రూ.4 లక్షల ధర కలిగిన మారుతి కారుపై రూ.45 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు.. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే..!
మారుతి సుజుకి సంస్థ (Maruti Suzuki) తన మోడల్ కార్లపై భారీ తగ్గింపు ప్రయోజనాలను ప్రకటించింది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజీ బోనస్ సహా వివిధ తగ్గింపులున్నాయి. తగ్గింపు ప్రయోజనాలు పొందిన వాహనాల్లో ఆల్టో హ్యాచ్‌బ్యాక్‌తో సహా అనేక మోడళ్లు ఉన్నాయి.
ఈ ఆఫర్‌లో భాగంగా మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki alto) మోడల్‌పై రూ.45000 వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందింది. 2023 మోడల్ కార్లపై రూ.30000 క్యా్ష్ డిస్కౌంట్ మరియు రూ.15000 ఎక్స్చేంజీ బోనస్‌లున్నాయి. 2024 మోడల్స్‌లో రూ.23000 నగదు తగ్గింపు, రూ.15000 ఎక్స్చేంజీ బోనస్‌లు ఉన్నాయి.

మారుతి సుజుకి ఆల్టో హ్యాచ్‌బ్యాక్‌పై ఉన్న ఆఫర్ల జనవరి 31 వరకు మాత్రమే వర్తిస్తాయి. ఈ డిస్కౌంట్ ప్రయోజనాలు డీలర్, వేరియంట్, రంగు సహా స్టాక్ ఆధారంగా మారుతు ఉంటుంది. మరియు రాష్ట్రాలను బట్టి కూడా మారుతుంటుంది. ప్రస్తుతం ఆల్టో k10 ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల (ఎక్స్‌షోరూం) ధరను కలిగి ఉంది.
ఈ కారు LXI, VXi, VXI ప్లస్ వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. మెటాలిక్ సిజ్లింగ్ రెడ్, మెటాలిక్ సిల్కీ సిల్వర్, మెటాలిక్ గ్రానెట్ గ్రేతో సహా 7 మోనోటోన్ రంగుల్లో లభిస్తుంది. ఈ వాహనంలో 4 ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణం చేసేందుకు వీలుంటుంది.

మారుతి సుజుకి ఆల్టో k10 పెట్రోల్, CNG వేరియంట్లలో లభిస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ 1.0 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. గరిష్ఠంగా 67ps శక్తి, 89Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
ఆల్టో CNG వేరియంట్ కూడా 1.9 డ్యూయల్‌జెట్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 57ps శక్తి, 82Nm గరిష్ఠ టార్క్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మారుతి సుజుకి ఆల్టో పెట్రోల్ వేరియంట్ 24.39kmpl - 24.90 kmpl మైలేజీని ఇస్తుంది అదే సీఎన్‌జీ వేరియంట్ 33.40 km/kg - 33/85 km/kg మైలేజీతో వస్తుంది.

మారుతి ఆల్టో k10 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కీలెస్ ఎంట్రీ, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, ఐడిల్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ 214 లీటర్ బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది.
మారుతి సుజుకి మెరుగై సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, రివర్సింగ్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌పైన ఉన్న ఆఫర్ జనవరి 31 మాత్రమే వర్తించనుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








