మారుతీ సుజుకీ కార్లకు దేశంలోనే భారీ డిమాండ్.. దెబ్బకు ఒక్క ఏడాదిలో 20 లక్షల కార్ల తయారీ

దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్(Maruti Suzuki India Limited) ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో దూసుకుపోతుంది. మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటు ధరలో ఉండే విధంగా పలు రకాల మోడళ్లను లాంచ్ చేస్తూ దేశంలో అతిపెద్ద కార్ల ఉత్పత్తి కంపెనీగా ఉంది. మారుతీ కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఈ కంపెనీకి చెందిన కార్లు కనిపిస్తుంటాయి. ఉద్యోగాలు చేసే వారు మారుతీని ఎక్కువగా ఎంచుకుంటారు. వీటి డిజైన్ కూడా స్టైల్‌గా ఉండటంతో పాటు ప్రధానంగా మైలేజ్ అధికంగా వస్తుంది. ఇది ఇండియాలో అరేనా, నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా తన కార్లను సేల్ చేస్తుంది. భారత్‌లో ఆటోమొబైల్ రంగంలో ఎక్కువ వాటాను కలిగిన మారుతీ, కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా తన కార్ల ఉత్పత్తిని సైతం పెంచుతుంది. తాజాగా కంపెనీ వాహనాల ఉత్పత్తిలో సరికొత్త మైలురాయికి చేరుకుంది.

మారుతీ సుజుకీ ఇండియా నుంచి విడుదలైన డేటా ప్రకారం, కంపెనీ 2024 ఏడాదిలో దాదాపు 20 లక్షల కార్లను తయారు చేసింది. ఒక్క సంవత్సరంలోనే కంపెనీ ఇంత పెద్ద మైలురాయికి చేరుకోవడం అంటే సాధారణ విషయం కాదు. దేశీయ ప్రజల నుంచి మారుతీ కార్లకు డిమాండ్ అధికంగా వస్తుండటంతో దానికి అనుగుణంగా ఉత్పత్తి సైతం పెంచింది. ఈ మైలురాయితో కంపెనీ ఇండియా ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది.

Maruti Suzuki 2024 Cars Production

ముఖ్యంగా మారుతీ సుజుకీ నుంచి విడుదలైన కార్లలో దాదాపు 60 శాతానికి పైగా హర్యానా రాష్ట్రంలోని ప్లాంట్ నుంచే తయారు చేయబడ్డాయి. కంపెనీకి ఈ రాష్ట్రంలో మనేసర్ ఫెసిలిటీలో అసెంబుల్ ప్లాంట్ ఉంది. తన వాహనాలను ఇక్కడే ఎక్కువగా అసెంబుల్ చేస్తుంది. తరువాత మిగిలిన 40 శాతం కార్లను గుజరాత్‌లోని ప్లాంట్‌లో అసెంబుల్ చేసింది. మారుతీ ఫేవరెట్ మోడల్ ఎర్టిగా హర్యానాలో అసెంబుల్ అయింది.

మారుతీ సుజుకీకి మూడు వాహన తయారీ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో హర్యానా రాష్ట్రంలోని మనేసర్‌లో ఒకటి, గుర్గావ్‌లో మరోటి. మూడో ప్లాంట్ గుజరాత్ రాష్ట్రంలోని హంసల్‌పూర్‌లో ఉంది. వీటి ద్వారా మారుతీ కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా కార్లను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేస్తుంది. అన్నీ ప్లాంట్ల ద్వారా ఏడాదికి 23.5 లక్షల కార్ల ఉత్పత్తి జరుగుతుంది. రాను రాను మారుతీ కార్లకు డిమాండ్ పెరిగేలా ఉంది.

Maruti Suzuki 20 Lakh Cars Produced

దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా మారుతీ కార్లకు మంచి ఆదరణ వస్తుంది. దీంతో ఇక్కడి డిమాండ్‌ను తీర్చడంతో పాటు, ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి తన ఉత్పత్తిని పెంచడానికి క్రమంగా దృష్టి సారిస్తోంది. ఇందుకోసం తన వార్షిక ఉత్పత్తి కెపాసిటీని 40 లక్షల యూనిట్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం హర్యానా రాష్ట్రంలో కొత్తగా మరో ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది. ఇది వచ్చే ఏడాదిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

భారత్ నుంచి ఎగుమతి అవుతున్న ప్రయాణికుల వాహనాల్లో మారుతీ సుజుకీ వాటా 40 శాతం వరకు ఉంటుంది. లెక్కల ప్రకారం గత మూడు సంవత్సరాలుగా ఇండియా నుంచి అంతర్జాతీయంగా ఎగుమతి అవుతున్న కార్లలో ఎక్కువగా మరుతీ కంపెనీకి చెందినవే ఉంటాయి. డిజైర్, బాలెనో, స్విఫ్ట్ వంటి కార్లు ప్రపంచవ్యాప్తంగా 90కు పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

Maruti Suzuki 2024 Cars Production Details

త్వరలో దేశీయంగా ఉత్పత్తి మరింత పెరిగినట్లయితే రానున్న రోజుల్లో కస్టమర్లు కార్లను బుకింగ్ చేసుకున్న వెంటనే డెలివరీ చేయడానికి వీలవుతుంది. తయారీ పెరగడం వలన వెయిటింగ్ పీరియడ్ కూడా తగ్గిపోతుంది. అలాగే ఇతర దేశాలకు ఎగుమతులు కూడా మరింత పుంజుకుని అక్కడి ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా రవాణా కూడా మెరుగవుతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 18, 2024, 11:42 [IST]
English summary
Maruti suzuki 20 lakh cars produced in a single year
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+