32 కి.మీ మైలేజీ ఇచ్చే ఈ స్విఫ్ట్ డిజైర్ మాములుది కాదు బాబోయ్.. ధర కూడా బడ్జెట్‌లోనే!

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా నుంచి వచ్చే కొత్త కార్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంటుంది. వాటిలో అందించే ఫీచర్లు, డిజైన్ ప్రజలను బాగా ఆకట్టుకుంటాయి. ఈ కంపెనీ నుంచి ఏదైనా కొత్త మోడల్ విడుదల అయిందంటే దాని గురించి చాలా మంది ఆన్‌లైన్‌లో వెతుకుతుంటారు. ఇప్పుడు మారుతీ సుజుకీ నుంచి కొత్త తరం మారుతీ స్విఫ్ట్ డిజైర్(new-gen swift Dzire) సెడాన్ త్వరలో దేశంలో విడుదల కాబోతుంది. ఈ సెడాన్‌ను నవంబర్ 11న అధికారికంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. లాంచ్‌కు ముందు డిజైర్‌ను చాలా సార్లు రోడ్లపై టెస్టింగ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫోటోల్లో కొత్త తరం డిజైర్ సూపర్‌ లుక్‌తో కనిపిస్తుంది. పాత మోడల్ కంటే చాలా స్టైలిష్ లుక్‌‌తో వచ్చింది. ఈ కారుకు సంబంధించిన ఇతర వివరాలు క్రింది కథనంలో ఉన్నాయి.

కొత్త తరం మారుతీ స్విఫ్ట్ డిజైర్ 32 కి.మీ వరకు మైలేజీ వరకు ఇస్తుంది. ఈ రేంజ్‌లో మైలేజీ అందించే కారును చాలా మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. ఇది 1.2-లీటర్ మూడు-సిలిండర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇంజిన్ 81 bhp పవర్ వద్ద 111.7 nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి.

Maruti Suzuki 2024 New Swift Dzire 32Km Mileage

కొత్త సెడాన్ రూ.6.70 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో చాలా అధునాతన ఫీచర్లు ఉన్నాయి. పాత దానితో పోలిస్తే, లోపల క్యాబిన్ ప్రీమియం లుక్‌ను కలిగిస్తుంది. 9-ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇతర ఫీచర్లలో వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, కారులో నుంచే చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ కెమెరా, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రికల్‌గా ఫోల్డబుల్, అడ్జస్టబుల్ ORVMలు కారులో ఉన్నాయి. ముందు భాగంలో సుజుకి లోగో, పియానో ​​బ్లాక్, క్రోమ్ ఎలిమెంట్స్‌తో కూడిన కొత్త గ్రిల్‌ను కలిగి ఉన్న బాక్సీ డిజైన్‌ ఉంది. రెండు కొత్త LED హెడ్‌ల్యాంప్‌లు ఇంటిగ్రేటెడ్ LED DRLలు, టర్న్ ఇండికేటర్లు కారుకు ఉన్నాయి.

Maruti Suzuki 2024 New Swift Dzire Launch On November 11th

ముఖ్యంగా ఈ కారుకు సింగల్ ప్యానెల్ సన్ రూఫ్ మరో హైలైట్‌గా నిలుస్తుంది. దీంతో పాటు ఫాగ్ ల్యాంప్ కూడా ఉంది. బయటి వైపు మెటల్ ఫినిషింగ్ విండో సిల్స్, కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ చూపరులను కట్టిపడిసేలా ఉన్నాయి. పాత వాటి లాగే ఈ మోడల్ కూడా 5 సీటింగ్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది డిఫరెంట్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

ఇది ఆర్కిటిక్ వైట్, షెర్వర్డ్‌ బ్రౌన్, ఫీనిక్స్ రెడ్, బ్లూ బ్లాక్ బ్లాక్, మాగ్మా గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్ వంటి కలర్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లో అందుబాటులోకి వస్తున్నప్పటికి త్వరలో సీఎన్‌జీ వెర్షన్ కూడా మార్కెట్లోకి రాబోతుంది. దీని గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మారుతీ సుజుకీ స్విఫ్ట్ డిజైర్ నవంబర్ 11న మార్కెట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రాబోతుంది. ఇప్పటికే పాత డిజైర్ ఇండియాలో మంచి ఆదరణ ఉన్న మోడల్‌గా ఉంది. ఇదే సిరీస్‌లో అప్‌డేటెడ్‌గా వస్తున్న కొత్త తరం డిజైన్ కూడా అంచనాలకు అనుగుణంగా దేశీయ కస్టమర్లను ఆకర్షించి అత్యధిక అమ్మకాలను నమోదు చేస్తుందని కంపెనీ భావిస్తోంది.

Maruti Suzuki 2024 New Swift Dzire Features

More from DriveSpark

Article Published On: Wednesday, October 30, 2024, 16:00 [IST]
English summary
Maruti suzuki 2024 new swift dzire launch date and all top things check here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+