరియు రియర్ కొలిషన్ వార్నింగ్ వంటి ఇతర మరెన్నో ప్రయోజనాలు దీనివల్ల ఉంటాయి. ఈ ఫీచర్‌తో మారుతి సుజుకి గ్రాండ్ విటారాకు సేఫ్టీ మెజర్స్‌ మరింతగా పెరగనున్నాయి.

Maruti-Grand-Vitara-ADAS

అడాస్‌ టెక్నాలజీని జోడించిన తొలి కారుగా మారుతి సుజుకి నుంచి గ్రాండ్‌ విటారా నిలుస్తుంది. అడాస్‌ టెక్నాలజీని పరీక్షించడానికి మారుతి ఇప్పటికే ICAT (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ) తో చర్చలు జరుపుతోంది. మనేసర్ లోని మారుతి టెస్ట్ ఫెసిలిటీలో ఈ టెస్టింగ్‌ జరగనుంది. దీనిని జోడిస్తే ఈ కారు పూర్తిగా అల్ట్రా-సేఫ్ వాహనంగా మార్పు చెందనుంది.

ఈ ఏడాది చివరి నాటికి ఈ మోఢిఫైడ్‌ కారు అందుబాటులోకి రానుంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారాలో ప్రస్తుతం యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఇబిడి, సెంట్రల్ లాకింగ్, ఇఎస్పి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), హిల్ అసిస్ట్, ఐసోఫిక్స్ చిల్డ్రన్ సీట్, రివర్స్ కెమెరా మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారుకు ADAS జోడించినట్లయితే ఇక ఈ కారుకి తిరుగుండదు.

Maruti-Grand-Vitara-ADAS-Feature

ప్రస్తుతం మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధర రూ.12.57 లక్షల నుంచి గరిష్ట ధర రూ. 23.32 లక్షల మధ్య ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలే. ఈ కారుకి అడాస్‌ జోడిస్తే వాటి ధరలు రూ.50,000 నుంచి రూ.70,000 పెరిగే అవకాశం ఉంది. టయోటా హైరైడర్‌లోనూ ఈ అడాస్‌ ఫీచర్‌ని తీసుకువచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇక గ్రాండ్ విటారా పెట్రోల్ మరియు సీఎన్‌జీ ఆప్షన్లలో లభిస్తుంది. సీఎన్‌జీ కారు కిలోకు 26.6 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇక ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ 27.97 kmpl, మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 21.11 kmpl వరకు మైలేజీని అందిస్తాయి. మారుతి ఇతర కార్లతో పోలిస్తే హై ఎండ్‌ కారు కావడం వల్ల ఈ సేఫ్టీ ఫీచర్లను జోడిస్తే సేల్స్‌ పెరిగే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, May 17, 2024, 10:45 [IST]
English summary
Maruti grand vitara to get adas feature by end of this year
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+