నెలకు రూ. 5000 చెల్లిస్తే చాలు.. 36 కి.మీ మైలేజ్‌ ఇచ్చే కారు మీ సొంతం.. ఈ ఛాన్స్‌ అస్సలు మిస్‌ కాకండి.!!

కారు కొనాలని చూస్తున్నారా.. అది కూడా రూ. 5 లక్షల లోపు ధరలో కొనాలనుకుంటున్నారా.. ఇప్పుడు మీకు ఇంతకంటే మంచి అవకాశం ఇంకోటి ఉండదు. కొంచెం ప్లానింగ్‌ పాటిస్తే చాలు 36 కి.మీ మైలేజ్‌ ఇచ్చే కారును నెలకు రూ. 5000 కట్టి సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం..

దేశంలో ఇప్పుడు కారు నిత్యావసరంగా మారిపోయింది. లాంగ్‌ జర్నీలకు ప్రజా రవాణాపై ఆధారపడకుండా సొంత వాహనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు అనుగుణంగా మార్కెట్లో రకరకాల మోడళ్లలో కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని కార్ల ఖరీదు రూ. 10 లక్షల పైనే.. ఈ మొత్తాన్ని అందరూ వెచ్చించలేరు.

Maruti-Suzuki-Alto-K10-Loan-EMI

అందుకే చాలా మంది తక్కువ ధరలో అందుబాటులో ఉండే కార్ల కోసం చూస్తుంటారు. కానీ ఇక్కడ ఇంకో డౌటానుమానం ఉంటుంది మీకు.. లో బడ్జెట్‌ కార్లలో అన్ని సౌకర్యాలు, అధిక మైలేజ్‌ సదుపాయం ఉంటుందా అని.. అలాంటి వారికోసమే ఇక్కడ ఓ మంచి అవకాశాన్ని అందిస్తున్నాం.

దేశంలో ప్రస్తుతం కస్టమర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నెలవారీ EMI మరియు కారు నిర్వహణ మరియు ఫ్యూయెల్‌ ఖర్చులు. కారు కొనడం ఏమో కానీ.. ఈఎంఐలు కట్టేసరికే తాతలు గుర్తొస్తారని చాలా మంది ఆవేదన చెందుతుంటారు. కానీ మీరు ఇక్కడ తక్కువ EMI చెల్లించి మంచి మైలేజ్‌, లో మెయింటెనెన్స్‌ కారును సొంతం చేసుకోవచ్చు.

Maruti-Suzuki-Alto-K10-Loan-EMI

అటువంటి కారు ఒకటి మార్కెట్లో ఉంది. ఈ కారు బైక్‌లాగా మంచి మైలేజ్‌ను కూడా ఇస్తుంది. అంతే కాకుండా దీని ధరతో పాటు ఈఎమ్‌ఐ కూడా చాలా తక్కువ. ట్రాఫిక్‌లోనూ మీరు సులభంగా ప్రయాణించవచ్చు. మీ రోజువారీ ప్రయాణం కూడా చాలా సౌకర్యంగా, సులభంగా ఉంటుంది. అదే మారుతి సుజుకికి చెందిన ఆల్టో కె10(Maruti Suzuki Alto K10).

భారత మార్కెట్లోనే అత్యంత చవకైన కారు మారుతి సుజుకి ఆల్టో కె 10. ఈ కారు తక్కువ ధరలో లభించడమే కాకుండా అధిక మైలేజ్‌ను కూడా ఇస్తుంది. ఈ కారును సంస్థ పెట్రోల్‌ ఇంజిన్‌లో ప్రవేశపెట్టగా.. ఇప్పుడు ఇందులో సీఎన్‌జీ ఆప్షన్‌ కూడా ఉండటం మరో విశేషం..

Maruti-Suzuki-Alto-K10-Loan-EMI

మారుతి సుజుకి ఆల్టో కె 10 కారు ధర విషయానికొస్తే, ఇది రూ. 3.99 లక్షల నుండి రూ. 5.96(ఎక్స్‌-షోరూమ్‌) లక్షల మధ్య మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కారు ధర చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి. నగర అవసరాలకు అనువుగా ఉంటుంది. ఇది చిన్న కారు అయినప్పటికీ ఇందులో ఐదుగురు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

ఆల్టో కె10 ఇంజిన్ విషయానికొస్తే, ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. దీనిని CNG ఆప్షన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. పెట్రోల్ ఇంజిన్‌లో 65.71 బిహెచ్‌పి పవర్ మరియు సిఎన్‌జి వెర్షన్‌లో 55.92 బిహెచ్‌పి పవర్ అవుట్ ఉంటుంది. ఈ ఇంజిన్ హై స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

Maruti-Suzuki-Alto-K10-Loan-EMI

ఆల్టో K10 పెట్రోల్ ఇంజిన్‌పై 28 కి.మీ మైలేజ్‌ మరియు CNG పై 36 కి.మీ మైలేజీని అందిస్తుంది. కస్టమర్లకు ఇంకో అడ్వాంటేజ్‌ ఏంటంటే.. ఈ కారు నిర్వహణ కూడా చాలా తక్కువ. నెలకు కేవలం మీకు రూ. 400 నుంచి 500 లలో మెయింటెనెన్స్‌ అయిపోతుంది. దీని బూట్ స్పేస్ 214 లీటర్లుగా ఉంది.

ఇక ఈఎంఐ విషయానికొస్తే.. ఈ కారును మీరు రూ. 4.43 లక్షల ఆన్‌రోడ్‌ ధరలో కొనుగోలు చేస్తునట్లయితే.. అడ్వాన్స్‌గా రూ.1.32 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.3.11 లక్షలు లోన్ ద్వారా చెల్లించవచ్చు. 9 శాతం వడ్డీతో 7 ఏళ్లపాటు నెలకు రూ. 5000 చెల్లిస్తే సరిపోతుంది.

Maruti-Suzuki-Alto-K10-Loan-EMI

అయితే మీ శాలరీ, మీ బ్యాంకు ఖాతా లావాదేవీలు లేదా బిజినెస్‌ ఆధారంగా మీరు ఈ రుణానికి అర్హులా? కాదా? అనేది మీరు నేరుగా షోరూమ్‌కి వెళ్లి అక్కడ మీ పత్రాలను సమర్పించి తెలుసుకోవచ్చు. ఒకసారి షోరూమ్‌లోని కార్ లోన్ ప్రొవైడర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకోవచ్చు. అప్పుడే మీకు ఎంత రుణం వస్తుందనే వివరాలపై స్పష్టత వస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 29, 2024, 11:26 [IST]
English summary
Maruti suzuki alto k10 available with less emi and down payment plan details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+