మారుతి నుంచి సరికొత్త కారు రాబోతుంది.. 35 కి.మీ మైలేజీ, రెండు ఫ్యామిలీలు హాయిగా వెళ్లవచ్చు!
భారతదేశంలో ఎంపీవీలకు (Multi-Purpose Vehicles) విపరీతమైన డిమాండ్ ఉంది. వీటికున్న క్రేజ్‌తో కార్ల ఉత్పత్తి సంస్థలు ఎక్కువగా ఎంపీవీలను అందుబాటులోకి తెస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఎంపీవీల అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. ఎక్కువ స్పేస్ కలిగి ఉండటం, దాదాపు 7 మంది హాయిగా ప్రయాణించేలా సీటింగ్, ఇతర అత్యాధునిక సాంకేతిక ఫీచర్లతో ఎంపీవీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ కార్లలో టూరింగ్ కూడా వెళ్లవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో మారుతి ఎర్టిగా, రెనాల్ట్ ట్రైబర్ ఎంపీవీ సెగ్మెంట్‌లో తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి.
గత కొన్ని సంవత్సరాలుగా వీటి అమ్మకాలు పెరుగుతున్నాయి. అందువల్లే కార్ల తయారీదారులు సైతం ఎక్కువగా ఎంపీవీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎంపీవీలు మాత్రమే కాకుండా మార్కెట్‌లో ఎక్కువగా ఎస్‌యూవీలు, హ్యాచ్‌బ్యాక్స్, సెడాన్లు అమ్ముడవుతున్నాయి. వీటిలో జనాలు ఎస్‌యూవీల తర్వాత ఎంపీవీలనే ఎంచుకుంటున్నారు. అయితే ఈ కథనంలో భారీ మైలేజీని అందించే మరో ఎంపీవీని మారుతి లాంచ్ చేయనుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఆ వివరాలు ఈ కథనంలో..

మారుతి సుజుకి నుంచి అందుబాటులో ఉన్న ఎర్టిగా (Ertiga) ప్రస్తుతం భారతదేశంలో ఎంపీవీ సెగ్మెంట్‌లో పాపులర్ ఎర్టిగా ముందంజలో ఉంది. భారత మార్కెట్లో దీని ధరలు రూ .8.69 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై టాప్-ఎండ్ వేరియంట్ రూ .13.03 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. అయితే మారుతి సుజుకి కొత్త కాంపాక్ట్ ఎంపీవీని దీని కంటే తక్కువ ధరలో ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోంది.
ధర తక్కువగా ఉండనుందనే ప్రకటనతో ఈ ఎంపీవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఒకవేళ ఎర్టిగా కంటే తక్కువ ధరలో లాంచ్ అయితే దేశంలోనే అత్యంత చౌకైన ఎంపీవీగా అవతరించనుంది. ప్రస్తుతం ఈ కారుకు 'వైడీబీ' అనే కోడ్ నేమ్ పెట్టారు. లాంచ్ దగ్గర పడుతున్న కొద్దీ పూర్తి పేరు రివీల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే జపాన్‌లో ఈ కారు స్పేసియా (Maruti Spacia) అనే పేరుతో అమ్మకానికి ఉంది.

భారత్‌లో లాంచ్ అయ్యే ఈ కారు జపనీస్ మోడల్‌ని పోలిన కొన్ని ఫీచర్లను కోల్పోయే అవకాశం ఉంది. కార్ల తయారీ సంస్థలు ఆయా దేశీయ మార్కెట్లకు అనుగుణంగా ధర ఆధారంగా డిజైన్, ఫీచర్లను అందిస్తున్నాయి. అయితే డిజైన్‌లో రెండు చూడటానికి దాదాపు ఒకేలా ఉంటాయి. ప్రస్తుతం వస్తున్న నివేదికల ప్రకారం, కొత్త మారుతి సుజుకి ఎంపీవీ జపాన్ మరియు ఇతర దేశాలలో కాంపాక్ట్ ఎంపీవీగా అందుబాటులో ఉంది.
ఇది 4 మీటర్ల కంటే తక్కువ పొడవుగా ఉంటుంది. ఇది 3 స్టెప్ సీటింగ్ ఆప్షన్‌తో వస్తుంది. కాబట్టి ఎక్కువ మంది కంఫర్ట్‌గా కూర్చోవచ్చు. ఫర్ఫామెన్స్ పరంగా చూస్తే ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 1.2-లీటర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. హైబ్రిడ్ ఇంజిన్ కావడంతో మైలేజీ కూడా పెరుగే అవకాశం ఉంది. ఇది లీటరుకు 35 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని అంచనా వేస్తున్నారు.

మారుతి సుజుకి ఇప్పటికే ఎంపీవీ సెగ్మెంట్‌లో ఎర్టిగాను భారీ మొత్తంలో విక్రయిస్తుంది. అయితే రానున్న ఎంపీని తక్కువ ధరకే ప్రవేశపెట్టడం సాహసమనే చెప్పవద్దు. అయితే ఇది 2026 ప్రారంభంలో లాంచ్ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక ఎర్టిగాకు పోటీగా భావిస్తున్న రెనాల్ట్ ట్రైబర్ ధర రూ .6.5 లక్షల నుంచి రూ .7 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








