రూ. 6.66 లక్షలు చెల్లించండి చాలు.. 30 కి.మీ మైలేజీ, ఎప్పుడు టాప్‌-10లో ఉండే ఈ కారుని ఇంటికి తీసుకెళ్లొచ్చు!

దేశంలో మారుతి కార్లకు కాస్త డిమాండ్ ఎక్కువే. ఎందుకంటే ఈ కార్లు సరసమైన ధరలో అందుబాటులో ఉండటం ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ సంస్థ నెక్సా, ఎరీనా డీలర్‌షిప్స్‌ ద్వారా కార్లను విక్రయిస్తుంది. వీటి ద్వారా కంపెనీ లైనప్‌లోని ఆల్టో K10, సెలెరియో, వ్యాగన్‌ఆర్, ఇగ్నిస్, స్విఫ్ట్, ఫ్రాంక్స్, జిమ్నీతో సహా అనేక కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ కారు కంపెనీ కార్లు ఆగస్టు సేల్స్‌లో దుమ్మురేపాయి. ఎక్కువగా అమ్ముడైన టాప్‌-10 కార్లలో మొత్తం 6 మారుతి సుజుకి కార్లు నిలిచాయి. వీటిలో పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో (Baleno) కూడా ఉంది. ఇది టాప్‌-10 లో 8వ స్థానంలో ఉంది.

మారుతి సుజుకి ఆగస్టులో సుమారు 12,485 యూనిట్ల బాలెనో హ్యాచ్‌బ్యాక్స్‌ అమ్ముడుపోయాయి. గత సంవత్సరం 2023లో 18,653 యూనిట్లతో పోలిస్తే ఇది 31 శాతం ఈ కార్లు సేల్స్‌ క్షీణించాయి. ఈ ఏడాది అమ్మకాలు భారీగా తగ్గినా టాప్‌-10లో చోటు సంపాదించింది. అయితే వచ్చే పండుగ సీజన్‌లో ఈ కారు అమ్మకాలు భారీగా పుంజుకునే అవకాశం ఉంది.

Maruti Suzuki Baleno Sales in August 2024

ప్రస్తుతం దేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉన్న మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno) హ్యాచ్‌బ్యాక్ ధర రూ .6.66 లక్షల నుంచి రూ .9.83 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ కారు సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా సహా వివిధ వేరియంట్లు ఉన్నాయి. ఇది నెక్సా బ్లూ, ఆర్కిటిక్ వైట్, గ్రాండియర్ గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

ఈ బాలెనో హ్యాచ్‌బ్యాక్‌ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది సీఎన్‌జీ వెర్షన్‌లోనూ అందుబాటులో ఉంటుంది. ఈ వేరియంట్లు 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ఈ కారు పెట్రోల్‌ వేరియంట్‌ 22.35 నుంచి మైలేజీని అందిస్తుంది. సీఎన్‌జీ వెర్షన్‌ కేవలం మాన్యూవల్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌లో వస్తుంది. ఇది 30.61 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

Maruti Suzuki Baleno Sales 2024

మారుతి సుజుకి బాలెనో కారులో 5 మంది సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. అంతే కాకుండా దీనిలో సుదూర ప్రాంతాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. ఇందులో ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి వీలుగా 318 లీటర్ల బూట్ స్పేస్‌ని కలిగి ఉంది. ఈ కారు చూడటానికి ప్రీమియం లుక్‌ని కలిగి ఉంటుంది. అందువల్ల కొని నెలలుగా ఈ కారు సెల్లింగ్‌లో నంబర్‌ 1 గా నిలిచింది.

ఈ బాలెనో హ్యాచ్‌బ్యాక్‌లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇంకా మరెన్నో అధునాతన ఫీచర్లతో ఈ కారు వినియోగదారులకు కచ్చితంగా నచ్చుతుంది.

Maruti Suzuki Baleno

ఈ కారులో సేఫ్టీ ఎక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్‌, ఇబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ఎబిఎస్ (యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఇఎస్‌పీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), హిల్ హోల్డ్ అసిస్ట్, 3-పాయింట్ సీట్ బెల్ట్స్‌, రియర్ పార్కింగ్ సెన్సార్స్‌, 360 డిగ్రీల కెమెరా వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 10, 2024, 15:59 [IST]
English summary
Maruti suzuki baleno august 2024 sales report check here in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+