ఇది కదా కావాల్సింది!.. మారుతి సుజుకి అదిరిపోయే డిస్కౌంట్స్..

2024 ప్రారంభమై మూడు నెలలు ముగిసింది. నాలుగో నెల(ఏప్రిల్) కూడా వచ్చేసింది. ఈ తరుణంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ మీద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మారుతి సుజుకి ఈ నెలలో ఆల్టో కే10, ఎస్ ప్రెస్సో, వ్యాగన్ ఆర్, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్ మరియు ఈకో కార్ల మీద అద్భుతమైన తగ్గింపులను అందిస్తోంది. కంపెనీ ఈ కార్ల కొనుగోలు మీద క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ మరియు ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. ఈ డిస్కౌంట్స్ లేదా బెనిఫిట్స్ కేవలం ఈ నెలకు మాత్రమే పరిమితని తెలుస్తోంది.

Maruti Suzuki Alto K10

మారుతి ఆల్టో కే10

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి కార్లలో ఆల్టో కే10 ఒకటి. ఈ కారు కొనుగోలుపై కస్టమర్లకు కంపెనీ రూ.62000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. మాన్యువల్ వేరియంట్ మీద రూ.57000, సీఎన్‌జీ వేరియంట్ మీద రూ. 42000 తగ్గింపులు ఉన్నాయి. రూ.3.99 లక్షల ధర నుంచి రూ.5.96 లక్షల మధ్య లభించే ఈ కారు 1.0-లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది.

మారుతి ఎస్-ప్రెస్సో

మారుతి ఆల్టో కే10 మాదిరిగానే అదే 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఎస్-ప్రెస్సో రెనాల్ట్ క్విడ్ కారుకు ప్రత్యర్థిగా ఉంటుంది. కంపెనీ ఇప్పుడు ఎస్-ప్రెస్సో ఆటోమాటిక్ వేరియంట్ కొనుగోలుపైన రూ. 61000, మాన్యువల్ వేరియంట్ మీద రూ. 56000 తగ్గింపు అందిస్తుంది. ఇక CNG వేరియంట్ కొనుగోలుపైన కస్టమర్ రూ.46000 తగ్గింపు పొందవచ్చు. ఎస్-ప్రెస్సో ధరలు రూ.4.27 లక్షల నుంచి రూ. 6.12 లక్షల మధ్య ఉంటుంది.

Maruti Suzuki Celerio

మారుతి సెలెరియో

మారుతి సెలెరియో మాన్యువల్ వేరియంట్ కొనుగోలుపైన రూ. 56000, ఆటోమాటిక్ వెర్షన్ కొనుగోలుపైన రూ. 61000 మరియు CNG వేరియంట్ కొనుగోలుపైన కస్టమర్ రూ. 46000 తగ్గింపును పొందవచ్చు. రూ. 3.37 లక్షల నుంచి రూ. 7.10 లక్షల ధర మధ్య ఉండే ఈ కారు 1.0 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 67 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి వ్యాగన్ ఆర్

వ్యాగన్ ఆర్ కొనుగోలుపైన మారుతి సుజుకి రూ.61000 (ఆటోమాటిక్ వేరియంట్) తగ్గింపును అందిస్తోంది. మాన్యువల్ వేరియంట్ కొనుగోలుపైన రూ. 56000 తగ్గింపు పొందవచ్చు. CNG వేరియంట్ కొనుగోలుపైన కంపెనీ రూ.36000 డిస్కౌంట్ అందిస్తోంది. దీని ధర రూ.5.55 లక్షల నుంచి రూ.7.26 లక్షల మధ్య ఉంది. ఈ కారు 1.0-లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.2-లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది.

Maruti Suzuki Swift

మారుతి స్విఫ్ట్

మారుతి సుజుకి అంటే అందరికి గుర్తొచ్చేది స్విఫ్ట్. ఇప్పుడు కంపెనీ ఈ కారుపైన రూ. 42000 డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ తగ్గింపు స్విఫ్ట్ ఆటోమాటిక్ వేరియంట్ కొనుగోలుపై లభిస్తుంది. ఇక మాన్యువల్ వేరియంట్ కొనుగోలుపైన రూ. 37000 డిస్కౌంట్ మరియు CNG వేరియంట్ మీద రూ. 22000 వరకు తగ్గింపు లభిస్తుంది. స్విఫ్ట్ ధరలు మార్కెట్లో రూ. 5.99 లక్షల నుంచి రూ. 8.89 లక్షల మధ్య ఉన్నాయి.

మారుతి డిజైర్

టాటా టిగోర్, హ్యుందాయ్ ఆరా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న మారుతి డిజైర్ కొనుగోలుపైన కంపెనీ అద్భుతమైన తగ్గింపులను అందిస్తోంది. డిజైర్ ఆటోమాటిక్ వేరియంట్ కొనుగోలుపైన రూ. 37000, మాన్యువల్ వేరియంట్ కొనుగోలుపైన రూ. 32000, CNG వెర్షన్ మీద రూ. 7000 తగ్గింపు లభిస్తుంది. డిజైర్ ధరలు రూ. 6.57 లక్షల నుంచి రూ. 9.39 లక్షల మధ్య ఉన్నాయి.

Maruti Suzuki Eeco

మారుతి ఈకో

మారుతి ఈకో కొనుగోలుపైన కూడా కస్టమర్లు ఈ నెలలో తగ్గింపులను పొందవచ్చు. పెట్రోల్ వేరియంట్ మీద రూ. 29000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. CNG వెర్షన్ మీద రూ. 24000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈకో ధరలు ప్రస్తుతం రూ. 5.32 లక్షల నుంచి రూ. 6.28 లక్షల మధ్య ఉన్నాయి. డిస్కౌంట్స్ కేవలం ఈ నెలకు మాత్రమే పరిమితం.

Note: మారుతి సుజుకి కంపెనీ ఎంపిక చేసిన కార్ల మీద అందించే డిస్కౌంట్స్ కేవలం ఈ నెలలో కొనుగోలు చేసినవారికి మాత్రమే లభిస్తాయి. అయితే డిస్కౌంట్స్ గురించి ఖచ్చితమైన వివరాలను తెలుసుకోవడానికి సమీపంలోని డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. అయితే ఈ డిస్కౌంట్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండవచ్చు, లేదా ఉన్న స్టాక్ మీద ఆధారపడి ఉండే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, April 4, 2024, 11:16 [IST]
English summary
Maruti suzuki april 2024 discounts from alto k10 to eeco
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+