పెద్ద కారు పైగా అదిరిపోయే డిజైన్.. కానీ కేవలం 296 మంది మాత్రమే కొన్నారు.. ఎందుకిలా!
దేశంలో కుటుంబ ప్రయాణాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. పని ఒత్తిడి నుంచి బయటపడటానికి ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి వీకెండ్స్ లేదా సెలవుల రోజుల్లో విహార యాత్రలకు వెళ్లడం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువ సీటింగ్ సామర్థ్యం కలిగిన కార్లు ఇటీవల కాలంలో అధికంగా అమ్ముడుపోతున్నాయి. దీంతో దేశీయ ఆటోమొబైల్ తయారీ దారులతో పాటు అంతర్జాతీయ కంపెనీలు కూడా వరుసగా పెద్ద సీటింగ్ కలిగిన కార్లను ఇండియా మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం రోజు రోజుకి ఫ్యామిలీ కార్ల అమ్మకాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఎక్కువ సీట్లు కలిగిన కార్లు ఎక్కువగా అమ్ముడుపోతుండగా, మారుతీ సుజుకీకి చెందిన ఒక ఫ్యామిలీ కారు మాత్రం తక్కువ విక్రయాలను నమోదు చేస్తుంది. ప్రజలు ఎక్కువగా ఎక్కువ సీట్లు ఉన్న కార్లను ఇష్టపడుతున్న సమయంలో ఈ కారు మాత్రం ఇతర మోడళ్లతో పోటీ పడలేకపోవడం గమనార్హం.
ఈ మోడల్ పేరే మారుతీ ఇన్విక్టో(maruti invicto). గతంలో ఇన్నోవా కారుకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ఇది అమ్మకాల పరంగా మెరుగైన గణంకాలను నమోదు చేసింది. దీంతో ఈ కారుకు వచ్చిన ఆదరణ దృష్ట్యా ఇన్విక్టోను తీసుకువచ్చారు. అయితే దీనికి మాత్రం అనుకున్నంత డిమాండ్ రాలేదు. అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయి. గత నెలల కాలంలో ఈ కారు విక్రయాలు భారీగా పడిపోయాయి.

తాజాగా వచ్చిన డేటా ప్రకారం, మారుతీ ఇన్విక్టో అమ్మకాలు ఇటీవలి అక్టోబర్ నెలలో 296 గా ఉన్నాయంటే, ఈ మోడల్ డిమాండ్ ఎంత వరకు తగ్గిందో తెలుస్తుంది. ఇది గత ఏడాది అక్టోబర్ నెలలో 312 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇప్పుడు మరి కాస్త తగ్గింది. ఇన్నోవా హైక్రాస్ మోడల్ మాత్రం మెరుగైన విక్రయాలను నమోదు చేస్తుండగా ఇన్విక్టో మాత్రం తక్కువ యూనిట్లు సేల్ అవుతుంది.
మారుతీ ఇన్విక్టో విక్రయాలు మే నెలలో 193, జూన్‌లో 128, జులైలో 251, ఆగస్టులో 124 యూనిట్లుగా ఉండగా, ఇదే సమయంలో ఇదే కంపెనీ ఇతర మోడళ్లకు మాత్రం మంచి డిమాండ్ ఉంటుంది. కరోనా తరువాత ప్రజల్లో కుటుంబ కార్లకు ప్రాధాన్యత పెరిగింది. కొత్త ప్రదేశాలకు వెళ్లడం లాంటి దృష్ట్యా ఈ విభాగంలోని పెద్ద సీటింగ్ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్న తరుణంలో కూడా దీని అమ్మకాలు మాత్రం పుంజుకోవడం లేదు.

మారుతీ ఇన్విక్టో కారు ఎక్కువ అమ్మకాలను నమోదు చేయలేకపోవడానికి ప్రధాన కారణం దాని ధర. ఈ కారు ఇండియా మార్కెట్లో రూ.25.21 లక్షల నుంచి రూ.28 లక్షల ధరకు అందుబాటులో ఉంది. దీంతో చాలా మంది అంత ధర పెట్టి కారును కొనడానికి ముందుకు రావట్లేదు. ఎక్కువ సీటింగ్ సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఇంత కంటే తక్కువ ధరలో లభించే ఇతర కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
మారుతీ ఇన్విక్టో ధర ఎక్కువగా ఉండటంతోనే అమ్మకాలు తక్కువగా నమోదవుతున్నాయని మార్కెట్ వర్గాలు సైతం భావిస్తున్నాయి. ఈ కారు 7, 8 సీట్ల ఆప్షన్లలో లభిస్తుంది. దీని ఇంజిన్ 150.19 bhp పవర్, 188 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇండియన్ మార్కెట్లో ఈ కారు జీటా, ఆల్ఫా ప్లస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వినియోగదారలకు నచ్చేలా పలు కలర్స్‌లో అందుబాటులో ఉంది.

కారులో అధునాతన ఫీచర్లను కూడా అందించారు. బయటి నుంచే కాకుండా లోపల క్యాబిన్ పెద్దగా, విశాలంగా ఉంటుంది. ఎక్కువ మంది కంఫర్ట్‌గా కూర్చునేలా సీటింగ్ అనువుగా ఉంది. కారు డ్యాష్ బోర్డులో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు వంటి 50 కు పైగా ఆప్షన్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








