భారీ మైలేజీ ఇచ్చే కొత్త డిజైర్ బుకింగ్స్ షురూ.. డిమాండ్ పెరగక ముందే పరుగెత్తండి!
మారుతీ సుజుకీ ఇండియా నుంచి కొత్తగా వస్తున్న కొత్త తరం స్విఫ్ట్ డిజైర్(new-gen swift Dzire) సెడాన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. లాంచ్‌కు ముందు డిజైర్‌ను చాలా సార్లు రోడ్లపై టెస్టింగ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఈ కారును నవంబర్ 11న భారతదేశంలో అధికారికంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ ఇటీవల ప్రకటించింది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కొన్ని ఏరియాల్లో ఓపెన్ అయినట్లు సమాచారం. కొంతమంది డీలర్లు ఈ ప్రాసెస్‌ను ప్రారంభించారు. అయితే మారుతీ సుజుకీ కంపెనీ అధికారికంగా ఎలాంటి బుకింగ్‌లను ప్రారంభించలేదు. ఇది త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కొత్త తరం స్విఫ్ట్ డిజైర్‌కు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొంతమంది డీలర్లు ఈ బుకింగ్‌లు ఓపెన్ చేశారు.
ఈ సెడాన్ బుకింగ్‌కు డీలర్లు కస్టమర్ల నుంచి రూ. 5 వేలు-రూ.10 వేల మధ్య వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బెంగళూరులో కొందరు డీలర్లు ఈ పనిలో నిమగ్నమైనట్లు వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా, చెన్నైలో కూడా కొంత మంది డీలర్లు కొత్త డిజైర్‌ల కోసం బుకింగ్‌లను ఓపెన్ చేసినట్లు పలువురు పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై చెన్నై డీలర్ల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.

ఇది కొత్త తరం మోడల్ కాబట్టి దీనిలో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. మామూలుగా స్విఫ్ట్ డిజైర్ కార్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంటుంది. అలాంటిది, ఈ కారులో చాలా ప్రీమియం ఫీచర్లు ఉన్నాయని సమాచారం బయటకు రావడంతో దీన్ని కొనుగోలు చేయాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు.
కొత్త తరం మారుతీ స్విఫ్ట్ డిజైర్ గురించి మాట్లాడుకుంటే దీని ప్రధాన అప్‌డేట్‌లలో మైలేజ్ హైలెట్‌గా ఉంది. పెట్రోల్ వెర్షన్ లీటరుకు 25 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఇది 1.2-లీటర్ మూడు-సిలిండర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇంజిన్ 81 bhp పవర్ వద్ద 111.7 nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి.

సీఎన్‌జీ వెర్షన్‌లో కూడా లభిస్తున్న డిజైర్ కిలోకు 32.85 కి.మీ మైలేజీని ఇస్తుంది. రెండు ఇంజిన్ ఆప్షన్‌లో కారు ఫెర్ఫామెన్స్ అద్బతంగా ఉంటుంది. ఈ సెడాన్ 5 సీటింగ్ ఆప్షన్‌తో ఉంది. చిన్న కుటుంబాలకు సరిపోతుంది. కొత్త సెడాన్ రూ.6.70 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో చాలా అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
పాత దానితో పోలిస్తే, లోపల క్యాబిన్ ప్రీమియం లుక్‌ను కలిగిస్తుంది. 9-ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 360-డిగ్రీ కెమెరా, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రికల్‌గా ఫోల్డబుల్, అడ్జస్టబుల్ ORVMలు కారులో ఉన్నాయి.
ముందు సుజుకీ లోగో, కొత్త గ్రిల్‌ను కలిగి ఉన్న బాక్సీ డిజైన్, రెండు కొత్త LED హెడ్‌ల్యాంప్‌లు ఇంటిగ్రేటెడ్ LED DRLలు, టర్న్ ఇండికేటర్లు ఉన్నాయి. సింగల్ ప్యానెల్ సన్ రూఫ్ మరో హైలైట్, ఫాగ్ ల్యాంప్ కూడా ఉంది. బయటి వైపు మెటల్ ఫినిషింగ్ విండో సిల్స్, కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ చూపరులను కట్టిపడిసేలా ఉన్నాయి.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








