Maruti Offers మారుతి సుజుకి బంపర్‌ ఆఫర్లు.. ఈ కార్లపై రూ. 1.5 లక్షల వరకు భారీ తగ్గింపులు, అప్పటివరకే ఛాన్స్‌.!

మారుతి సుజుకి తన కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకువచ్చింది. తన నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా ప్రముఖ మోడళ్లపై రూ. 1.5 లక్షల వరకు గణనీయమైన తగ్గింపును అందిస్తోంది. ఫిబ్రవరిలో కస్టమర్లు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవచ్చు. మరి ఏయే కార్లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

భారత మార్కెట్లో ప్రతి ఏటా(Maruti Nexa Offers In February 2024), ప్రతి నెలా అత్యధికంగా అమ్ముడవతున్న కార్లలో మారుతి సుజుకి మోడళ్లు అగ్రస్థానంలో ఉంటున్నాయి. కార్‌ మార్కెట్లో తనకు పోటీ లేకుండా చేసుకుంది. సరసమైన ధరలో మారుతి కార్‌ మోడళ్లు అందుబాటులో ఉండటం, ఆకర్షణీయమైన డిజైన్‌, ఎన్నో రకాల మోడళ్లతో కస్టమర్లకు మారుతి కార్లు ఫేవరెట్‌గా మారాయి.

Maruti-Suzuki-Offers-Nexa-Febraury-2024

ఆకర్షణీయమైన ఆఫర్ల ద్వారా మారుతి సేల్స్‌లో టాప్‌లో నిలుస్తోంది. ఈ క్రమంలో అమ్మకాలను మరింతగా పెంచుకునేందుకు.. మారుతి సుజుకీ ఇప్పుడు కూడా అదే తరహాలో మరిన్ని డిస్కౌంట్లతో ముందుకు వచ్చింది. మారుతి కార్ల ప్రొఫెషనల్ డీలర్ అయిన నెక్సా, తాను విక్రయిస్తున్న పలు మోడళ్లపై రూ. 1.5 లక్షల వరకు గొప్ప ఆఫర్‌ను అందిస్తోంది.

అందుబాటులో ఉన్న నెక్సా డీలర్‌షిప్‌కి చెందిన XL6 మరియు ఇన్విక్టో కార్లు మినహా అన్ని కార్లకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని సంస్థ తెలిపింది. నెక్సా డీలర్‌షిప్‌ ద్వారా విక్రయించే జిమ్నీ, గ్రాండ్ విటారా, బాలెనో, ఫ్రాంక్స్‌, సియాస్ మరియు ఇగ్నిస్ కార్లపై ఈ భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. Nexa ఫిబ్రవరి నెలలో తన కార్ల కోసం ఈ ఆఫర్‌ను అందిస్తోంది.

Maruti-Suzuki-Offers-Nexa-Febraury-2024

నెక్సా అందిస్తున్న ఆఫర్లలో మారుతి సుజుకి జిమ్నీ(Maruti Suzuki Jimny) అత్యధిక తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ కారును కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 1.5 లక్షల వరకు భారీ తగ్గింపులను పొందవచ్చు. జిమ్నీ 5 డోర్ ఇంజిన్ విషయానికొస్తే ఇది 6000 rpm వద్ద 104.8 Ps పీక్ పవర్ మరియు 4000 rpm వద్ద 134.2 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఐడిల్ స్టార్ట్/స్టాప్ బటన్ ఫీచర్‌తో 1.5L K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. మారుతి సుజుకి జిమ్నీ 5 స్పీడ్ మ్యాన్యువల్ మరియు 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫిబ్రవరిలో ఆఫ్ రోడర్ జిమ్నీ మోడల్‌(Off Roader Jimny)పై కస్టమర్లు భారీ డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Maruti-Suzuki-Offers-Nexa-Febraury-2024

మారుతి సుజుకి జిమ్మీ తర్వాత.. అత్యధిక డిస్కౌంట్‌ ఉన్న కారు ఇటీవల విడుదలైన మారుతి సుజుకి గ్రాండ్ విటారా(Maruti Grand Vitara). దీని స్ట్రాంగ్‌ హైబ్రిడ్ వేరియంట్‌పై రూ. 75,000 వరకు తగ్గింపును పొందవచ్చు. కాగా దీని మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్‌పై రూ. 50,000 వరకు ఆఫర్‌ను ప్రకటించింది.

టయోటా మరియు మారుతి సుజుకి భాగస్వామ్యంతో రూపొందిన హైరైడర్‌ మాదిరిగానే గ్రాండ్ విటారా కూడా 1.5 - లీటర్ పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్, 1.5 - లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌ ఆప్షన్లను కలిగి ఉంది. ఇవి వరుసగా 103 PS మరియు 116 PS గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

Maruti-Suzuki-Offers-Nexa-Febraury-2024

దీంతో పాటు, Nexa, మారుతి సుజుకి Ignis మోడల్‌పై రూ. 59,000, Baleno పై రూ. 37, 000, ఫ్రాంక్స్‌ Turbo వేరియంట్‌పై రూ. 70,000 ఇంకా Ciaz మోడల్‌పై రూ. 52,000 వరకు డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ భారీ తగ్గింపుల ద్వారా మారుతి సుజుకి ఈ సారి కూడా అత్యధిక సంఖ్యలో సేల్స్‌ను నమోదు చేసుకోవాలనే యోచనలో ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 8, 2024, 12:01 [IST]
English summary
Maruti nexa discounts up to rs 1 5 lakh on jimny grand vitara ignis baleno and ciaz
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+