మారుతి కార్ల ధరలు తగ్గాయి.. రూ. 3.99 లక్షల కారు మరింత చౌకగా.. రూ. 4.26 లక్షల ఎస్‌-ప్రెస్సో ధర కూడా తగ్గింపు!

సాధారణంగా మారుతి సుజుకి సరసమైన ధరలోనే కార్లను అందిస్తుంది. తాజాగా ఆ కంపెనీ లైనప్‌ లోని రెండు పాపులర్ కార్ మోడళ్ల ధరలను తగ్గించి ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పండుగ సీజన్‌లో మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలు, ఓ చిన్న కార్ కొనుగోలు చేయాలనుకునే వారిని టార్గెట్‌ చేస్తూ ధరలను తగ్గించినట్లు భావిస్తున్నారు. ఆ కంపెనీలో ఫేమల్‌ లో బడ్జెట్‌ కార్లు మారుతి సుజుకి ఆల్టో K10 (Maruti Alto K10), ఎస్-ప్రెస్సో (S-Presso) ధరలను తగ్గించింది. ఈ కార్ల ధరలు ఎంత తగ్గించారు? దీనికి సంబంధించిన వివరాలను ఈ కథనంలో చూడబోతున్నాం.

మార్కెట్‌లో మారుతి సుజుకికి చెందిన ఈ రెండు మినీ కార్ మోడళ్లకు డిమాండ్‌ కాస్త ఎక్కువే ఉంది. కానీ ఇటీవలి కాలంలో ఈ రెండు చిన్న కార్ల మోడళ్లకు డిమాండ్ ఊహించన రీతిలో తగ్గింది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. అతి ముఖ్యమైన కారణం మార్కెట్‌లో ఎస్‌యూవీల హహా కొనసాగుతుండటం.. జనాలు లో-బడ్జెట్‌ కార్లపై అంతగా ఆసక్తి చూపకపోతుండటం అని చెప్పవచ్చు.

Maruti Suzuki Alto K10 and S Presso Prices cut down

మార్కెట్లో ఎస్‌యూవీలకు పదిరెట్లు డిమాండ్ పెరిగింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భారతీయులు ఎస్‌యూవీ ప్రియులుగా మారిపోయారు. ఫలితంగా ఇటీవలి కాలంలో హ్యాచ్‌బ్యాక్స్‌, సెడాన్లతో సహా ఇతర కార్ మోడళ్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఎస్‌యూవీలు, ఎంపీవీలను జనాలను ఎక్కువగ కొంటున్నారు. దీంతో మిగతా మోడళ్ల కార్ల సేల్స్‌ తగ్గుతున్నాయి.

మారుతి సుజుకి దేశీయంగా ఎక్కువ మందిని ఆకట్టుకోవడానికి ఆల్టో కె 10, ఎస్‌-ప్రెస్సో ధరలను విపరీతంగా తగ్గించింది. గణేష్ చతుర్థి, దసరా, దీపావళి పండుగలతో త్వరలో భారతదేశంలో సందడి వాతావరణం నెలకొననుంది. ఈ పండుగ సీజన్‌ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్ మోడళ్ల ధరలను భారీగా తగ్గించింది. అందులో భాగంగా ఆల్టో కే10 వీఎక్స్ (Alto K10 VXI) వేరియంట్ ధర రూ. 6,500 తగ్గింపుని అందిస్తుంది.

Maruti Suzuki Alto K10 and S Presso Prices cut down

అదేవిధంగా, ఎస్-ప్రెస్సో ఎల్ఎక్స్ఐ (Maruti S-Presso LXI) వేరియంట్ ధర రూ. 2,000 తగ్గించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ రెండు వేరియంట్లు మాత్రమే ధర తగ్గింపును పొందాయి. అదే సమయంలో మరికొన్ని కార్ మోడళ్ల ధరలు త్వరలోనే తగ్గే అవకాశం ఉంది. వీటికి వచ్చే రెస్పాన్స్‌ని బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. దీని ప్రకారం అతి త్వరలోనే మిగతా వేరియంట్ల ధరలు కూడా తగ్గనున్నాయి.

మారుతి ఆల్టో కె 10 భారతదేశంలో పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు మోడల్ ధర రూ. ప్రారంభ ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.80 లక్షల వరకు ఉంది. అదేవిధంగా, ఎస్-ప్రెస్సో పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్‌తో వస్తుంది. దీని ప్రారంభ ధర రూ.4.26 లక్షల నుంచి రూ.5.95 లక్షల మధ్య ఉంది.

మారుతి సుజుకి ఈ రెండు కార్ మోడళ్లను ఇష్టపడే కస్టమర్లను ఆకర్షించే పనిలో ఉంది. ఈ ధర తగ్గింపు ఈ రెండు కార్ మోడళ్ల అమ్మకాలను గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు. ఎస్‌యూవీలకు భారత్‌లో భారీ స్పందన లభిస్తోంది. అందుకే ఆటోమొబైల్ కంపెనీలు ఈ సెగ్మెంట్ పై దృష్టి సారించి తమ కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకురావడానికి చురుగ్గా పనిచేస్తున్నాయి.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు

More from DriveSpark

Article Published On: Tuesday, September 3, 2024, 9:51 [IST]
English summary
Maruti suzuki alto k10 and s presso prices reduced to boost sales
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+