గత 24 ఏళ్లుగా ఈ కారుని ఆదరిస్తున్న జనాలు.. 33 కి.మీ మైలేజీ, ధర రూ.3.99 లక్షలు, ఇప్పటికీ టాప్ లేపుతోంది!
మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto) గత రెండు దశాబ్దాలుగా దేశంలో అత్యంత విశ్వసనీయమైన కారుగా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి ఉంటూ తన సత్తాను చాటుతోంది. ఈ కారుని తొలిసారిగా 2000 సంవత్సరంలో మారుతి సుజుకి లాంచ్ చేసింది. అప్పటి నుంచి ఈ కారు భారీ సంఖ్యలో అమ్ముడవుతూ వస్తుంది. ఇప్పటి వరకు మొత్తం 50 లక్షలకు పైగా కార్లను విక్రయించింది. ఈ కారు 24 సంవత్సరాలుగా మార్కెట్‌లో తిరుగులేని శక్తిగా ఉంది. ఇప్పటికీ ప్రతి నెలా 10,000 మందికి పైగా కొత్త కస్టమర్లు ఈ కారుని కొనుగోలు చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలపై ఓ లుక్కేయండి.
భారతదేశంలో అత్యంత సరసమైన కారుగా ఉంది. దీని ప్రారంభ ధర రూ.3.99 లక్షలుగా ఉంది. ఆల్టో కె 10 మారుతి అప్‌డేటెడ్ హార్ట్‌ఎక్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి నిర్మించబడింది. ఇది కె-సిరీస్ 1.0L K-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 66 ps పవర్ వద్ద 89 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 24 కి.మీ మైలేజీని ఇస్తుంది.

ఇది సీఎన్‌జీ వెర్షన్‌లోనూ అందుబాటులో ఉంటుంది. ఇది ఒక కిలో సీఎన్‌జీ 33 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ ఆల్టో కె 10లో ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), రివర్స్ స్టాపింగ్ సెన్సార్లు ఉన్నాయి. ఫ్రంట్ సీట్ బెల్ట్స్, పవర్ రేంజ్ ప్రీ, స్పీడ్-సెన్సిటివ్ ఆటోమేటిక్ డోర్ లాక్స్, మెరుగైన భద్రత కోసం స్పీడ్ సెన్సింగ్ అలర్ట్స్ కూడా ఇందులో ఉన్నాయి.
ఆల్టో కె 10 ఇంటీరియర్‌లో ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌తో రీడిజైన్ చేయబడిన స్టీరింగ్ వీల్‌ని కలిగి ఉంది. ఇందులో ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, USB, బ్లూటూత్, AUX కనెక్టివిటీని సపోర్ట్ చేసే 7 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ కలదు. ఇది S-ప్రెస్సో, వ్యాగన్-ఆర్ వంటి ఇతర మారుతి మోడళ్లలో కూడా ఈ సిస్టమ్ అందుబాటులో ఉంది.

మారుతి 1982 లో సుజుకితో మారుతి ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఆల్టోను మొదటిసారిగా సెప్టెంబర్ 27, 2000 న భారత మార్కెట్లో విడుదల చేశారు. ఇది ప్రారంభంలో విదేశాలలో విక్రయించబడిన మోడల్ నుంచి ప్రేరణ పొందింది, దాని ఆకట్టుకునే డిజైన్ మరియు ఫీచర్ల కారణంగా ఇది త్వరగా ప్రజాదరణ పొందింది. అప్పట్లో ఈ కారు ఓ వెలుగు వెలిగింది. ఇప్పటికీ చాలా మందికి ఇదే ఫేవరెట్ కారుగా ఉంది.
అక్టోబర్ 2012 లో, మారుతి అప్‌డేటెడ్ లుక్, భారీ ఫీచర్లతో ఆల్టో నెక్ట్స్ జనరేషన్ వెర్షన్‌ని విడుదల చేసింది. ఇది వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంది. తక్కువ ధరలో భారీ మైలేజీ ఇస్తుండటం, నలుగురు హాయిగా ఇందులో వెళ్లే సదుపాయం ఉండటంతో ఈ కారు అమ్మకాలు అమాంత పెరిగాయి. 2015 లో మారుతి ఆల్టోని స్ట్రాంగ్ 1.0-లీటర్ కె 10 బి ఇంజిన్ అమర్చడంతో సేల్స్ జెట్ స్పీడ్‌లో దూసుకెళ్లాయి.

అంతే కాకుండా ఇది ప్రస్తుతం గ్లోబల్ NCAP మెథడాలజీలో ఇది 2 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ని కలిగి ఉంది. సేఫ్టీ పరంగా ఇది తక్కువే అయినా తక్కువ ధర కారణంగా దీని అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. రెండు దశాబ్దాలకు పైగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా, మారుతి సుజుకి ఆల్టో కస్టమర్ల నమ్మకాన్ని మరింత రెట్టింపు చేస్తూ దూసుకెళ్తుంది.


Click it and Unblock the Notifications








