సరికొత్త ఎడిషన్‌లో మారుతీ ప్రీమియం కారు విడుదల.. ఇది చాలా స్పెషల్ గురూ!
ఇండియాలో ఆటోమొబైల్ విభాగంలో అగ్రస్థానంలో ఉన్న మారుతీ సుజుకీ(Maruti Suzuki)పండుగల సమయంలో కొత్తగా స్పెషల్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. దీని పేరు 'బాలెనో రీగల్ ఎడిషన్(Baleno Regal Edition)'. ఈ సీజన్‌లో అమ్మకాలను పెంచుకోడానికి ప్రస్తుతం ఉన్న మోడళ్లకు అదనంగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. రీగల్ ఎడిషన్ మాన్యువల్, ఆటోమేటిక్, CNG వేరియంట్‌లతో సహా బాలెనో అన్ని వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ కారులో మెరుగైన క్యాబిన్, వినియోగదారులకు అవసరమయ్యే అన్ని ఫీచర్లను అందించారు. ఇది ఆల్ఫా, జీటా, డెల్టా, సిగ్మా అనే ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. కొత్తగా కారును కొనుగోలు చేయాలని చూస్తున్నవారికి ఇది చాలా మంచి ఆప్షన్‌గా ఉంటుంది. ధర రూ. 6.66 లక్షలతో మొదలై రూ. 9.83 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
ఇంజిన్ సామర్థ్యం: బాలెనో రీగల్ ఎడిషన్ పెట్రోల్(Petrol) ఇంజిన్ 1.2-లీటర్ డ్యూయల్-జెట్ డ్యూయల్-VVTతో వచ్చింది. ఇది 89.73PS గరిష్ట శక్తి వద్ద 113Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే CNG ఎంపికలో 77.5PS గరిష్ట శక్తి వద్ద 98.5Nm టార్కును విడుదల చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో 5-స్పీడ్ MT(మాన్యువల్ ట్రాన్స్మిషన్), 5-స్పీడ్ AMT(ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) ఉన్నాయి.

ఎక్స్‌టీరియర్-ఇంటీరియర్ డిజైన్: బాలెనో రీగల్ ఎడిషన్ బయట నుంచి చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. ముందు మెరుగైన LED హెడ్‌లైట్లు, లోపల 9.0-అంగుళాల స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, అప్‌డేట్ చేసిన సీట్ కవర్‌లు, ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, విండో కర్టెన్‌లు, విలాసవంతమైన అనుభూతిని ఇచ్చే ఆల్-వెదర్ 3D మ్యాట్‌లు ఉన్నాయి.
ఇంకా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ జోన్, ఆటో డిమ్మింగ్ IRVM, కారులో నుంచి చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీల కెమెరా, ఫాగ్ ల్యాంప్ గార్నిష్, ప్రయాణికుల భద్రత కోసం ఆరు Aix ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్(ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, ABS, 40కి పైగా స్మార్ట్ ఫీచర్‌లు, సుజుకీ కనెక్ట్ టెలిమాటిక్స్ వంటి భద్రతా ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.
బాలెనో రీగల్ ఎడిషన్ ప్రత్యేకమైన స్టైలింగ్ లుక్‌తో అధునాతన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లను కోరుకునే కస్టమర్‌లను ఆకర్షించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. బాలెనో రీగల్ ఎడిషన్‌లో ఉన్న నాలుగు వేరియంట్లలో అదనపు హంగులు ఇచ్చారు. వీటి ఫీచర్ల ఆధారంగా కస్టమర్లు తమ నచ్చిన దాన్ని కొనుగోలు చేయవచ్చు. అన్ని వేరియంట్లకు కూడా వేరు వేరుగా ధరలు నిర్ణయించారు.
ఆల్ఫా(Alpha) వేరియంట్: సీట్ కవర్ డ్యూయల్ టోన్ లైనర్ ఫినిషింగ్‌తో వస్తుంది. దీనిలో అన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా 3D మ్యాట్‌ను అందించారు. 3D బూట్ మ్యాట్ అదనపు ఆకర్షణగా ఉంది. ఫాగ్ లాంప్ గార్నిష్, ప్రీమియం బాడీ కవర్, ఇంటీరియర్ స్టైలింగ్ కిట్‌తో కారు లోపల అందంగా ఉంటుంది. ఈ వేరియంట్‌కు అదనంగా రూ.45,829 అవుతుంది.
సిగ్మా(Sigma) వేరియంట్: ఈ వేరియంట్ ఫ్రంట్ అండర్ బాడీ స్పాయిలర్, డ్యూయల్-టోన్ లైనర్ ఫినిషింగ్ సీట్ కవర్లు, ఆల్-వెదర్ 3D మ్యాట్‌లు, బాడీ సైడ్ మౌల్డింగ్, మడ్ ఫ్లాప్‌లను కలిగి ఉంది. క్రోమ్ గ్రిల్ అప్పర్ గార్నిష్, 3D బూట్ మ్యాట్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఇంటీరియర్ ప్రీమియం స్టీరింగ్ కవర్, ఇంటీరియర్ స్టైలింగ్ కిట్‌తో ఉన్న దీనికి అదనంగా రూ.60,200 చెల్లించాలి.
డెల్టా(Delta) వేరియంట్: డెల్టా వేరియంట్‌లో డ్యూయల్ టోన్ లైనర్ ఫినిషింగ్‌తో సీట్ కవర్, ఆల్-వెదర్ 3D మ్యాట్‌లు, క్రోమ్ గ్రిల్ అప్పర్ గార్నిష్, వెనుక క్రోమ్ గార్నిష్, ఇంటీరియర్ అప్‌గ్రేడ్‌లలో ఇంటీరియర్ స్టైలింగ్ కిట్ ఉన్నాయి. ఈ వేరియంట్ మొత్తం నాలుగు డోర్‌లకు విండో కర్టెన్‌లతో వస్తుంది. డెల్టా వేరియంట్ ధర రూ.49,990.
జీటా(Zeta) వేరియంట్: జీటా వేరియంట్‌లో ఫ్రంట్, రియర్ అండర్ బాడీ స్పాయిలర్‌లు, వెనుక క్రోమ్ యాక్సెంట్‌లు, లోపల డ్యూయల్-టోన్ సీట్ కవర్లు, ఆల్-వెదర్ 3D మ్యాట్‌లు ఉన్నాయి. అలాగే, బ్లాక్ కలర్‌లో ఉన్న NEXA కుషన్, ప్రీమియం బాడీ కవర్, ఇంటీరియర్ స్టైలింగ్ కిట్ వంటివి ఉన్నాయి. జీటా వేరియంట్‌కు అదనంగా రూ.50,428 చెల్లించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








