31 కి.మీల మైలేజ్ కారు.. అమ్మకాల్లో రెచ్చిపోయింది.. షోరూమ్‌కు ఎగబడ్డ జనం.. ఇతర కార్లకు దిమ్మతిరిగే షాక్!
ఇండియాలో కార్ల కొనుగోళ్లు ఇటీవల కాలంలో బాగా పుంజుకున్నాయి. దేశీయంగా ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మెరుగైన విక్రయాలను నమోదు చేశాయి. ప్రధానంగా మారుతీ సుజుకీ కంపెనీ తన కార్ల అమ్మకాల పరంగా మంచి గణంకాలు సాధించింది. ఇండియన్ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో ఫేమస్ అయినటువంటి మారుతీ బాలెనో కారు ఈ అక్టోబర్‌లో ఇతర కార్ల కంటే కూడా ఎక్కువ అమ్మకాలను నమోదు చేసి పండుగ సీజన్‌లో ఆల్‌టైమ్ హిట్ మోడల్‌గా నిలిచింది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే టయోటా గ్లాంజా, హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ వంటి పోటీ మోడళ్లు కూడా విక్రయాల పరంగా మారుతీ సుజుకీ బాలెనోకు దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గత నెలలో ఎక్కువ విక్రయాలను సమోదు చేయడానికి ప్రధానంగా పండుగల టైంలో ఇచ్చిన ఆఫర్లు, తగ్గింపులు కారణం.
వినియోగదారులకు దీపావళి పండుగ సమయంలో కంపెనీ, డీలర్లు ప్రత్యేకంగా ఇచ్చిన తగ్గింపులను ఉపయోగించుకున్నారు. అందుకే 2024 అక్టోబర్ నెలలో బాలెనో కారును మొత్తం 16,082 మంది కొనుగోలు చేశారు. అదే దాని ముందు నెల సెప్టెంబర్ నెలలో విక్రయాలు 14,292 గా ఉన్నాయి. అంటే దాదాపు ఒక నెలలో బాలెనో అమ్మకాలు 11.13 శాతం వృద్ధి చెందాయని డేటాను చూస్తే తెలుస్తుంది.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మారుతీ సుజుకీ బాలెనో రూ.6.66 లక్షల ప్రారంభ ధరకే కొనుగోలుకు అందుబాటులో ఉంది. కొత్తగా కారు కొనుగోలు చేయాలని అనుకున్న వారు తక్కువ ధరలో హైఎండ్ ఫీచర్స్ కలిగిన వాటిని ప్రధానంగా ఎంచుకుంటారు. అలాంటి వారికి బాలెనో మోడల్ బాగా సెట్ అవుతుంది. పైగా చిన్న కుటుంబానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. అక్టోబర్‌లో ఇది మరింత తక్కువ ధరకు లభించడంతో దీని అమ్మకాలు పెరిగాయి.
ఇతర ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్ల కంటే కూడా పండుగ సీజన్ బాలెనోకు అమ్మకాలు పెంచుకోడానికి బాగా ఉపయోగపడింది. ఇది ఇండియా మార్కెట్లో మధ్యతరగతి వారిని బాగా ఆకట్టుకుంది. పనితీరు, డిజైన్, ఫీచర్లు అన్ని కూడా వినియోగదారులకు నచ్చేలా ఉంటాయి. బాలెనో ప్రారంభ ధర రూ.6.66 లక్షలుగా ఉన్నప్పటికీ దీని టాప్ వేరియంట్ ధర రూ.9.83 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా కొనుగోలుకు లభిస్తుంది.

ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ధర అందుబాటులో ఉండటంతో పాటు ఇది పెట్రోల్, CNG వెర్షన్లలో లభించడం వల్ల దేశీయ ప్రజలను కారు బాగా ఆకట్టుకుంది. పెట్రోల్ వెర్షన్ వద్దనుకున్న వాళ్లు CNG ని సైతం కొనుగోలు చేయవచ్చు. రెండింటి ఫీచర్లు ఒకే విధంగా ఉన్నప్పటికి ఇంజిన్లు మాత్రం వేరుగా ఉంటాయి. అయితే ఈ రెండు వేరియంట్లు 1.2 లీటర్ నేచురల్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి.
బాలెనో పెట్రోల్, CNG వెర్షన్లలో ఇంజిన్‌ల మధ్య మూడు తేడాలు కనిపిస్తాయి. గేర్‌బాక్స్ ఆప్షన్ వేరుగా ఉంటుంది. పెట్రోల్ వెర్షన్‌లో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. కానీ CNG వెర్షన్‌లో మాత్రం, 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను మాత్రమే అందించారు. పెట్రోల్ వెర్షన్ 90 PS పవర్, 113 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది.

అదే CNG లో 77.50 PS పవర్, 98.50 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా మైలేజ్ కూడా బాగానే ఉంటుంది. పెట్రోల్ మాన్యువల్, AMD వేరియంట్‌లు లీటర్‌కు 22.35 కి.మీల మైలేజ్ ఇస్దుంది. అదే CNG వేరియంట్ మాత్రం ఏకంగా కిలో ఇంధనానికి 30.61 కి.మీ వరకు మైలేజ్ అందిస్తుంది. ఎక్కువ మైలేజ్, తక్కువ ధరలో ఈ కారు భారతీయ వినియోగదారులను బాగా ఆకట్టుకుంటుంది.


Click it and Unblock the Notifications








