మారుతి బ్రెజ్జా స్పెషల్ ఎడిషన్.. కొత్త కారు గురించి సరికొత్త విషయాలు!

భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు లేదా అప్డేటెడ్ వాహనాలు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే ప్రముఖ వాహన తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) దేశీయ విఫణిలో 'బ్రెజ్జా అర్బానో ఎడిషన్' (Brezza Urbano Edition) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారును కొనాలనుకులే వారు తప్పకుండా దీని గురించి తెలుసుకునే విషయాలు ఏంటి? వేరియంట్స్, ధరలు, డిజైన్, ఫీచర్స్ మరియు ప్రత్యర్థులు ఏవి అనే చాలా విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. వీటిన్నంటి గురించి తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే..

వేరియంట్స్

మారుతి సుజుకి బ్రెజ్జా అర్బానో ఎడిషన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో ఒకటి ఎంట్రీ లెవల్ ఎల్ఎక్స్ఐ మరియు మిడ్ లెవల్ వీఎక్స్ఐ వేరియంట్స్. ఈ స్పెషల్ ఎడిషన్ ధరలు రూ. 8.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ ఎడిషన్ కంటే కూడా అప్డేట్ అయి ఉంటుంది. అదనపు యాక్ససరీస్ కూడా పొందుతుంది. కాబట్టి దీని ధర స్టాండర్డ్ ఎడిషన్ కంటే కొంత ఎక్కువగానే ఉంటుంది.

Maruti Suzuki Brezza

ఎల్ఎక్స్ఐ ఎడిషన్

మారుతి సుజుకి బ్రెజ్జా అర్బానో ఎల్ఎక్స్ఐ ఎడిషన్ రియర్ పార్కింగ్ కెమెరా, టచ్‌స్క్రీన్, స్పీకర్లు, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్ కిట్, ఫాగ్ ల్యాంప్ గార్నిష్, ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్లు, ఫ్రంట్ గ్రిల్ క్రోమ్ గార్నిష్, బాడీ సైడ్ మౌల్డింగ్ మరియు వీల్ ఆర్చ్ కిట్ వంటివి పొందుతుంది. ఈ యాక్ససరీస్ కోసం కొంత డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఇవన్నీ కారును మరింత హుందాగా కనిపించేలా చేస్తాయి.

వీఎక్స్ఐ ఎడిషన్

బ్రెజ్జా అర్బానో ఎడిషన్ వీఎక్స్ఐ ఎడిషన్ రియర్ కెమెరా, ఫాగ్ ల్యాంప్స్, స్పెషల్ డాష్‌బోర్డ్ ట్రిమ్, బాడీ సైడ్ మౌల్డింగ్, వీల్ ఆర్చ్ కిట్, మెటల్ సిల్ గార్డ్‌లు, రిజిస్ట్రేషన్ ప్లేట్ ఫ్రేమ్ మరియు 3డీ ఫ్లోర్ మ్యాట్‌ వంటి వాటిని పొందుతుంది. ఈ వస్తువులు విడివిడిగా కొనాలంటే రూ. 26149 చెల్లించాలి. కిట్‌గా కొనుగోలు చేస్తే రూ. 18500 వెచ్చించాల్సి ఉంటుంది.

Maruti Suzuki Brezza Rear Profile

ఇంజిన్

కొత్త మారుతి బ్రెజ్జా అర్బానో ఎడిషన్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 103 హార్స్ పవర్ మరియు 137 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు ఆప్షనల్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో జత చేయబడి ఉంటుంది. మారుతి బ్రెజ్జా CNG రూపంలో కూడా మార్కెట్లో లభిస్తుంది.

ప్రత్యర్థులు

దేశీయ విఫణిలో అడుగుపెట్టిన మారుతి బ్రెజ్జా స్పెషల్ ఎడిషన్ ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఈ కారు దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా ఆధునికంగా మరియు హుందాగా ఉంటుందని తెలుస్తోంది.

Maruti Suzuki Brezza Front Design

భారతదేశంలో వాహన వినియోగం ఎక్కువవుతోంది. అయితే చాలా మంది వాహన వినియోగదారులు ఆధునిక వాహనాలు లేదా అప్డేటెడ్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు కూడా ఆధునిక ఉత్పత్తులను లాంచ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. కంపెనీలు లాంచ్ చేసే ఆధునిక ఉత్పత్తులు తప్పకుండా వాహన వినియోగదారులను ఆకర్షిస్తాయి. దీంతో మార్కెట్లో బ్రాండ్ ఉనికి కూడా స్థిరంగా ఉంటుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, July 8, 2024, 10:12 [IST]
English summary
Maruti suzuki brezza urbano edition highlights
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+