జనాలు ఎక్కువగా ఆ కంపెనీ SUVలను మాత్రమే కొంటున్నారు.. ఈ జాబితాలో ఉన్న కార్లు ఇవే!
దేశంలో ప్రతీ నెలా మారుతి సుజుకి లక్ష యూనిట్లకు పైనే కార్లను విక్రయిస్తుంది. ఎందుకంటే మాస్ మార్కెట్‌లో ఈ కంపెనీ కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. అందువల్ల మారుతి సుజుకి ఏ కొత్త కారుని మార్కెట్‌లో ప్రవేశపెట్టినా అది సూపర్ హిట్ అవుతుంది. అయితే కొన్ని విభాగాల్లో మాత్రం మారుతి వెనకబడి ఉంటుంది. ముఖ్యంగా ఈ కంపనీ నుంచి ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో లేవు. అలాగే సబ్-4 మీటర్ ఎస్‌యూవీల విషయంలో మారుతి సుజుకి చాలా వెనకబడి ఉంటుంది. ఈ కంపెనీ కేవలం బడ్జెట్ కార్లకు మాత్రమే కట్టుబడి ఉంటుంది.
మార్కెట్‌లో సబ్-4 మీటర్ల ఎస్‌యూవీలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీలు 4 మీటర్ల కంటే తక్కువ పొడవుతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ విభాగంలో హ్యుందాయ్, టాటా మోటార్స్‌ల నుంచి మారుతికి గట్టి పోటీ ఎదురవుతోంది. అయితే గత మూడు నెలల్లో సబ్-4 మీటర్ల ఎస్‌యూవీ అమ్మకాల్లో సీన్ రివర్స్ అయ్యింది. ఈ విభాగంలో టాటా మోటార్స్‌ని మారుతి సుజుకి అధిగమించింది. ఇది ఆటోమొబైల్ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

మార్కెట్‌లో టాటా మోటార్స్‌కి చెందిన నెక్సాన్, పంచ్ కార్లు మంచి మార్కెట్‌ని కలిగి ఉన్నాయి. ఇవి తక్కువ కాలంలోనే మంచి విజయాన్ని సాధించాయి. టాటా నెక్సాన్, పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్ లోనూ అందుబాటులో ఉన్నాయి. వీటి ఆధిపత్యంతో టాటా మోటార్స్ సబ్-4 మీటర్ల ఎస్‌యూవీ విభాగంలో మారుతి సుజుకికి గట్టి పోటీని ఇచ్చింది. ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి బ్రెజా, ఫ్రాంక్స్, జిమ్నీ అనే మూడు మోడల్స్‌ని విక్రయిస్తోంది.
గత మూడు నెలల క్రితం వరకు ఈ 3 మారుతి కార్లు 2 టాటా కార్ల అమ్మకాలను అధిగమించలేకపోయాయి. కానీ మారుతి సుజుకి గత 3 నెలలుగా (జూలై-సెప్టెంబర్ 2024) అమ్మకాల్లో టాటా మోటార్స్ ఆధిపత్యానికి చెక్ పెట్టింది. జూలై-సెప్టెంబర్ మధ్య మొత్తం 83,136 సబ్-4 మీటర్ల ఎస్‌యూవీలను టాటా మోటార్స్ విక్రయించింది. ఇందులో టాటా పంచ్ 45,475 యూనిట్లు, నెక్సాన్ 37,661 యూనిట్లుగా ఉన్నాయి.

ఇక మారుతి సుజుకి గత మూడు నెలల్లో మొత్తం 89,994 సబ్-4 మీటర్ల ఎస్‌యూవీలతో అదరగొట్టింది. ఈ లెక్కన మారుతి సుజుకి గత మూడు నెలల్లో టాటా మోటార్స్ కంటే 6,858 సబ్-4 మీటర్లు ఎక్కువగా విక్రయించింది. మారుతి విక్రయించిన వాటిలో 49,188 బ్రెజా, 37,186 ఫ్రాంక్స్, 3,620 జిమ్నీ యూనిట్లు ఉన్నాయి.
2024 సెప్టెంబర్‌లోనూ మారుతీ సుజుకి పైచేయి సాధించింది. సెప్టెంబర్ 2018 లో మారుతి సుజుకి 15,322 బ్రెజా యూనిట్లు, 13,874 ఫ్రాంక్స్ యూనిట్లు, 599 జిమ్నీ యూనిట్లను విక్రయించింది. మరోవైపు, టాటా మోటార్స్ గత నెలలో 25,181 సబ్-4ఎం ఎస్‌యూవీలన విక్రయిస్తే.. ఇందులో 13,711 పంచ్ కార్లు, 11,470 నెక్సాన్ కార్లు ఉన్నాయి.

గత ఏడాది కాలంలో టాటా మోటార్స్ 3,64,344 సబ్-4 మీటర్ల ఎస్‌యూవీలను విక్రయించగా.. మారుతి సుజుకి 3,35,764 యూనిట్లను విక్రయించింది. టాటా పంచ్ ఈ ఏడాది వరుసగా మూడు నెలల్లో (ఏప్రిల్, మే, జూన్) భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. రానున్న నెలల్లో ఈ అమ్మకాల సంఖ్యలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయో లేదో వేచి చూడాలి.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








