31 కి.మీ మైలేజీ ఇచ్చే ఆ ప్రీమియం కారు ధర అంత తక్కువా? ప్రతీ నెలా టాప్-10లో ఓ స్థానం ఆ కారుకి ఫిక్స్!
దేశంలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లను జనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ఈ రకమైన కార్లకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ విభాగంలో పదుల సంఖ్యలో కార్లు ఉన్నాయి. అయితే జనాలు మాత్రం ఎక్కువగా టయోటా గ్లాంజా, హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ ఇతర కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి బాలెనో (maruti Suzuki Baleno) ఆధిపత్యం చెలాయిస్తుంది. వాస్తవానికి భారత్‌లో ఎక్కువ మారుతి కార్లకు డిమాండ్ ఉంటుంది. అయితే మారుతి సుజుకి బాలెనో అమ్మకాలు 2024 సెప్టెంబర్‌లో క్షీణించాయి.
గత నెలకు సంబంధించిన సేల్స్ వివరాలను ఒక్కో కంపెనీ ఇప్పటికే వెల్లడించాయి. ఒక్కో కారుకి సంబంధించిన సేల్స్ వివరాల విషయానికి వస్తే మారుతి సుజుకి బాలెనో సేల్స్‌లో అంతంతమాత్రంగానే అమ్మకాలను రాబట్టింది. సెప్టెంబర్‌లో మారుతి సుజుకి కేవలం 14,292 యూనిట్లను మాత్రమే విక్రయించింది. దీని సేల్స్ 22.40 శాతం క్షీణించాయి. సేల్స్ తగ్గినా కానీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అమ్మాకాల్లో ఈ కారు సత్తా చాటింది.

ఇదే కారు గత ఏడాది సెప్టెంబరులో 18,417 యూనిట్లను మారుతి విక్రయించింది. 2023 సెప్టెంబర్‌తో పోల్చితే 4,125 మారుతి సుజుకి బాలెనో యూనిట్లు తగ్గాయి. అయితే పండుగ సీజన్ కారణంగా మారుతి సుజుకి బాలెనో వెంటనే భారీగా కస్టమర్లను ఆకర్షిస్తుందని కంపెనీ భావిస్తోంది. ఇది కంపెనీ ఓవరాల్ ఫర్ఫామెన్స్‌కి సైతం ఊతమిస్తుందని ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌పై కంపెనీ ఆశలు పెట్టుకుంది.
మారుతి సుజుకి బాలెనో ప్రారంభ రూ .6.66 లక్షల నుంచి కారు టాప్ వేరియంట్ ధర రూ .9.83 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ మారుతి సుజుకి బాలెనో పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్స్ 1.2-లీటర్ ఇంజిన్‌తో పనిచేస్తాయి. ఈ ఇంజిన్ 90 ps, 113 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఇక ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. మాన్యువల్ వేరియంట్ 22.35 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అలాగే AMT 22.94 కిలోమీటర్లను అందిస్తుంది. ఈ కారు సీఎన్‌జీ వేరియంట్లు అదే 1.2-లీటర్ ఇంజిన్‌తో కాని ఇందులో పవర్ 77.50 ps, 98.50 nm టార్క్‌కి తగ్గుతుంది.
సీఎన్‌జీ వెర్షన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. ఇది కిలో సీఎన్‌జీకి 30.61 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ మారుతి సుజుకి బాలెనోలో ప్రీమియం ఫీచర్లు ఉండటం.. సమయంలో అధిక మైలేజీని అందిస్తుండటంతో జనాలు దీనిని కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. గత సంవత్సరం నుంచి ఈ కారు టాప్-5 లోనే కొనసాగుతోంది. కొన్నిసార్లు మాత్రం టాప్ 10లో చోటు దక్కించుకుంటోంది.

ఈ కారులో 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ వంటివి ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.
అన్ని సీట్లకు త్రీ పాయింట్ సీట్ బెల్ట్, సీట్ బెల్ట్ రిమైండర్, రియర్ డీఫాగర్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా 360 డిగ్రీల కెమెరా, రియర్ వ్యూ కెమెరా, ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్, హెడ్స్‌అప్ డిస్ ప్లే వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. చాలా తక్కువ ధరలో అధిక మైలేజీని అందించే కారు కోసం చూస్తున్నట్లైతే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది.


Click it and Unblock the Notifications








