భారీగా పెరగనున్న కార్ల ధరలు ఇప్పుడే కొనండి.. లేదంటే జేబులు ఖాళీ అవ్వడం ఖాయం!
ఇటీవలె హ్యుందాయ్ మోటార్స్ ఇండియా 2025 జనవరి నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజాగా మారుతి సుజుకి కూడా ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. మాస్ మార్కెట్‌లో క్రేజ్ ఉన్న మారుతి కార్ల పెంపు కొత్త కారు కొనాలని భావిస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు భారంగా మారే అవకాశం ఉంది. దేశంలోనే మొత్తం అమ్మకాల్లో టాప్ 2లో ఉన్న ఈ రెండు కార్ల కంపెనీలు షాకింగ్ ప్రకటన చేశాయనే చెప్పవచ్చు. హ్యుందాయ్ తన లైనప్స్‌లోని మోడళ్ల ధరలను రూ .25,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఈ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే మారుతి సుజుకి సైతం రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించడం గమనార్హం. మారుతి సుజుకి ధరలు దాదాపు 4 శాతం పెరిగే అవకాశం ఉంది. మోడళ్లు, వేరియంట్లను బట్టి ధరల్లో మార్పులు ఉండనున్నాయి. అతి త్వరలోనే పెరగనున్న ధరలను కంపెనీ వెల్లడించనుంది. పెరుగుతున్న ఇన్‌పుట్, మెయింటైనెన్స్ ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతి పేర్కొంది.

ఈ రెండు టాప్ కంపెనీల నుంచి ధరల పెంపు నిర్ణయంతో త్వరలోనే ఇతర కంపెనీలు సైతం పెంపుని ప్రకటించే అవకాశం ఉంది. వీటితో పాటు ఇది వరకే మెర్సిడెస్ బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ, ఆడీ కార్ల సంస్థలు కూడా ధరల పెంపుని ప్రకటించాయి. అయితే ఇవి లగ్జరీ కార్లు కావడంతో మాస్ మార్కెట్‌పై అంతగా ప్రభావం చూపవు. ఈ కంపెనీలు కూడా ఇన్‌పుట్ ఖర్చులు పెరిగినట్లు పేర్కొన్నాయి.
ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి అదే సమయంలో వినియోగదారులపై ప్రభావం పడకుండా ఉండేందుకు యత్నిస్తున్నట్లు మారుతి సుజుకి వెల్లడించింది. పెంపు ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ఇన్‌పుట్ మార్కెట్‌కి బదిలీ చేయాల్సి వస్తుందని చెప్పింది. ఇది మార్కెట్‌లో రెట్టింపు సర్వీసుని అందించేదుకు దోహదపడుతుందని కంపెనీ అభిప్రాయపడింది. ప్రస్తుతం మార్కెట్లో మారుతి సుజుకి 40 శాతం వాటాను కలిగి ఉంది.

ఎప్పటి వలె మార్కెట్‌లో సింహభాగం వాటాను మారుతి కలిగి ఉంది. గత నెలలో మారుతి మొత్తం 1.44 యూనిట్ల కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే సమయానికి 1.34 యూనిట్లను సేల్ చేసింది. గత నెలలో ఈ కంపెనీ నుంచి బాలెనో అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది. వీటితో పాటు ఎర్టిటా ఎంపీవీ, బ్రెజా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా వంటివి ఉన్నాయి.
ఇక ఎక్స్‌ఎల్6, ఇన్విక్టో ఓ మోస్తారు అమ్మకాలతో రాణిస్తున్నాయి. మార్కెట్‌లో మారుతి కార్ల ధరల పెంపు మాస్ మార్కెట్‌లో సేల్స్‌పై కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో ధరలు పెంపుతో పాటు డిస్కౌంట్లు, ఫెస్టీవ్ ఆఫర్లతో తక్కువ ధరలో కార్లను కొనుగోలు చేయవచ్చు. హ్యుందాయ్ కార్లపై సైతం మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

ఇక హ్యుందాయ్ నుంచి క్రెటా, ఎక్స్‌టర్, ఐ10 గ్రాండ్ నియోస్, ఐ20, ఆరా, వెన్యూ, వెర్నా, టక్సన్, ఐయోనిక్ వంటి కార్లు అందుబాటులో ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ అమ్మకాల్లో టాప్‌లో ఉంది. ఇక మైక్రో ఎస్‌యూవీ విభాగంలో ఎక్స్‌టర్ అదరగొడుతోంది. హ్యుందాయ్ డ్యూయెల్ సిలిండర్ సీఎన్‌జీ కార్లు సైతం మార్కెట్‌లో పాపులారిటీని సాధిస్తున్నాయి. అమ్మకాల్లో హ్యుందాయ్ సేల్స్‌ని బీట్ చేసేలా మహీంద్రా కార్లు అతి చేరువుగా ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








