షోరూముల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న కార్లు.. 7 లక్షలకు పైగా కార్లు కస్టమర్ల కోసం పడిగాపులు!
మారుతి సుజుకి భారతదేశంలోని అతిపెద్ద కార్ల తయారీదారులలో ఒకటిగా ఉంది. అయితే ప్రస్తుతం కంపెనీ భారీ నష్టాల ఊబిలో చిక్కుకుందని షాకింగ్ రిపోర్టులు వెల్లడవుతున్నాయి. ఈ కంపెనీ అమ్మకాలు ప్రస్తుతం ఆశించిన స్థాయిలో లేవు. ఫలితంగా లక్షలాది కార్లు షోరూమ్‌ల్లో అమ్మకుండా నిలిచిపోయాయని నివేదికలు చెబుతున్నాయి. దీనిని సరిదిద్దడానికి మారుతి సుజుకి తన కారు ఉత్పత్తిని గణనీయంగా తగ్గించింది. ఆ వివరాలు ఈ కథనంలో..
2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మారుతి కంపెనీ అంచనా వేసిన సేల్స్ కంటే డిమాండ్ చాలా తక్కువగా వచ్చింది. అయితే వాహనాల తయారీ ఎప్పటిలాగానే యధావిధిగా తయారు చేయడంతో డీలర్‌షిప్స్ వద్ద వాహన నిల్వలు పెరిగాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిని గమనించిన కంపెనీ ముందు జాగ్రత్తగా ఇప్పుడు ఉత్పత్తిని తగ్గించింది.

కంపెనీ సేల్స్ తగ్గడంతో వాహన నిల్వలు కూడా పెరిగాయని బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది. అదే సమయంలో మారుతి సుజుకి మాత్రమే కాకుండా మరికొన్ని కంపెనీలకు చెందిన కార్ల సంస్థలు కూడా స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నట్లు వెల్లడైంది. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) ఓ ప్రకటన విడుదల చేసింది.
మొత్తం డీలర్‌షిప్స్ వద్ద 7,30,000 అమ్ముడుపోని వాహనాలు ఉన్నాయని తెలిపింది. ఇవి కేవలం రెండు నెలల అమ్మకాలకు సరిపోయే యూనిట్లు సంఖ్యతో సమానంగా ఉన్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) ఈ సంఖ్యను సుమారు 400,000 యూనిట్లుగా అంచనా వేసింది. ఈ అమ్మకాలు అనేవి కేవలం ఓ అంచనా మాత్రమేనని వెల్లడించాయి. అయితే ఈ సంఖ్య కాస్త అటు ఇటుగా ఉంటుందని పేర్కొంది.

ఏది ఏమైనా ఇంత పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడం భారత ఆటో సెగ్మెంట్‌కి ఆందోళన కలిగించే అంశమే అని చెప్పాలి. ఈ మార్కెట్ డీలా పడిపోడాన్ని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి ఇప్పటికే ఉత్పత్తిపై ఫోకస్ తగ్గించింది. అదే సమయంలో మార్కెట్‌లో కొత్త వాహనాలకు త్వరలోనే డిమాండ్ పెరిగే అవకాశం ఉందని భావిస్తుంది.
ఎందుకంటే రానున్న పండుగ సీజన్‌లో వినాయక చవితి మొదలుకొని సంక్రాంతి వరకు దేశంలో వాహనాల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని, మారుతి సుజుకి మార్కెట్ డిమాండ్‌కి తగినట్లుగా నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. భారత ఆటో మార్కెట్ సాధారణంగా ప్రతీ ఏడాది ద్వితీయార్ధంతో పోలిస్తే మొదటి త్రైమాసికం మందకొడిగా ఉంటుంది.
అయితే ఈ సంవత్సరం లోక్‌సభ ఎన్నికలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాలు, తీవ్రమైన వేడి కారణంగా ఈ ఏడాది కొన్ని కంపెనీలు అమ్మకాలు తగ్గాయి. ఫలితంగా లక్షలాది వాహనాలు అమ్ముడుపోలేదు. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మారుతి సుజుకి ఉత్పత్తి అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 7.4 శాతం పెరిగింది.
మారుతి సుజుకి ఉత్పత్తి సామర్థ్యం 4,96,000 యూనిట్లుగా ఉంది. అయితే అమ్మకాలు మాత్రం 1.2 శాతం మాత్రమే పెరిగి కేవలం 4.27 లక్షల యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇది మొత్తం మార్కెట్ వాటాలో 40 శాతం కావడం గమనార్హం. అయినా కానీ భారత ఆటోమొబైల్ ప్రపంచంలో మారుతి సుజుకి నంబర్ 1 స్థానంలో ఉంది. అయితే కంపెనీకి ఇలాంటి పరిస్థితి రావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








